Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (4) Surah: Al-Ḥadīd
هُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ ؕ— یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَمَا یَخْرُجُ مِنْهَا وَمَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا یَعْرُجُ فِیْهَا ؕ— وَهُوَ مَعَكُمْ اَیْنَ مَا كُنْتُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఆయనే భూమ్యాకాశములను ఆరుదినములలో ఆదివారము ఆరంభమై శుక్రువారము ముగిసినట్లుగా సృష్టించాడు. మరియు కనురెప్ప వాల్చే సమయం కన్న తక్కువ సమయంలో వాటిని సృష్టించే సామర్ధ్యం కలవాడు ఆయన. ఆ తరువాత పరిశుద్ధుడైన ఆయన సింహాసనమును ఆయన సుబహానహు వతఆలాకి తగిన విధంగా అధీష్టించి ఆశీనుడైనాడు. భూమిలో ప్రవేశించే వర్షము,విత్తనము మరియు మొదలైనవి మరియు దాని నుండి వెలికి వచ్చే మొక్కలు,నిక్షేపాలు మొదలైనవి మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవవాణి మొదలైనవి మరియు అందులో ఎక్కే దైవ దూతలు,దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. ఓ ప్రజలారా మీరు ఎక్కడున్నా ఆయన తన జ్ఞానము ద్వారా మీతో పాటు ఉంటాడు. మీ నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు అల్లాహ్ మీరు చేసే వాటిని వీక్షిస్తున్నాడు. మీ కర్మల్లో నుంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• المال مال الله، والإنسان مُسْتَخْلَف فيه.
ధనము అల్లాహ్ ధనము మరియు మనిషి దానికి లోబడి ఉంటాడు.

• تفاوت درجات المؤمنين بحسب السبق إلى الإيمان وأعمال البر.
విశ్వాసుల స్థాయిలు విశ్వాసానికి, సత్కర్మలకు అనుగుణంగా మారుతాయి.

• الإنفاق في سبيل الله سبب في بركة المال ونمائه.
అల్లాహ్ మర్గములో ఖర్చు చేయటం ధనంలో శుభము కలగటానికి మరియు అది పెరగటానికి కారణముగును.

 
Terjemahan makna Ayah: (4) Surah: Al-Ḥadīd
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup