Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (36) Surah: At-Taubah
اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ یَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙ۬— فَلَا تَظْلِمُوْا فِیْهِنَّ اَنْفُسَكُمْ ۫— وَقَاتِلُوا الْمُشْرِكِیْنَ كَآفَّةً كَمَا یُقَاتِلُوْنَكُمْ كَآفَّةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
నిశ్చయంగా సంవత్సరపు నెలల లెక్క అల్లాహ్ ఆదేశములో,ఆయన నిర్ణయంలో ఆయన మొదట భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుంచి లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ పొందుపరచిన వాటిలో పన్నెండు కలదు.ఈ పన్నెండు నెలల్లోంచి నాలుగు నెలల్లో అల్లాహ్ వాటిలో యుద్ధం చేయటమును నిషేధించాడు.అవి మూడు వివరణగా (జులా ఖాదతి,జుల్ హిజ్జతి మరియు ముహర్రమ్) మరియు ఒకటి వేరుగా అది (రజబ్).ఈ ప్రస్తావించబడిన సంవత్సర నెలల లెక్క,వాటిలోంచి నాలుగింటి నిషేధము అదే సక్రమమైన ధర్మము.అయితే మీరు వాటిలో యుద్ధాలు చేసి,వాటిని అగౌరవపాలు చేసి ఈ నిషిద్ధమాసముల్లో మీపై హింసకు పాల్పడకండి.మరియు ఏ విధంగా నైతే ముష్రికులందరు కలిసి మీతో యుద్ధం చేస్తున్నారో ఆ విధంగా మీరందరు కలిసి ముష్రికులతో యుద్ధం చేయండి.మరియు అల్లాహ్ ఎవరైతే ఆయన ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతిని కలిగి ఉంటారో వారికి విజయమును కలిగించి,స్థిరత్వమును ప్రసాధించి తోడుగా ఉంటాడని మీరు తెలుసుకోండి.అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో వారిపై ఎవరూ గెలవలేరు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• دين الله ظاهر ومنصور مهما سعى أعداؤه للنيل منه حسدًا من عند أنفسهم.
అల్లాహ్ శతృవులు తమ తరుపునుండి అసూయతో ధర్మమును అపనిందపాలు చేయటానికి ప్రయత్నము చేసినప్పుడల్లా అల్లాహ్ ధర్మము ఆధిక్యతను చూపుతుంది,సహాయం చేయబడుతుంది.

• تحريم أكل أموال الناس بالباطل، والصد عن سبيل الله تعالى.
ప్రజల సొమ్మును దుర్మార్గంతో తినటం,మహోన్నతుడైన అల్లాహ్ మార్గము నుండి ఆపటం నిషేధము.

• تحريم اكتناز المال دون إنفاقه في سبيل الله.
ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకుండా కూడబెట్టటం నిషేధము.

• الحرص على تقوى الله في السر والعلن، خصوصًا عند قتال الكفار؛ لأن المؤمن يتقي الله في كل أحواله.
రహస్యంగా,బహిర్గంగా అల్లాహ్ కు భయపడటం పై ప్రోత్సహించటం,ప్రత్యేకించి అవిశ్వాసపరులతో యుద్ధం చేసే సమయంలో.ఎందుకంటే విశ్వాసపరుడు తన పరిస్థితులన్నింటిలో అల్లాహ్ కు భయపడుతూ ఉంటాడు.

 
Terjemahan makna Ayah: (36) Surah: At-Taubah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup