Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad * - Daftar isi terjemahan

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Terjemahan makna Surah: Al-Baqarah   Ayah:
وَلَنْ تَرْضٰی عَنْكَ الْیَهُوْدُ وَلَا النَّصٰرٰی حَتّٰی تَتَّبِعَ مِلَّتَهُمْ ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِیْ جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟ؔ
మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో సంపన్నులు కారు. నీవు: "నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం." అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించేవాడు గానీ, సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
Tafsir berbahasa Arab:
اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یُؤْمِنُوْنَ بِهٖ ؕ— وَمَنْ یَّكْفُرْ بِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించ వలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడువారు.[1]
[1] ఇక్కడ పూర్వ గ్రంథప్రజలు, అంటే యూదులు మరియు క్రైస్తవులలోని కొందరు సత్పరుషుల విషయం తెలుపబడింది. ఉదాహరణకు: 'అబ్దుల్లాహ్ బిన్-సల్లామ్, సల్మాన్ ఫార్సీ (ర'ది.'అన్హుమ్)ల వంటివారు. వారు తమ గ్రంథాలలో పేర్కొనబడిన రాబోయే ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) మే అన్న సత్యాన్ని గ్రహించి, విశ్వసించి సత్యధర్మమైన ఇస్లామ్ ను స్వీకరించారు. ఏ ధర్మాన్నైతే దైవప్రవక్తలు ఆదమ్, నూ'హ్, ఇబ్రాహీమ్, మూసా మరియు 'ఈసా మొదలైనవారు ('అలైహిమ్. స.) ఆచరించి, బోధించారో!
Tafsir berbahasa Arab:
یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اذْكُرُوْا نِعْمَتِیَ الَّتِیْۤ اَنْعَمْتُ عَلَیْكُمْ وَاَنِّیْ فَضَّلْتُكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వ లోకాల వారి కంటే ఎక్కువగా ఆదరించాను.
Tafsir berbahasa Arab:
وَاتَّقُوْا یَوْمًا لَّا تَجْزِیْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَیْـًٔا وَّلَا یُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟
మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆనాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏ మాత్రమూ ఉపయోగపడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారికెలాంటి సహాయమూ లభించదు.
Tafsir berbahasa Arab:
وَاِذِ ابْتَلٰۤی اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ؕ— قَالَ اِنِّیْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ؕ— قَالَ وَمِنْ ذُرِّیَّتِیْ ؕ— قَالَ لَا یَنَالُ عَهْدِی الظّٰلِمِیْنَ ۟
మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): "నిశ్చయంగా, నేను నిన్ను మానవ జాతికి నాయకునిగా చేస్తున్నాను." అని అన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): "మరి నా సంతతి వారు?" అని అడిగాడు.[1] (దానికి అల్లాహ్): "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అని జవాబిచ్చాడు.[2]
[1] అల్లాహ్ (సు.తా.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ విన్నపాన్ని పూర్తి చేశాడు. ఇది 29:27లో పేర్కొనబడింది. [2] "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అల్లాహ్ (సు.తా.) యొక్క ఈ ప్రవచనం ఎంతో ఆలోచింపదగినది. ఇక్కడ ఆయన విశదపరచింది ఏమిటంటే : ఒక మంచి సత్పురుషుని లేక ప్రవక్త సంతతికి చెందినంత మాత్రానా - వారు అవిశ్వాసులై, సత్కార్యాలు చేయని వారైతే - వారి వంశకీర్తి, వారి పెద్దల ప్రవక్తృత్వం వారికి ఏ విధంగానూ పనికిరాదు. ప్రతి ఒక్కడూ తన స్వంత విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగానే ప్రతిఫలం పొందుతాడు. మహా ప్రవక్త ('స'అస) 'హదీస్' ఇలా ఉంది : "ఏ వ్యక్తి వ్యవహారాలైతే అతనిని వెనుక విడిచాయో, అలాంటి వ్యక్తి పుట్టు పూర్యోత్తరాలు, వంశ ప్రతిష్ఠలు అతనిని ఏ మాత్రం ముందుకు తేలేవు." ('స'హీ'హ్ ముస్లిం).
Tafsir berbahasa Arab:
وَاِذْ جَعَلْنَا الْبَیْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًا ؕ— وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّی ؕ— وَعَهِدْنَاۤ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ اَنْ طَهِّرَا بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْعٰكِفِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟
మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి,[1] ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న[2] విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము.
[1] మసా'బతల్లిన్నాస్ : అంటే, ప్రజల కొరకు పుణ్యస్థలం. దీని మరొక అర్థం, మాటిమాటికీ సందర్శించే కేంద్రం. ఎందుకంటే ఒకసారి అల్లాహ్ (సు.తా.) గృహాన్ని సందర్శించినవాడు, మళ్ళీ మళ్ళీ దానిని దర్శించాలని కోరుతూ ఉంటాడు. దీని మరొక మహత్త్వమేమిటంటే, ఇది శాంతి కేంద్రం. అంటే ఇక్కడ ఏ శత్రువు భయం ఉండదు. అందుకే అజ్ఞాన కాలంలో కూడా ముష్రిక్ లు 'హరమ్ సరిహద్దులలో తమ శత్రువులతో పోరాడటం గానీ, హత్యలు గానీ చేసేవారు కాదు. [2] మఖామె ఇబ్రాహీమ్: అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) నిలబడిన రాయి. అతను దానిపైన నిలబడి క'అబహ్ గృహాన్ని నిర్మించారు. అది 'హరమ్ లో క'అబహ్ కు దగ్గరగా ఉంది. 'తవాఫ్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరూ, దాని దగ్గరలో రెండు రకా'అతులు నమా'జ్ చేస్తారు.
Tafsir berbahasa Arab:
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْیَوْمِ الْاَخِرِ ؕ— قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِیْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰی عَذَابِ النَّارِ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించేవారిలో అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్ని రకాల ఫలాలను జీవనోపాధిగా నొసంగు." అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): "మరియు ఎవడు సత్యతిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంత కాలం విడిచి పెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!" అని అన్నాడు.
Tafsir berbahasa Arab:
 
Terjemahan makna Surah: Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad - Daftar isi terjemahan

Diterjemahkan oleh Maulana Abdurrahim bin Muhammad.

Tutup