Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (5) Surah: Al-Fātiḥah
اِیَّاكَ نَعْبُدُ وَاِیَّاكَ نَسْتَعِیْنُ ۟ؕ
మేము అన్ని రకాల ఆరాధనలను, విధేయతను నీకు మాత్రమే ప్రత్యేకించుకుంటాము. మరియు నీకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించము. మా వ్యవహారలన్నింటిలో సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తాము. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నీవు తప్ప మాకు సంరక్షకుడు మరొకడు లేడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• افتتح الله تعالى كتابه بالبسملة؛ ليرشد عباده أن يبدؤوا أعمالهم وأقوالهم بها طلبًا لعونه وتوفيقه.
తన దాసులకు వారి ఆచరణలు మరియు పలుకులను ఆయన పేరుతో ప్రారంభించి,ఆయన సహాయాన్ని మరియు ఆయన అనుగ్రహాన్ని పొందవలెనని సూచించటానికి మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంధాన్ని బిస్మిల్లాహ్ తో ఆరంభించాడు.

• من هدي عباد الله الصالحين في الدعاء البدء بتمجيد الله والثناء عليه سبحانه، ثم الشروع في الطلب.
సద్వర్తనులైన అల్లాహ్ యొక్క దాసుల పద్దతి ఏమనగా ముందుగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడి దాని తరువాత వారు తమ ప్రార్థనలను ప్రారంభించేవారు.

• تحذير المسلمين من التقصير في طلب الحق كالنصارى الضالين، أو عدم العمل بالحق الذي عرفوه كاليهود المغضوب عليهم.
సత్యాన్వేషణలో అశ్రద్ద వహించి మార్గ భ్రష్ఠులైన క్రైస్తవుల వలె విఫలురు కారాదనీ, మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వచ్చి పడిన ఆ యూదుల మాదిరిగా, ఎవరైతే ‘ఇది సత్యము’ అని తెలిసి కూడా దానిపై ఆచరించకుండా ఉండిపోయినారో, వారి మాదిరిగా కారాదనీ హెచ్చరించబడుతున్నది.

• دلَّت السورة على أن كمال الإيمان يكون بإخلاص العبادة لله تعالى وطلب العون منه وحده دون سواه.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం మరియు సహాయం కొరకు ఆయనను మాత్రమే అర్ధించటం ద్వారా విశ్వాసం పరిపూర్ణమవుతుందని ఈ సూరహ్ తెలియజేస్తున్నది.

 
Terjemahan makna Ayah: (5) Surah: Al-Fātiḥah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup