Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (40) Surah: Surah At-Taubah
اِلَّا تَنْصُرُوْهُ فَقَدْ نَصَرَهُ اللّٰهُ اِذْ اَخْرَجَهُ الَّذِیْنَ كَفَرُوْا ثَانِیَ اثْنَیْنِ اِذْ هُمَا فِی الْغَارِ اِذْ یَقُوْلُ لِصَاحِبِهٖ لَا تَحْزَنْ اِنَّ اللّٰهَ مَعَنَا ۚ— فَاَنْزَلَ اللّٰهُ سَكِیْنَتَهٗ عَلَیْهِ وَاَیَّدَهٗ بِجُنُوْدٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِیْنَ كَفَرُوا السُّفْلٰی ؕ— وَكَلِمَةُ اللّٰهِ هِیَ الْعُلْیَا ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ ప్రవక్తకు సహాయం చేయకపోయినా మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయటానికి ఆయన పిలుపును స్వీకరించకపోయినా నిశ్చయంగా అల్లాహ్ ముష్రికులు ఆయనను మరియు అబూబకర్ ను వెలివేసినప్పుడు మీరు ఆయనతో పాటు లేకపోయినా కూడా ఆయనకు సహాయం చేశాడు.వారిద్దరు తమను వెతుకుతూ ఉన్న అవిశ్వాసపరుల నుండి సౌర్ గుహలో దాక్కొని ఉన్నప్పుడు వారిద్దరు కాక మూడో వ్యక్తి లేడు.అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరుడు అబూబకర్ సిద్దీఖ్ తనను ముష్రికులు పట్టుకుంటారని భయపడినప్పుడు ఇలా పలికారు : మీరు విచారించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన తోడ్పాటుతో,సహాయముతో మనకు తోడుగా ఉన్నాడు.అల్లాహ్ తన ప్రవక్త హృదయముపై ప్రశాంతతను కురిపించాడు.మరియు ఆయన అతనిపై మీరు చూడలేని సైన్యములను దించాడు.వారు దైవ దూతలు.వారు ఆయనకు మద్దతును (తోడ్పాటును) ఇచ్చారు.మరియు ఆయన ముష్రికుల మాటను అట్టడుగ స్థితికి దించి వేశాడు.ఇస్లాం ఉన్నత స్థానమునకు చేరుకున్నప్పుడు అల్లాహ్ కలిమ (మాట) ఉన్నతమైన స్థానములో ఉన్నది.మరియు అల్లాహ్ తన అస్తిత్వంలో,తన అణచివేతలో,తన రాజ్యాధికారంలో ఆధిక్యము కలవాడు.ఆయనను ఎవరూ ఓడించలేరు.ఆయన తన పర్యాలోచనలో,తన విధి వ్రాతలో,తన ధర్మబద్దం చేయటంలో వివేకవంతుడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• العادات المخالفة للشرع بالاستمرار عليها دونما إنكار لها يزول قبحها عن النفوس، وربما ظُن أنها عادات حسنة.
ధర్మానికి విరుద్ధమైన అలవాట్లను నిరాకరించకుండా వాటిపై కొనసాగటం మనస్సుల నుండి వాటి వికారమును దూరం చేస్తుంది,అనేక సార్లు అవి మంచి అలవాట్లు అనిపిస్తాయి.

• عدم النفير في حال الاستنفار من كبائر الذنوب الموجبة لأشد العقاب، لما فيها من المضار الشديدة.
అత్యవసర పరిస్థితుల్లో జిహాద్ కొరకు బయలుదేరకపోవటం కష్టాలు ఉన్న తీవ్రమైన శిక్షను అనివార్యం చేసే మహా పాపము.

• فضيلة السكينة، وأنها من تمام نعمة الله على العبد في أوقات الشدائد والمخاوف التي تطيش فيها الأفئدة، وأنها تكون على حسب معرفة العبد بربه، وثقته بوعده الصادق، وبحسب إيمانه وشجاعته.
ప్రశాంతత ప్రాముఖ్యత,మరియు క్లిష్టమైన సమయాల్లో,మనస్సులు ఉప్పొంగే భయానక ప్రదేశాల్లో దాసునిపై అల్లాహ్ అనుగ్రహం పరిపూర్ణం అవ్వటం,మరియు అది దాసుడు తన ప్రభువును గుర్తించే ప్రకారం మరియు ఆయన సత్య వాగ్దానము పై అతని నమ్మకము ప్రకారము ఉంటుంది.మరియు అతని విశ్వాసము,అతని ధైర్యము ప్రకారము ఉంటుంది.

• أن الحزن قد يعرض لخواص عباد الله الصدِّيقين وخاصة عند الخوف على فوات مصلحة عامة.
అల్లాహ్ యొక్క సత్య దాసులపై దుఖం బహిర్గతమవుతుంది.ప్రత్యేకించి సాధారణ ప్రయోజనాలను కోల్పోవటంపై కలిగే భయాందోళనల సమయంలో బహిర్గతమవుతుంది.

 
Terjemahan makna Ayah: (40) Surah: Surah At-Taubah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup