Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Al-Ḥajj   Ayah:
وَهُدُوْۤا اِلَی الطَّیِّبِ مِنَ الْقَوْلِ ۖۗۚ— وَهُدُوْۤا اِلٰی صِرَاطِ الْحَمِیْدِ ۟
అల్లాహ్ వారిని ఇహలోకంలో అల్లాహ్ తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం కాదని సాక్ష్యం పలకటం, పెద్దరికమును చాటటం (తక్బీర్ చదవటం),స్థుతులను పలకటం లాంటి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. మరియు వారిని ప్రశంసించబడిన ఇస్లాం యొక్క మార్గము వైపునకు మార్గ దర్శత్వం చేశాడు.
Tafsir berbahasa Arab:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَیَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِیْ جَعَلْنٰهُ لِلنَّاسِ سَوَآءَ ١لْعَاكِفُ فِیْهِ وَالْبَادِ ؕ— وَمَنْ یُّرِدْ فِیْهِ بِاِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ اَلِیْمٍ ۟۠
నిశ్చయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఇతరులను ఇస్లాంలో ప్రవేశించటం నుండి ఆపుతారో మరియు ప్రజలను మస్జిదె హరాం నుండి హుదేబియా సంవత్సరంలో ముష్రికులు చేసిన విధంగా ఆపుతారో వారిని మేము బాధాకరమైన శిక్ష రుచిని చూపిస్తాము. ఈ మస్జిదు దేనినైతే మేము ప్రజల కొరకు వారి నమాజులలో ఖిబ్లాగా, హజ్ మరియు ఉమ్రా ఆచారముల్లోంచి ఒక ఆచారముగా చేశామో అందులో మక్కా ప్రాంతపు నివాసీ అయిన, మక్కా ప్రాంతము వాడు కాకుండా ఇతర ప్రాంతము నుండి వచ్చిన వాడైనా సమానమే. మరియు ఎవరైతే అందులో కావాలని పాపకార్యముల్లోంచి ఏదైన కార్యమునకు పాల్పడి సత్యము నుండి మరలాలనుకుంటే మేము అతనికి బాధాకరమైన శిక్ష రుచిని చూపిస్తాము.
Tafsir berbahasa Arab:
وَاِذْ بَوَّاْنَا لِاِبْرٰهِیْمَ مَكَانَ الْبَیْتِ اَنْ لَّا تُشْرِكْ بِیْ شَیْـًٔا وَّطَهِّرْ بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْقَآىِٕمِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
ఓ ప్రవక్తా మేము ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు గృహ స్థలము,దాని హద్దులను అవి తెలియకుండా ఉండిన తరువాత స్పష్టపరచినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. మరియు మేము ఆయన వైపునకు మీరు నా ఆరాధనలో దేనినీ సాటి కల్పించకండి,అంతే కాదు మీరు నా ఒక్కడి ఆరాధన చేయండి మరియు మీరు నా గృహమును దాని ప్రదక్షిణలు చేసే వారి కొరకు,అందులో నమాజు చేసేవారి కొరకు ఇంద్రియ,నైతిక అశుద్దతలను పరిశుభ్రం చేయి అని దైవ వాణి ద్వారా తెలియజేశాము.
Tafsir berbahasa Arab:
وَاَذِّنْ فِی النَّاسِ بِالْحَجِّ یَاْتُوْكَ رِجَالًا وَّعَلٰی كُلِّ ضَامِرٍ یَّاْتِیْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِیْقٍ ۟ۙ
మరియు మేము మిమ్మల్ని నిర్మించమని ఆదేశించిన ఈ గృహము యొక్క హజ్ చేయమని ప్రజలను పిలుస్తూ మీరు ప్రకటించండి. వారు పాదాచారులుగా లేదా నడవటం నుండి అలసిపోయిన ప్రతీ బలహీనమైన ఒంటెపై సవారీ అయి మీ వద్దకు వస్తారు. ఒంటెలు వారిని ఎత్తుకుని ప్రతీ సుదూర మార్గము నుండి తీసుకుని వస్తాయి.
Tafsir berbahasa Arab:
لِّیَشْهَدُوْا مَنَافِعَ لَهُمْ وَیَذْكُرُوا اسْمَ اللّٰهِ فِیْۤ اَیَّامٍ مَّعْلُوْمٰتٍ عَلٰی مَا رَزَقَهُمْ مِّنْ بَهِیْمَةِ الْاَنْعَامِ ۚ— فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْبَآىِٕسَ الْفَقِیْرَ ۟ؗ
