Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad * - Daftar isi terjemahan

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Terjemahan makna Surah: Al-An'ām   Ayah:
وَكَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّیَقُوْلُوْۤا اَهٰۤؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَیْهِمْ مِّنْ بَیْنِنَا ؕ— اَلَیْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِیْنَ ۟
మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): "ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది?"[1] అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్ కు తెలియదా?[2]
[1] చూడండి, 46:11, ఈ మాటలు ధనవంతులు పేరు మరియు పేరు ప్రఖ్యాతులు గల అవిశ్వాసులైన ముష్రికులు మొట్టమొదట కాలంలో ఇస్లాం స్వీకరించిన పేదవారినీ, బానిసలనూ చూసి అన్నారు. [2] "అల్లాహ్ (సు.తా.) మీ రూపురేఖలు చూడడు. ఆయన కేవలం మీ హృదయాలు మరియు మీ కర్మలు మాత్రమే చూస్తాడు." ( 'స. ముస్లిం, కితాబ్ అల్ - బిర్ర్, బాబా అత్ - త'హ్రీమ్).
Tafsir berbahasa Arab:
وَاِذَا جَآءَكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاٰیٰتِنَا فَقُلْ سَلٰمٌ عَلَیْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلٰی نَفْسِهِ الرَّحْمَةَ ۙ— اَنَّهٗ مَنْ عَمِلَ مِنْكُمْ سُوْٓءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهٖ وَاَصْلَحَ ۙ— فَاَنَّهٗ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీ వద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి, ఆ తరువాత పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Tafsir berbahasa Arab:
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَلِتَسْتَبِیْنَ سَبِیْلُ الْمُجْرِمِیْنَ ۟۠
మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి, మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము.
Tafsir berbahasa Arab:
قُلْ اِنِّیْ نُهِیْتُ اَنْ اَعْبُدَ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قُلْ لَّاۤ اَتَّبِعُ اَهْوَآءَكُمْ ۙ— قَدْ ضَلَلْتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الْمُهْتَدِیْنَ ۟
ఇలా అను: "నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను." మరియు ఇలా అను: "నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్తవానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను."
Tafsir berbahasa Arab:
قُلْ اِنِّیْ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَكَذَّبْتُمْ بِهٖ ؕ— مَا عِنْدِیْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ ؕ— اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ ؕ— یَقُصُّ الْحَقَّ وَهُوَ خَیْرُ الْفٰصِلِیْنَ ۟
ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు. మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి!"[1]
[1] చూడండి, 8:32-33.
Tafsir berbahasa Arab:
قُلْ لَّوْ اَنَّ عِنْدِیْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ لَقُضِیَ الْاَمْرُ بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِالظّٰلِمِیْنَ ۟
ఇలా అను: "ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.
Tafsir berbahasa Arab:
وَعِنْدَهٗ مَفَاتِحُ الْغَیْبِ لَا یَعْلَمُهَاۤ اِلَّا هُوَ ؕ— وَیَعْلَمُ مَا فِی الْبَرِّ وَالْبَحْرِ ؕ— وَمَا تَسْقُطُ مِنْ وَّرَقَةٍ اِلَّا یَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِیْ ظُلُمٰتِ الْاَرْضِ وَلَا رَطْبٍ وَّلَا یَابِسٍ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟
మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.[1]
[1] అగోచర విషయాల తాళపు చెవులు ఐదు ఉన్నాయి. 1) పునరుత్థాన దినపు జ్ఞానం, 2) వర్షం వచ్చే సమయం, 3) తల్లి గర్భాశయంలో ఉన్న బిడ్డ విషయం, 4) రేపు సంభవించే విషయం, 5) మరణం సంభవించే చోటు. ('స'హీ'హ్ బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అల్-అన్'ఆమ్).
Tafsir berbahasa Arab:
 
Terjemahan makna Surah: Al-An'ām
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad - Daftar isi terjemahan

Diterjemahkan oleh Maulana Abdurrahim bin Muhammad.

Tutup