Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad * - Daftar isi terjemahan

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Terjemahan makna Surah: Surah Al-Muzzammil   Ayah:

సూరహ్ అల్-ముజ్జమ్మిల్

یٰۤاَیُّهَا الْمُزَّمِّلُ ۟ۙ
ఓ దుప్పటి కప్పుకున్నవాడా[1]!
[1] ఈ సూరహ్ అవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. అతనికి లేచి తహజ్దుద్ నమా'జ్ చేయమని ఆజ్ఞ ఇవ్వబడింది. తహజ్జుద్ అతని కొరకు వాజిబ్-తప్పనిసరి చేయబడి ఉండెను. (ఇబ్నె-కసీ'ర్).
Tafsir berbahasa Arab:
قُمِ الَّیْلَ اِلَّا قَلِیْلًا ۟ۙ
రాత్రంతా (నమాజ్ లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;
Tafsir berbahasa Arab:
نِّصْفَهٗۤ اَوِ انْقُصْ مِنْهُ قَلِیْلًا ۟ۙ
దాని సగభాగంలో, లేదా దాని కంటే కొంత తక్కువ;
Tafsir berbahasa Arab:
اَوْ زِدْ عَلَیْهِ وَرَتِّلِ الْقُرْاٰنَ تَرْتِیْلًا ۟ؕ
లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు.
Tafsir berbahasa Arab:
اِنَّا سَنُلْقِیْ عَلَیْكَ قَوْلًا ثَقِیْلًا ۟
నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము.
Tafsir berbahasa Arab:
اِنَّ نَاشِئَةَ الَّیْلِ هِیَ اَشَدُّ وَطْاً وَّاَقْوَمُ قِیْلًا ۟ؕ
నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది.
Tafsir berbahasa Arab:
اِنَّ لَكَ فِی النَّهَارِ سَبْحًا طَوِیْلًا ۟ؕ
వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి.
Tafsir berbahasa Arab:
وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ اِلَیْهِ تَبْتِیْلًا ۟ؕ
మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.
Tafsir berbahasa Arab:
رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِیْلًا ۟
ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.
Tafsir berbahasa Arab:
وَاصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِیْلًا ۟
మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.
Tafsir berbahasa Arab:
وَذَرْنِیْ وَالْمُكَذِّبِیْنَ اُولِی النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِیْلًا ۟
మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు[1]. మరియు వారికి కొంత వ్యవధినివ్వు.
[1] చూడండి, 74:11.
Tafsir berbahasa Arab:
اِنَّ لَدَیْنَاۤ اَنْكَالًا وَّجَحِیْمًا ۟ۙ
నిశ్చయంగా, మా వద్ద వారి కొరకు సంకెళ్ళు మరియు భగభగమండే నరకాగ్ని ఉన్నాయి.
Tafsir berbahasa Arab:
وَّطَعَامًا ذَا غُصَّةٍ وَّعَذَابًا اَلِیْمًا ۟۫
మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).
Tafsir berbahasa Arab:
یَوْمَ تَرْجُفُ الْاَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِیْبًا مَّهِیْلًا ۟
ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి[1].
[1] చూడండి, 14:48 మరియు 20:105-107.
Tafsir berbahasa Arab:
اِنَّاۤ اَرْسَلْنَاۤ اِلَیْكُمْ رَسُوْلًا ۙ۬— شَاهِدًا عَلَیْكُمْ كَمَاۤ اَرْسَلْنَاۤ اِلٰی فِرْعَوْنَ رَسُوْلًا ۟ؕ
మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము.
Tafsir berbahasa Arab:
فَعَصٰی فِرْعَوْنُ الرَّسُوْلَ فَاَخَذْنٰهُ اَخْذًا وَّبِیْلًا ۟
కాని ఫిర్ఔన్ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేశాము.
Tafsir berbahasa Arab:
فَكَیْفَ تَتَّقُوْنَ اِنْ كَفَرْتُمْ یَوْمًا یَّجْعَلُ الْوِلْدَانَ شِیْبَا ۟
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు[1]?
[1] పునరుత్థాన దినమున ఆదమ్ ('అ.స.)తో ఇలా అనబడుతుంది: "నీ సంతానం నుండి నరకం వారిని ఎన్నుకో." అతను ప్రశ్నిస్తాడు : "ఓ అల్లాహ్ (సు.తా.)! ఏ విధంగా?" అల్లాహ్ (సు.తా.) అంటాడు : "ప్రతి వేయిమంది నుండి 999 మందిని, అప్పుడు గర్భవతులైన స్త్రీల పిండాలు పడిపోతాయి మరియు పిల్లలు వృద్ధులై పోతారు." ఈ విషయం విని అనుచరు (ర'ది.'అన్హుమ్)లు చాలా చింతలో పడిపోయారు.అప్పుడు దైవప్రవక్త ('స'అస) అంటారు: "యాజూజ్ మాజూజ్ జాతి వారి నుండి 999 ఉంటారు. మరియు మీలో నుండి ఒకడు; అల్లాహ్ (సు.తా.) కరుణ పై నాకు విశ్వాసముంది. స్వర్గవాసులలో నుండి సగం మంది మీరుంటారు." ('స.బు'ఖారీ)
Tafsir berbahasa Arab:
١لسَّمَآءُ مُنْفَطِرٌ بِهٖ ؕ— كَانَ وَعْدُهٗ مَفْعُوْلًا ۟
అప్పుడు ఆకాశం బ్రద్దలై పోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.
Tafsir berbahasa Arab:
اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟۠
నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!
Tafsir berbahasa Arab:
اِنَّ رَبَّكَ یَعْلَمُ اَنَّكَ تَقُوْمُ اَدْنٰی مِنْ  الَّیْلِ وَنِصْفَهٗ وَثُلُثَهٗ وَطَآىِٕفَةٌ مِّنَ الَّذِیْنَ مَعَكَ ؕ— وَاللّٰهُ یُقَدِّرُ الَّیْلَ وَالنَّهَارَ ؕ— عَلِمَ اَنْ لَّنْ تُحْصُوْهُ فَتَابَ عَلَیْكُمْ فَاقْرَءُوْا مَا تَیَسَّرَ مِنَ الْقُرْاٰنِ ؕ— عَلِمَ اَنْ سَیَكُوْنُ مِنْكُمْ مَّرْضٰی ۙ— وَاٰخَرُوْنَ یَضْرِبُوْنَ فِی الْاَرْضِ یَبْتَغُوْنَ مِنْ فَضْلِ اللّٰهِ ۙ— وَاٰخَرُوْنَ یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ ۖؗ— فَاقْرَءُوْا مَا تَیَسَّرَ مِنْهُ ۙ— وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاَقْرِضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ هُوَ خَیْرًا وَّاَعْظَمَ اَجْرًا ؕ— وَاسْتَغْفِرُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
(ఓ ముహమ్మద్!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒక భాగం (నమాజ్ లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతో పాటు ఉన్న వారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్ఛితంగా పూర్తి రాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్ఆన్ ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు. మరికొందరు అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ ఉండవచ్చు అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి[1]. మరియు నమాజ్ను స్థాపించండి[2], విధిదానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్ ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని కనికరించాడు కావున, తహజ్జుద్ లో మీకు సులభమైనంతనే పఠించండి. రెండు రకాతులైనా సరే. దైవప్రవక్త చాలా మట్టుకు ఎనిమిది రకాతులు చేసేవారు. అతనినే అనుసరించినా ఎంతో మేలు. మీ తహజ్జుద్ నమాజ్ లో వీలైనంత ఖుర్ఆన్ పఠనం చేయండి. నెమ్మదిగా స్పష్టంగా పఠించండి.
[2] అంటే ఐదు సార్లు చేసే ఫ'ర్ద్ నమాజులు. చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలోఈ ఆయత్ మదీనాలో అవతరింపజేయబడింది.
Tafsir berbahasa Arab:
 
Terjemahan makna Surah: Surah Al-Muzzammil
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad - Daftar isi terjemahan

Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu oleh Maulana Abdurrahim bin Muhammad.

Tutup