Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Al-Baqarah   Ayah:

అల్-బఖరహ్

Tujuan Pokok Surah Ini:
الأمر بتحقيق الخلافة في الأرض بإقامة الإسلام، والاستسلام لله، والتحذير من حال بني إسرائيل.
ఇస్లాంను స్థాపించటం,అల్లాహ్ కు లొంగిపోవటం మరియు బనీ ఇస్రాయీలు పరిస్థితి నుండి హెచ్చరించడం ద్వారా భువిలో ఖిలాఫత్ సాక్షాత్కారానికి ఆదేశించడం.

الٓمّٓ ۟ۚ
{الم} ఖుర్ ఆన్ లోని కొన్ని సూరాలు ఈ అక్షరాల ద్వారా ఆరంభం చేయబడినవి. ఇవి విడివిడిగా ఇలా (أ، ب، ت، إلخ) వచ్చినప్పుడు ఎటువంటి అర్ధం లేని అక్షరాలు. అవి అలా రావటానికి ఒక విజ్ఞత మరియు ఉద్దేశం ఉన్నది. ఖుర్ఆన్ లో విజ్ఞత లేనిది ఏదీ లేదు. ఆ విజ్ఞతల్లోంచి ముఖ్యమైనది వారికి తెలిసిన,వారు మాట్లాడే అక్షరాలతోనే తయారైన ఖుర్ఆన్ ద్వారా ఛాలెంజ్ చేయటం వైపు సూచన. అందుకనే ఎక్కువగా వాటి తరువాత పవిత్ర ఖుర్ఆన్ ప్రస్తావన వచ్చినది.దానికి ఉదాహరణ ఈ సూరాలో ఉన్నది.
Tafsir berbahasa Arab:
ذٰلِكَ الْكِتٰبُ لَا رَیْبَ ۖۚۛ— فِیْهِ ۚۛ— هُدًی لِّلْمُتَّقِیْنَ ۟ۙ
ఈ మహోన్నతమైన ఖుర్ఆన్ గ్రంధంలో అవతరణ రీత్యా కానీ, లేక పదాలు మరియు వాక్యార్ధాల రీత్యా కానీ ఏవిధమైన సంశయము లేదు. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క వాక్కు మరియు అది ఆయన వైపుకు చేరవేసే మార్గము వైపునకు దైవభీతి కలవారికి మార్గదర్శకమవుతుంది.
Tafsir berbahasa Arab:
الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟ۙ
ఎవరైతే అగోచర విషయాలను విశ్వసిస్తారో' అంటే బుద్దికి అందనటువంటివి మరియు ఙానేంద్రియాలకు గోప్యంగా ఉన్నవి, వేటి గురించి అయితే అల్లాహ్ మరియు ప్రవక్త తెలియజేశారో ఉదాహరణకు పరలోకానికి సంబంధించిన విషయాలు. మరియు 'ఎవరైతే నమాజును స్థాపిస్తారో' అంటే నమాజులను వాటి సమయంలో అల్లాహ్ నియమించిన నియమాలకు కట్టుబడి దాని విధులను మరియు సున్నతులను ఖచ్చితంగా నెరవేరుస్తారో అని అర్థము. మరియు 'వారికి అల్లాహ్ ప్రసాదించిన వాటి నుండి విధి గావించబడిన వాటిని తీయటం ద్వారా ఉదాహరణకు జకాత్,' మరియు విధి గావించబడనిది స్వచ్ఛందంగా చేసే దానము లాంటిలో పుణ్యాన్ని ఆశించి ఖర్చు పెడతారు.మరియు ఓ ప్రవక్తా ఎవరైతే నీ పై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటి మధ్య వ్యత్యాసం చూపకుండా విశ్వసిస్తారో', వారు పరలోకంపై మరియు అక్కడ లభించు పాపపుణ్యాల ప్రతిఫలాలపై తిరుగు లేని విశ్వాసం కలిగి ఉంటారు.
Tafsir berbahasa Arab:
وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ— وَبِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟ؕ
"ఎవరైతే అగోచర విషయాలను విశ్వసిస్తారో" అంటే బుద్దికి అందనటువంటివి మరియు ఇంద్రయాలకు గోప్యంగా ఉన్నవి, వేటి గురించి అయితే అల్లాహ్ మరియు ప్రవక్త తెలియజేశారో వాటన్నింటినీ విశ్వసిస్తారని అర్ధం ఉదాహరణకు పరలోకానికి సంబంధించిన విషయాలు. మరియు "ఎవరైతే నమాజును స్థాపిస్తారో" అంటే నమాజులను వాటి నిర్ధారిత సమయంలో అల్లాహ్ నియమించిన నియమాలకు కట్టుబడి దాని విధులను మరియు సున్నతులను ఖచ్చితంగా నెరవేరుస్తారో అని అర్థం. "మరియు వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో" అంటే విధి దానాన్ని మరియు దానధర్మాలను పుణ్యాన్ని ఆశించి ఎవరైతే ఖర్చు పెడతారో అని అర్థం. మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీ పై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటి మధ్య వ్యత్యాసం చూపకుండా విశ్వసిస్తారో, వారు పరలోకంపై మరియు అక్కడ లభించు పాపపుణ్యాల ప్రతిఫలాలపై తిరుగు లేని విశ్వాసం కలిగి ఉంటారని అర్ధం.
Tafsir berbahasa Arab:
اُولٰٓىِٕكَ عَلٰی هُدًی مِّنْ رَّبِّهِمْ ۗ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
పైన తెలియజేయబడిన గుణాలు గల వారే ఋజుమార్గం పై ఉన్నవారు. మరియు వారే తాము ఆశించిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడిన వాటి నుండి విముక్తి పొంది ఇహలోకములో,పరలోకములో సాఫల్యం పొందుతారు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الثقة المطلقة في نفي الرَّيب دليل على أنه من عند الله؛ إذ لا يمكن لمخلوق أن يدعي ذلك في كلامه.
• ఇందులో ఏవిధమైన సందేహం లేదని సంపూర్ణంగా త్రుణీకరించడం ద్వారానే ఇది అల్లాహ్ తరుపు నుంచి (అవతరించినదని) రుజువు అవుతుంది. ఎందుకనగా ఒక మనిషి తన మాటలలో ఈ విధంగా ఆరోపించడం అసాధ్యం.

• لا ينتفع بما في القرآن الكريم من الهدايات العظيمة إلا المتقون لله تعالى المعظِّمون له.
• ఖుర్ఆన్ గ్రంధంలోని ఉన్నతమైన ఆదేశాల ప్రయోజనం కేవలం అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడే మరియు ఆయన పట్ల భయభక్తులు గల అల్లాహ్ దాసులు మాత్రమే పొందగలరు.

• من أعظم مراتب الإيمانِ الإيمانُ بالغيب؛ لأنه يتضمن التسليم لله تعالى في كل ما تفرد بعلمه من الغيب، ولرسوله بما أخبر عنه سبحانه.
• విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి ఏమిటంటే అగోచర విషయాలను విశ్వశించడం. అగోచర విషయాల జ్ఞానములో అద్వితీయుడైన అల్లాహ్, ఆ జ్ఞానాన్ని తన ప్రవక్తకు ప్రసాదించాడు. అగోచర విషయాలను విశ్వశించడంలో దాసుడు తనను తాను సమర్పించుకోవడం ఇమిడి ఉంది.

• كثيرًا ما يقرن الله تعالى بين الصلاة والزكاة؛ لأنَّ الصلاة إخلاص للمعبود، والزكاة إحسان للعبيد، وهما عنوان السعادة والنجاة.
• అల్లాహ్ (సు.తా) ఖుర్ఆన్ లో అత్యధికంగా నమాజును మరియు జకాతును కలిపి ప్రస్తావించాడు. ఎందుకనగా నమాజు కేవలం దైవం కోసం ప్రత్యేకించబడిన ఆరాధన అయితే జకాతు దాసుల పై చేసే ఉపకారం. ఈ రెండూ వాస్తవానికి నైతికతకు మరియు ముక్తికి అంశము వంటివి.

• الإيمان بالله تعالى وعمل الصالحات يورثان الهداية والتوفيق في الدنيا، والفوز والفلاح في الأُخرى.
• మహోన్నతుడైన అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు సత్కార్యాల ఆచరణ ఇహలోకంలో ఋజుమార్గమునకు మరియు పరలోకంలో సాఫల్యమునకు వారసత్వమును కలిగిస్తాయి.

 
Terjemahan makna Surah: Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup