Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Al-A'rāf   Ayah:
حَقِیْقٌ عَلٰۤی اَنْ لَّاۤ اَقُوْلَ عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ— قَدْ جِئْتُكُمْ بِبَیِّنَةٍ مِّنْ رَّبِّكُمْ فَاَرْسِلْ مَعِیَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : నేను ఆయన (అల్లాహ్) తరపు నుండి ప్రవక్త అవటం వలన నేను ఆయన పేరుతో సత్యాన్ని మాత్రమే పలకటానికి అర్హుడిని. నిశ్చయంగా నేను మీ వద్దకు స్పష్టమైన ఒక వాదనను తీసుకుని వచ్చాను. అది నేను సత్యవంతుడిని అనటానికి,నా ప్రభువు తరపు నుండి మీ వద్దకు పంపించబడ్డ ప్రవక్తను అనటాన్ని దృవీకరిస్తుంది. నీవు ఇస్రాయీలు సంతతివారిని బంధీ ,ఆదీనం నుండి విముక్తి కల్పించి నాతోపాటు పంపించు.
Tafsir berbahasa Arab:
قَالَ اِنْ كُنْتَ جِئْتَ بِاٰیَةٍ فَاْتِ بِهَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఫిర్ఔన్ మూసాతో ఇలా పలికాడు : ఒకవేళ నీవు వాదిస్తున్నట్లు ఏదైన సూచనను (మహిమను) తెచ్చి ఉంటే, నీవు నీ వాదనలో సత్యవంతుడివే నయితే దానిని ప్రదర్శించు.
Tafsir berbahasa Arab:
فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ
అయితే మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అది దానిని చూసేవారి కొరకు పెద్ద సర్పముగా మారిపోయినది.
Tafsir berbahasa Arab:
وَّنَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۟۠
మరియు ఆయన తన చొక్కా తెరిచిన భాగము వద్ద నుండి తన హృదయము దగ్గర నుండి లేదా తన సంక క్రింది నుండి తన చేతిని వెలికి తీశారు (బయటకు ప్రదర్శించాడు). అది బొల్లి రోగం లేకుండా తెల్లగా వెలితికి వచ్చినది. దాని అధిక తెల్లదనం వలన చూసేవారికి మిణుకు మిణుకు అనిపించసాగింది.
Tafsir berbahasa Arab:
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌ ۟ۙ
మరియు పెద్దవారు,నాయకులు మూసా చేతికర్రను సర్పముగా మారటంను,ఆయన చేయి ఎటువంటి బొల్లి రోగం లేకుండా తెల్లగా మారిపోవటమును చూసి "మూసా మంత్రజాలము గురించి బలమైన జ్ఞానం కల మంత్రజాలకుడు" అన్నారు.
Tafsir berbahasa Arab:
یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ ۚ— فَمَاذَا تَاْمُرُوْنَ ۟
అతను చేస్తున్నది మిమ్మల్ని మీ ఈ నేల మిసర్ నుండి వెళ్ళగొట్టే ఉద్దేశముతోనే. ఆ తరువాత ఫిర్ఔన్ మూసా విషయంలో వారితో సలహా కోరుతూ "అతని విషయంలో మీరు నాకు ఏమి సలహా ఇస్తారు" ? అన్నాడు.
Tafsir berbahasa Arab:
قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَاَرْسِلْ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۙ
వారు ఫిర్ ఔన్ తో ఇలా పలికారు : నీవు మూసాను,అతని సోదరుడు హారూన్ ను కొంత గడువునివ్వు. మరియు మిసర్ పట్టణాల్లో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించు.
Tafsir berbahasa Arab:
یَاْتُوْكَ بِكُلِّ سٰحِرٍ عَلِیْمٍ ۟
పట్టణాల నుండి మంత్రజాలకులను సమీకరించటానికి నీవు పంపించిన వారు మంత్రజాలంలో నైపుణ్యత కలవారిని,దానిని చేయటంలో బలమైన వారిని నీ వద్దకు తీసుకుని వస్తారు.
Tafsir berbahasa Arab:
وَجَآءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوْۤا اِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟
అయితే ఫిర్ఔన్ మాంత్రజాలకులను సేకరించే వారిని పంపించాడు,మంత్రజాలకులు ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ వారు తమ మంత్రజాలము వలన మూసాను ఓడిస్తే,అతనిపై వారు విజయం సాధిస్తే వారి కొరకు ఏమైన పారితోషికం ఉన్నదా ? అని అతనిని అడిగారు.
Tafsir berbahasa Arab:
قَالَ نَعَمْ وَاِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِیْنَ ۟
ఫిర్ఔన్ తన మాట ద్వారా వారికి సమాధానమిచ్చాడు : అవును నిశ్చయంగా మీ కొరకు ప్రతిఫలము,పారితోషికం ఉన్నది. మరియు మీరు హోదాల ద్వారా సామిప్యాన్ని పొందేవారిలోంచి అవుతారు.
Tafsir berbahasa Arab:
قَالُوْا یٰمُوْسٰۤی اِمَّاۤ اَنْ تُلْقِیَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ نَحْنُ الْمُلْقِیْنَ ۟
మంత్రజాలకులు మూసాపై గెలుస్తామన్న ధీమాతో గర్వము,అహంకారముతో ఇలా అన్నారు : ఓ మూసా దేనినైతే మీరు వేయదలుచుకున్నారో దానిని వేసి మీరు మొదలు పెట్టదలచుకున్న దానిని ఎంచుకోండి లేదా మేము దాన్ని మొదలు పెడుతాము.
Tafsir berbahasa Arab:
قَالَ اَلْقُوْا ۚ— فَلَمَّاۤ اَلْقَوْا سَحَرُوْۤا اَعْیُنَ النَّاسِ وَاسْتَرْهَبُوْهُمْ وَجَآءُوْ بِسِحْرٍ عَظِیْمٍ ۟
మూసా వారిని పట్టించుకోకుండా తన కొరకు తన ప్రభువు సహాయము పై నమ్మకముతో వారికి ఇలా సమాధానమిచ్చారు : మీరు మీ త్రాళ్ళను,మీ చేతి కర్రలను విసరండి. వారు వాటిని విసిరినప్పుడు ప్రజల కళ్ళను సరిగా గుర్తించటం నుండి మరల్చి కనికట్టు చేశారు. మరియు వారిని భయభ్రాంతులకు లోను చేశారు. చూసేవారి కళ్ళకు పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు.
Tafsir berbahasa Arab:
وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنْ اَلْقِ عَصَاكَ ۚ— فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَ ۟ۚ
మరియు అల్లాహ్ తన ప్రవక్త అయిన,తాను మాట్లాడిన వ్యక్తి అయిన మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నాడు : ఓ మూసా మీరు మీ చేతి కర్రను విసరండి. ఆయన దానిని విసిరారు. చేతి కర్ర పెద్ద సర్పంగా మారి వారి త్రాళ్ళను,వారి చేతికర్రలను వేటినైతే వారు వాస్తవ రూపాల నుంచి మార్చి,ప్రజలు వాటిని సర్పాలు పరుగెడుతున్నట్లు భావించేటట్లు చేసి ఉపయోగించారో వాటిని మ్రింగ సాగింది.
Tafsir berbahasa Arab:
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟ۚ
ఈ విధంగా సత్యం బహిర్గతమైనది,మూసా తీసుకుని వచ్చిన నిజాయితి స్పష్టమైనది. మరియు మంత్రజాలకులు చేసిన మంత్రజాలము అసత్యమని స్పష్టమైనది.
Tafsir berbahasa Arab:
فَغُلِبُوْا هُنَالِكَ وَانْقَلَبُوْا صٰغِرِیْنَ ۟ۚ
అయితే వారు ఓడిపోయారు,పరాభవమునకు లోనైనారు. ఆ సన్నివేశంలో మూసా వారిపై జయించారు,వారు ఓడిపోయి పరాభవులై వెనుతిరిగారు.
Tafsir berbahasa Arab:
وَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَ ۟ۙ
మంత్రజాలకులు అల్లాహ్ యొక్క గొప్ప సామర్ధ్యమును చూసినప్పుడు,స్పష్టమైన సూచనలను చూసినప్పుడు వారు అల్లాహ్ సుబహానహు వ తఆలా కొరకు సాష్టాంగ పడటం తప్ప వేరే మార్గం లేదు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• من حكمة الله ورحمته أن جعل آية كل نبي مما يدركه قومه، وقد تكون من جنس ما برعوا فيه.
ప్రతి ప్రవక్త యొక్క మహిమను వారి జాతి వారు అర్ధం చేసుకునే వాటిలోంచి చేయటము అల్లాహ్ వివేకము,కారుణ్యము. అది ఒక్కొక్కసారి వారి నైపుణ్యత కల వాటిలోంచి కూడా ఉంటుంది.

• أنّ فرعون كان عبدًا ذليلًا مهينًا عاجزًا، وإلا لما احتاج إلى الاستعانة بالسحرة في دفع موسى عليه السلام.
ఫిర్ఔన్ అవమానకరమై,దిగజారిన,నిస్సహాయుడైన దాసుడు లేకపోతే అతను మూసా అలైహిస్సలాంను ఎదుర్కొవటానికి మంత్రజాలకుల సహాయం తీసుకోవలసిన అవసరమేముండేది.

• يدل على ضعف السحرة - مع اتصالهم بالشياطين التي تلبي مطالبهم - طلبهم الأجر والجاه عند فرعون.
ఇది మంత్రజాకుల యొక్క బలహీనతను చూపిస్తుంది,వారి డిమాండ్లను తీర్చే షైతానులతో వారి సంబంధము,ఫిర్ ఔన్ వద్ద వేతనం మరియు ప్రతిష్ట కోసం వారి కోరిక ఉండటం.

 
Terjemahan makna Surah: Al-A'rāf
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup