Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad * - Daftar isi terjemahan

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Terjemahan makna Surah: An-Nisā`   Ayah:
وَّاسْتَغْفِرِ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟ۚ
మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.[1]
[1] అబూ హురైరా (ర'ది.'అ) కథనం: "నేను దైవప్రవక్త ('స'అస) ను, ఇలా అనగా విన్నాను: 'అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతిరోజు 70 సార్ల కంటే ఎక్కువ అల్లాహ్ (సు.తా.) ను క్షమాభిక్ష వేడుకుంటాను మరియు అల్లాహుతా'ఆలా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాను.'" ('స'హీ'హ్ బు'ఖారీ, పు. - 8, 'హ. నం. 329).
Tafsir berbahasa Arab:
وَلَا تُجَادِلْ عَنِ الَّذِیْنَ یَخْتَانُوْنَ اَنْفُسَهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ خَوَّانًا اَثِیْمًا ۟ۚۙ
మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు.
Tafsir berbahasa Arab:
یَّسْتَخْفُوْنَ مِنَ النَّاسِ وَلَا یَسْتَخْفُوْنَ مِنَ اللّٰهِ وَهُوَ مَعَهُمْ اِذْ یُبَیِّتُوْنَ مَا لَا یَرْضٰی مِنَ الْقَوْلِ ؕ— وَكَانَ اللّٰهُ بِمَا یَعْمَلُوْنَ مُحِیْطًا ۟
వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన (అల్లాహ్) కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటపుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.
Tafsir berbahasa Arab:
هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ جَدَلْتُمْ عَنْهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۫— فَمَنْ یُّجَادِلُ اللّٰهَ عَنْهُمْ یَوْمَ الْقِیٰمَةِ اَمْ مَّنْ یَّكُوْنُ عَلَیْهِمْ وَكِیْلًا ۟
అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు?
Tafsir berbahasa Arab:
وَمَنْ یَّعْمَلْ سُوْٓءًا اَوْ یَظْلِمْ نَفْسَهٗ ثُمَّ یَسْتَغْفِرِ اللّٰهَ یَجِدِ اللّٰهَ غَفُوْرًا رَّحِیْمًا ۟
మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు,[1] తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు, అల్లాహ్ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు.!
[1] చూడండి, 17:15.
Tafsir berbahasa Arab:
وَمَنْ یَّكْسِبْ اِثْمًا فَاِنَّمَا یَكْسِبُهٗ عَلٰی نَفْسِهٖ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟
కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
Tafsir berbahasa Arab:
وَمَنْ یَّكْسِبْ خَطِیْٓئَةً اَوْ اِثْمًا ثُمَّ یَرْمِ بِهٖ بَرِیْٓـًٔا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَّاِثْمًا مُّبِیْنًا ۟۠
మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే!
Tafsir berbahasa Arab:
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكَ وَرَحْمَتُهٗ لَهَمَّتْ طَّآىِٕفَةٌ مِّنْهُمْ اَنْ یُّضِلُّوْكَ ؕ— وَمَا یُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَضُرُّوْنَكَ مِنْ شَیْءٍ ؕ— وَاَنْزَلَ اللّٰهُ عَلَیْكَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُ ؕ— وَكَانَ فَضْلُ اللّٰهِ عَلَیْكَ عَظِیْمًا ۟
మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు.[1] మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది.
[1] చూడండి, 42:52 మరియు 28:86.
Tafsir berbahasa Arab:
 
Terjemahan makna Surah: An-Nisā`
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad - Daftar isi terjemahan

Diterjemahkan oleh Maulana Abdurrahim bin Muhammad.

Tutup