పాప విముక్తి, ప్రతిఫలం పొందటం,కలిమాని ఏకీబవించటం మొదలగు వాటి నుండి వారికి ప్రయోజనం కలిగించే వాటికి వారు హాజరు కావాలి. మరియు వారు నిర్ణీత దినములైన జిల్ హిజ్జా మాసపు పదో తారీకు, దాని తరువాతి మూడు రోజుల్లో అల్లాహ్ కి కృతజ్ఞతగా వారికి ఆయన ప్రసాదించిన ఒంటెల్లోంచి,ఆవుల్లోంచి,గొర్రెల్లోంచి హదీ జంతువుల్లోంచి వారు జిబాహ్ చేసే వాటిపై అల్లాహ్ నామమును వారు స్మరించాలి. అప్పుడు మీరు ఈ హదీ జంతువుల్లోంచి తినండి,మరియు వాటిలో నుండి కఠిన పేదరికంలో ఉన్న వారికి మీరు తినిపించండి.
Tafsir berbahasa Arab:
ثُمَّ لْیَقْضُوْا تَفَثَهُمْ وَلْیُوْفُوْا نُذُوْرَهُمْ وَلْیَطَّوَّفُوْا بِالْبَیْتِ الْعَتِیْقِ ۟
ఆ తరువాత వారు తమపై మిగిలిన తమ హజ్ సాంప్రదాయములను పూర్తి చేసుకోవాలి. మరియు వారు తమ తలలను ముండనంతో,తమ గోళ్ళను కత్తిరించుకోవటంతో, ఇహ్రాం కారణముతో వారిపై పేరుకుపోయిన మురికిని తొలగించటముతో ఇహ్రామ్ ను విప్పుకోవాలి. వారు తమపై అనివార్యం చేసుకున్న హజ్ లేదా ఉమ్రా లేదా బలి పశువును పూర్తి చేసుకోవాలి. మరియు వారు శక్తివంతమైన వారి ఆధిపత్యం నుండి అల్లాహ్ విముక్తి కలిగించిన ఆ గృహమును ప్రదక్షిణ తవాఫె ఇఫాజా చేయాలి.
Tafsir berbahasa Arab:
ذٰلِكَ ۗ— وَمَنْ یُّعَظِّمْ حُرُمٰتِ اللّٰهِ فَهُوَ خَیْرٌ لَّهٗ عِنْدَ رَبِّهٖ ؕ— وَاُحِلَّتْ لَكُمُ الْاَنْعَامُ اِلَّا مَا یُتْلٰی عَلَیْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْاَوْثَانِ وَاجْتَنِبُوْا قَوْلَ الزُّوْرِ ۟ۙ
ఇది ఏదైతే మీకు ఆదేశించబడినదో శిరో ముండనంతో,గోళ్ళను కత్తిరించటంతో, మాలీన్యములను తొలగించటంతో,మొక్కుబడులను పూర్తి చేయటంతో, కాబా ప్రదక్షిణతో ఇహ్రామ్ ను విప్పదీయటం అది అల్లాహ్ మీపై అనివార్యం చేసినది. అయితే మీరు మీపై అల్లాహ్ అనివార్యం చేసిన వాటిని గౌరవించండి. మరియు ఎవరైతే అల్లాహ్ అతని ఇహ్రాం స్థితిలో దూరంగా ఉండమని ఆదేశించిన వాటి నుండి దూరంగా ఉన్నాడో తన తరపు నుండి గౌరవంగా అల్లాహ్ హద్దుల్లో వాటిల్లకుండా ఉండటానికి,ఆయన నిషేదించిన వాటిని హలాల్ చేసుకోకుండ ఉండటానికి అది అతని కొరకు ఇహలోకంలో, పరిశుద్ధుడైన తన ప్రభువు వద్ద పరలోకములో మేలైనది. ఓ ప్రజలారా పశువుల్లోంచి మీ కొరకు ఒంటెలు,ఆవులు,గొర్రెలు అనుమతించబడినవి (సమ్మతించబడినవి). అయితే ఆయన మీపై వాటిలో నుంచి ఏ హామీని గాని ఏ బహీరహ్ ని గాని ఏ వసీలహ్ ని గాని నిషేదించలేదు. వాటిలోంచి ఆయన కేవలం మీపై మీరు ఖుర్ఆన్ లో పొందే మృత జంతువుల నిషేదము మొదలగు వాటిని మాత్రమే నిషేదించాడు. అయితే మీరు మురికి అయిన విగ్రహారాధన నుండి దూరంగా ఉండండి. మరియు మీరు అల్లాహ్ పై లేదా ఆయన సృష్టితాలపై ప్రతీ ఆసత్యపు,అబద్దపు మాటను చెప్పటం నుండి దూరంగా ఉండండి.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• حرمة البيت الحرام تقتضي الاحتياط من المعاصي فيه أكثر من غيره.
పరిశుద్దమైన గృహము పవిత్రత అక్కడ ఇతర ప్రదేశముల కన్న ఎక్కువగా పాపకార్యముల నుండి జాగ్రత్త పడటంను నిర్ణయిస్తుంది.

• بيت الله الحرام مهوى أفئدة المؤمنين في كل زمان ومكان.
అల్లాహ్ యొక్క పవిత్ర గృహము ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశమలో ఉన్న విశ్వాసపరుల హృదయముల నివాస స్థలము.

• منافع الحج عائدة إلى الناس سواء الدنيوية أو الأخروية.
హజ్ యొక్క ప్రయోజనాలు ప్రజలకు చేరుతాయి అవి ప్రాపంచికమైనవి గాని లేదా పరలోకమైనవి గాని సమానము.

• شكر النعم يقتضي العطف على الضعفاء.
అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటం బలహీనులపై దయ చూపటమును నిర్ణయిస్తుంది.

 
Terjemahan makna Surah: Al-Ḥajj
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup