Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: An-Nisā`   Ayah:
لَا خَیْرَ فِیْ كَثِیْرٍ مِّنْ نَّجْوٰىهُمْ اِلَّا مَنْ اَمَرَ بِصَدَقَةٍ اَوْ مَعْرُوْفٍ اَوْ اِصْلَاحٍ بَیْنَ النَّاسِ ؕ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ فَسَوْفَ نُؤْتِیْهِ اَجْرًا عَظِیْمًا ۟
ప్రజలను సంతోషం కలిగించే చాలా మాటల్లో ఎటువంటి మేలు లేదు మరియు దాని నుండి ఎటువంటి ప్రయోజనం లేదు. కాని ఒక వేళ వారి మాట ఏదైన దానధర్మం గురించి లేదా ధర్మం తీసుకుని వచ్చిన మరియు బుద్ధి నిర్దేశించిన మంచి గురించి లేదా ఇద్దరు తగాదా పడిన వారి మధ్య సయోధ్య వైపు పిలవటం గురించి ఆదేశం అయితే. ఎవరైతే అల్లాహ్ ప్రీతిని ఆశిస్తూ ఇలా చేస్తాడో మేము తొందరలోనే అతనికి గొప్ప పుణ్యమును ప్రసాదిస్తాము.
Tafsir berbahasa Arab:
وَمَنْ یُّشَاقِقِ الرَّسُوْلَ مِنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُ الْهُدٰی وَیَتَّبِعْ غَیْرَ سَبِیْلِ الْمُؤْمِنِیْنَ نُوَلِّهٖ مَا تَوَلّٰی وَنُصْلِهٖ جَهَنَّمَ ؕ— وَسَآءَتْ مَصِیْرًا ۟۠
మరియు ఎవరైతే తన ముందు సత్యం స్పష్టమైన తరువాత ప్రవక్తను విభేదిస్తాడో మరియు ఆయన తీసుకుని వచ్చిన దాని విషయంలో వ్యతిరేకిస్తాడో మరియు విశ్వాసపరుల మార్గమును కాకుండా ఇతరుల మర్గమును అనుసరిస్తాడో మేము అతన్ని మరియు అతను తన స్వయం కొరకు ఎంచుకున్న దాన్ని వదిలివేస్తాము. అతను ఉద్దేశపూర్వకంగా సత్యం నుండి విముఖత చూపటం వలన మేము అతనికి సత్యం యొక్క భాగ్యమును కలిగించము. మరియు మేము అతన్ని నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాము అతను దాని వేడిని అనుభవిస్తాడు. మరియు అది దాని నివాసుల కొరకు అతి చెడ్డ మరలే చోటు.
Tafsir berbahasa Arab:
اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَیَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ ؕ— وَمَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ ضَلَّ ضَلٰلًا بَعِیْدًا ۟
నిశ్చయంగా అల్లాహ్ తనతో పాటు సాటి కల్పించటమును క్షమించడు. అంతేకాదు సాటి కల్పించే వారిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉంచుతాడు. మరియు షిర్కు కాకుండా ఇతర పాపములను తాను తలచిన వారి కొరకు తన కారుణ్యముతో మరియు తన అనుగ్రహముతో మన్నించివేస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పిస్తాడో అతడు సత్యం నుండి తప్పిపోయి,దాని నుండి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతడు సృష్టికర్తను మరియు సృష్టిని సమానం చేశాడు.
Tafsir berbahasa Arab:
اِنْ یَّدْعُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اِنٰثًا ۚ— وَاِنْ یَّدْعُوْنَ اِلَّا شَیْطٰنًا مَّرِیْدًا ۟ۙ
ఈ ముష్రికులందరు అల్లాహ్ తోపాటు ఆరాధిస్తున్న,పూజిస్తున్నవి లాత్,ఉజ్జా ల స్త్రీల పేర్లు పెట్టుకున్న విగ్రహాలు మాత్రమే. వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు,ఎటువంటి నష్టం లేదు. మరియు వారు వాస్తవానికి అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన షైతానును మాత్రమే ఆరాధిస్తున్నారు. అందులో ఎటువంటి మేలు లేదు. ఎందుకంటే అతడే వారికి విగ్రహాల ఆరాధన గురించి ఆదేశించాడు.
Tafsir berbahasa Arab:
لَّعَنَهُ اللّٰهُ ۘ— وَقَالَ لَاَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِیْبًا مَّفْرُوْضًا ۟ۙ
మరియు ఇందుకనే అల్లాహ్ అతన్ని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు ఈ షైతాను తన ప్రభువుతో ప్రమాణం చేస్తూ ఇలా పలికాడు : నేను నీ దాసుల్లోంచి ఒక నియమిత భాగమును నా కొరకు చేసుకుంటాను వారిని నేను సత్యం నుండి తప్పించివేస్తాను.
Tafsir berbahasa Arab:
وَّلَاُضِلَّنَّهُمْ وَلَاُمَنِّیَنَّهُمْ وَلَاٰمُرَنَّهُمْ فَلَیُبَتِّكُنَّ اٰذَانَ الْاَنْعَامِ وَلَاٰمُرَنَّهُمْ فَلَیُغَیِّرُنَّ خَلْقَ اللّٰهِ ؕ— وَمَنْ یَّتَّخِذِ الشَّیْطٰنَ وَلِیًّا مِّنْ دُوْنِ اللّٰهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِیْنًا ۟ؕ
మరియు వారిని నీ సన్మార్గము నుండి నిరోధిస్తాను. మరియు వారి మార్గభ్రష్టతను వారి కొరకు అలంకరించి చూపే అబద్దపు వాగ్దానాల ద్వారా వారికి ఆశ కలిగిస్తాను. మరియు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాం చేసుకోవటం కొరకు పశువుల చెవులను కోయటానికి వారిని ఆదేశిస్తాను. మరియు అల్లాహ్ సృష్టిని,ఆయన ప్రకృతిని మార్చటానికి వారిని ఆదేశిస్తాను. మరియు ఎవరైతే షైతానును స్నేహితునిగా చేసుకుంటాడో మరియు అతడికి విధేయత చూపుతాడో అతడు ధూత్కరించబడిన షైతానుతో స్నేహం చేయటం వలన స్పష్టమైన నష్టమును పొందుతాడు.
Tafsir berbahasa Arab:
یَعِدُهُمْ وَیُمَنِّیْهِمْ ؕ— وَمَا یَعِدُهُمُ الشَّیْطٰنُ اِلَّا غُرُوْرًا ۟
షైతాను వారితో అబద్దపు వాగ్దానాలు చేస్తాడు. మరియు వారికి అసత్యపు ఆశలను రేకెత్తిస్తాడు. వాస్తవానికి వాడు వారితో వాస్తవికత లేని అసత్యపు వాగ్దానం మాత్రమే చేస్తాడు.
Tafsir berbahasa Arab:
اُولٰٓىِٕكَ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؗ— وَلَا یَجِدُوْنَ عَنْهَا مَحِیْصًا ۟
షైతాను అడుగుజాడలను అనుసరించే వారందరు మరియు అతని ఆశలను అనుసరించే వారందరి నివాస స్థలం నరకాగ్ని. వారు దాని నుండి పారిపోయి శరణం తీసుకునే ప్రదేశమును పొందరు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• أكثر تناجي الناس لا خير فيه، بل ربما كان فيه وزر، وقليل من كلامهم فيما بينهم يتضمن خيرًا ومعروفًا.
ప్రజల రహస్య మంతనాల్లో చాలా వరకు మేలు ఉండదు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో అందులో పాపముంటుంది. వారి మధ్య జరిగే సంభాషణలో మేలు,మంచికి సంబంధించిన (విషయాలు) చాలా తక్కువగా ఉంటాయి.

• معاندة الرسول صلى الله عليه وسلم ومخالفة سبيل المؤمنين نهايتها البعد عن الله ودخول النار.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వ్యతిరేకించటం మరియు విశ్వాసపరుల మార్గమును విభేదించటం దాని ముగింపు అల్లాహ్ నుండి దూరము మరియు నరకాగ్నిలో ప్రవేశము.

• كل الذنوب تحت مشيئة الله، فقد يُغفر لصاحبها، إلا الشرك، فلا يغفره الله أبدًا، إذا لم يتب صاحبه ومات عليه.
అన్ని పాపాలు అల్లాహ్ చిత్తం క్రింద ఉన్నాయి, తద్వారా వాటిని పాల్పడే వ్యక్తి క్షమించబడతాడు షిర్కు తప్ప, మరియు వాటిని పాల్పడే వ్యక్తి పశ్చాత్తాపపడకుండా మరణిస్తే అల్లాహ్ అతనిని ఎప్పటికీ క్షమించడు.

• غاية الشيطان صرف الناس عن عبادة الله تعالى، ومن أعظم وسائله تزيين الباطل بالأماني الغرارة والوعود الكاذبة.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆరాధన నుండి ప్రజలను మరల్చడమే షైతాన్ ఉద్దేశము. అబద్దమును తప్పుడు కోరికలు మరియు తప్పుడు వాగ్దానాలతో అలంకరించటం అతని పెద్ద సాధనాల్లోంచివి.

 
Terjemahan makna Surah: An-Nisā`
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup