Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (3) Surah: Surah Al-Māidah
حُرِّمَتْ عَلَیْكُمُ الْمَیْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنْزِیْرِ وَمَاۤ اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوْذَةُ وَالْمُتَرَدِّیَةُ وَالنَّطِیْحَةُ وَمَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّیْتُمْ ۫— وَمَا ذُبِحَ عَلَی النُّصُبِ وَاَنْ تَسْتَقْسِمُوْا بِالْاَزْلَامِ ؕ— ذٰلِكُمْ فِسْقٌ ؕ— اَلْیَوْمَ یَىِٕسَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ دِیْنِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ؕ— اَلْیَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِیْنَكُمْ وَاَتْمَمْتُ عَلَیْكُمْ نِعْمَتِیْ وَرَضِیْتُ لَكُمُ الْاِسْلَامَ دِیْنًا ؕ— فَمَنِ اضْطُرَّ فِیْ مَخْمَصَةٍ غَیْرَ مُتَجَانِفٍ لِّاِثْمٍ ۙ— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
జుబాహ్ (హలాల్) చేయకుండానే మరణించిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. మరియు ప్రవహించే రక్తమును,పంది మాంసమును,జుబాహ్ చేసే సమయమున అల్లాహ్ నామము కాకుండా ఇతరుల నామం తీసుకోబడిన దాన్ని, పీక పిసికటం వలన చనిపోయిన జంతువును,దెబ్బ తగలటం వలన మరియు పై నుండి పడిపోవటం వలన చనిపోయిన జంతువును మరియు వేరే జంతువు కొమ్ము పొడవటంతో చనిపోయిన జంతువును మరియు పులి,చిరుత,తోడేలు లాంటి మృగాలు చీల్చేసిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. కాని ప్రస్తావించబడిన వాటిలో నుండి మీరు జీవించి ఉన్నప్పుడు పొంది వాటిని జుబాహ్ (హలాల్) చేస్తే అది మీ కొరకు ధర్మ సమ్మతము. విగ్రహాల కొరకు జుబాహ్ చేయబడిన దాన్ని ఆయన మీపై నిషేధించాడు. బాణాల ద్వారా మీరు అగోచరమైన మీ అదృష్టాన్ని కోరటమును ఆయన మీపై నిషేధించాడు. అవి రాళ్ళు లేదా బాణాలు ఉండి వాటిపై నీవు చేయి, నీవు చేయకు అని వ్రాయబడి ఉంటుంది. వాటిలో నుండి తన కొరకు ఏది వస్తే అది చేసేవారు. ఈ ప్రస్తావించబడిన నిషిద్ధితాలకు పాల్పడటం అల్లాహ్ విధేయత నుండి వైదొలగటమే. ఈ రోజు అవిశ్వాసపరులు మీరు ఇస్లాం ధర్మము నుండి - ఎప్పుడైతే వారు దాని బలాన్ని చూశారో - నిరాశ్యులైపోయారు. కావున మీరు వారితో భయపడకండి. నా ఒక్కడితోనే భయపడండి. ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మము అయిన ఇస్లాంను పరిపూర్ణం చేశాను. మరియు నేను మీపై బాహ్యగతమైన మరియు అంతర్గతమైన నా అనుగ్రహమును పూర్తి చేశాను. మరియు మీ కొరకు ధర్మముగా నేను ఇస్లాంను ఎంచుకున్నాను. కావున నేను అది కాకుండా వేరేవాటిని స్వీకరించను. కాని ఎవరైన కరువు వలన గత్యంతరం లేక పాపము వైపునకు వాలకుండామృత జంతువు నుండి తింటే అటువంటప్పుడు అతనిపై ఏ పాపము లేదు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును,కరుణించేవాడును.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• تحريم ما مات دون ذكاة، والدم المسفوح، ولحم الخنزير، وما ذُكِرَ عليه اسْمٌ غير اسم الله عند الذبح، وكل ميت خنقًا، أو ضربًا، أو بسقوط من علو، أو نطحًا، أو افتراسًا من وحش، ويُستثنى من ذلك ما أُدرِكَ حيًّا وذُكّيَ بذبح شرعي.
జిబాహ్ చేయకుండానే సహజ మరణం పొందిన జంతువు మరియు పంది మాంసము మరియు జిబాహ్ చేసేటప్పుడు అల్లాహేతరుల పేరు ప్రస్తావించబడిన జంతువు మరియు పీక పిసికటం వలన లేదా దెబ్బ తగలటం వలన లేదా పై నుండి పడిపోవటం వలన లేదా పొడుచుకోవటం వలన కృూర మృగములచే చీల్చబడిన జంతువులన్నీ నిషిద్ధము. మరియు జీవించి ఉండి ధర్మ పద్దతిలో జిబాహ్ చేసి హలాల్ చేయబడిన జంతువు దీని నుండి మినహాయించబడినది.

• حِلُّ ما صاد كل مدرَّبٍ ذي ناب أو ذي مخلب.
కొర పళ్ళు గల లేదా వంకర గోళ్ళు గల ప్రతీ శిక్షణ ఇవ్వబడిన జంతువు వేటాడిన జంతువు సమ్మతము.

• إباحة ذبائح أهل الكتاب، وإباحة نكاح حرائرهم من العفيفات.
గ్రంధవహులచే జిబాహ్ చేయబడినవి సమ్మతం కావటం మరియు వారి స్వేచ్ఛాపరులైన సౌశీల్య స్త్రీలతో నికాహ్ సమ్మతం కావటం.

 
Terjemahan makna Ayah: (3) Surah: Surah Al-Māidah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup