Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Sura: Al-Baqarah   Versetto:
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ سَرِّحُوْهُنَّ بِمَعْرُوْفٍ ۪— وَلَا تُمْسِكُوْهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوْا ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ— وَلَا تَتَّخِذُوْۤا اٰیٰتِ اللّٰهِ هُزُوًا ؗ— وَّاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ وَمَاۤ اَنْزَلَ عَلَیْكُمْ مِّنَ الْكِتٰبِ وَالْحِكْمَةِ یَعِظُكُمْ بِهٖ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
మరియు మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చి వారికి వారి గడువు ముగింపు ఆసన్నమైనప్పుడు వారిని మేలుతో మీ వివాహ బంధంలో మరల్చుకోండి లేదా మేలుతో వారిని వారి గడువు పూర్తి అయ్యేవరకు వదిలి వేయండి.వారిపై ధ్వేషమును ప్రదర్శించటానికి,వారికి నష్టం కలిగించటానికి మీరు అజ్ఞాన కాలంలో చేసే విధంగా వివాహ బంధంలో మరల్చుకోకండి.ఎవరైతే ఈ విధంగా వారికి నష్టం కలిగించే ఉద్దేశంతో చేస్తారో వారు తమ పై పాపాన్ని,శిక్షను పిలుపునిచ్చి దుర్మార్గమునకు పాల్పడ్డారు.మీరు అల్లాహ్ ఆయతులతో ఆట్లాడటం,వాటి పై ధైర్యాన్ని ప్రదర్శించి వాటిని పరిహాసంగా చేయకండి.మీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి .వాటిలో గొప్పదైన మీ పై అవతరించిన ఖుర్ఆన్,సున్నతును గుర్తు చేసుకోండి.మీ కొరకు కోరికను పెంచడాన్ని,భయపెట్టడానికి దాని ద్వారా మీకు హితోపదేశం చేస్తున్నాడు.ఆయన ఆదేశాలను పాటిస్తు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడండి.అల్లాహ్ సర్వజ్ఞుడని తెలుసుకోండి.ఆయన నుండి ఏ వస్తువు దాగి ఉండదు.త్వరలోనే అతడు మీ ఆచరణలపై మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Esegesi in lingua araba:
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَلَا تَعْضُلُوْهُنَّ اَنْ یَّنْكِحْنَ اَزْوَاجَهُنَّ اِذَا تَرَاضَوْا بَیْنَهُمْ بِالْمَعْرُوْفِ ؕ— ذٰلِكَ یُوْعَظُ بِهٖ مَنْ كَانَ مِنْكُمْ یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— ذٰلِكُمْ اَزْكٰی لَكُمْ وَاَطْهَرُ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
మరియు మీరు మీ భార్యలకు మూడు కన్న తక్కువ (ఒకటి,రెండు) విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు (ఇద్దత్) ముగిస్తే ఓ సంరక్షకులారా మీరు వారిని ఆపకండి.అప్పుడు వారి భార్యల వైపు సరికొత్త నికాహ్ బంధం ద్వారా వారు (బార్యలు) దానిని ఆశించినప్పుడు తమ భర్తలతో పాటు పరస్పర అంగీకారంతో మరలటం జరుగును.వారిని వారించబడిన ఈ ఆదేశం ద్వారా మీలో నుండి అల్లాహ్ పై అంతిమ దినం పై విశ్వాసం కలిగిన వారికి హితోపదేశం చేయబడుతుంది.అది మీలో మేలును ఎక్కువగా వృద్ది పరుస్తుంది,మీ మానమర్యాదలను,మీ ఆచరణలను మాలిన్యాల నుండి అధికంగా పరిశుద్ధ పరుస్తుంది.మరియు అల్లాహ్ కు విషయాల వాస్తవికత గురించి,వాటి పరిణామాల గురించి జ్ఞానమున్నది,మీకు వాటి గురించి జ్ఞానము లేదు.
Esegesi in lingua araba:
وَالْوَالِدٰتُ یُرْضِعْنَ اَوْلَادَهُنَّ حَوْلَیْنِ كَامِلَیْنِ لِمَنْ اَرَادَ اَنْ یُّتِمَّ الرَّضَاعَةَ ؕ— وَعَلَی الْمَوْلُوْدِ لَهٗ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِ ؕ— لَا تُكَلَّفُ نَفْسٌ اِلَّا وُسْعَهَا ۚ— لَا تُضَآرَّ وَالِدَةٌ بِوَلَدِهَا وَلَا مَوْلُوْدٌ لَّهٗ بِوَلَدِهٖ ۗ— وَعَلَی الْوَارِثِ مِثْلُ ذٰلِكَ ۚ— فَاِنْ اَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَیْهِمَا ؕ— وَاِنْ اَرَدْتُّمْ اَنْ تَسْتَرْضِعُوْۤا اَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَیْكُمْ اِذَا سَلَّمْتُمْ مَّاۤ اٰتَیْتُمْ بِالْمَعْرُوْفِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
తల్లులు తమ సంతానమును రెండు సంవత్సరములు పూర్తిగా పాలు త్రాపించాలి.ఈ రెండు సంవత్సరముల పరిమితి పాలు పట్టించే గడువును పూర్తి చేయదలుచుకున్న వారి కొరకు ఉన్నది.విడాకులివ్వబడిన పాలు పట్టించే తల్లుల భోజన,వస్త్ర ఖర్చు బాధ్యత పిల్ల వాడి తండ్రి పై ఉంటుంది.అది ప్రజలకు తెలిసిన ప్రకారంగా ధర్మానికి విరుద్ధంగా కాకుండా ఉంటుంది.అల్లాహ్ ఏ ప్రాణము పై కూడా తన శక్తికి,స్థోమతకు మించి బాధ్యతను మోపడు.తల్లిదండ్రుల్లోంచి ఏ ఒక్కరికి సంతానమును ఎదుటి వారికి నష్టం కలిగించే కారకంగా చేయటం సమ్మతం కాదు.తండ్రి లేని పక్షంలో,పిల్ల వాడి కొరకు ధనం లేకపోతే పిల్ల వాడి వారసులపై తండ్రి హక్కులే ఉంటాయి.ఒక వేళ తల్లిదండ్రులిరువురు రెండు సంవత్సరములు పూర్తి కాకముందే పిల్లవాడికి పాలు పట్టించటంను పరస్పర సంప్రతింపులు,పరస్పర అంగీకరం తరువాత పిల్లవాడి బాగోగు కొరకు వదిలి వేయదలుచుకుంటే వారిద్దరిపై ఆ విషయంలో ఏ పాపముండదు.ఒక వేళ మీ పిల్లల కొరకు తల్లులను కాకుండా వేరే పాలు పట్టించే స్త్రీలను కోరుకుంటే వారికి వేతనము,పిల్లవాడికి మీరు ఖర్చు చేయవలసింది వాయిదా వేయకుండా,తగ్గించకుండా ఇవ్వండి.అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.మీరు చేస్తున్న కార్యాలను ఆయన వీక్షిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి.అందులో నుంచి ఏది ఆయనకు గోప్యంగా లేదు.మీరు ముందు పంపించుకున్న ఆచరణలకి ప్రతిఫలాన్ని ఆయన తొందరలోనే మీకు ప్రసాదిస్తాడు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• نهي الرجال عن ظلم النساء سواء كان بِعَضْلِ مَوْلِيَّتِه عن الزواج، أو إجبارها على ما لا تريد.
తమ ఆదీనంలో ఉన్న స్త్రీని వివాహం నుండి ఆపటం ద్వారా కాని లేదా ఆమెకు ఇష్టం లేని విషయంలో బలవంతం చేయటం ద్వారా కాని స్త్రీలను హింసించటం నుండి మగ వారికి వారింపు.

• حَفِظَ الشرع للأم حق الرضاع، وإن كانت مطلقة من زوجها، وعليه أن ينفق عليها ما دامت ترضع ولده.
తన భర్త నుండి విడాకులివ్వబడిన తల్లి కొరకు పాలును పట్టించే హక్కును ధర్మం సంరక్షించింది.మరియు ఆమె అతని పిల్లవాడికి పాలు పట్టిస్తున్నంత వరకు ఆమెపై ఖర్చు చేసే బాధ్యత అతనిపై (భర్త) ఉన్నది.

• نهى الله تعالى الزوجين عن اتخاذ الأولاد وسيلة يقصد بها أحدهما الإضرار بالآخر.
అల్లాహ్ తఆలా భార్యాభర్తలిద్దరు ఒకరు ఇంకొకరిని సంతానమును నష్టం చేసే కారకంగా తయారు చేసుకోవటం నుండి వారించాడు.

• الحث على أن تكون كل الشؤون المتعلقة بالحياة الزوجية مبنية على التشاور والتراضي بين الزوجين.
వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతీ విషయం భార్యాభర్తలిద్దరి పరస్పర సంప్రతింపులు,పరస్పర అంగీకారంతో జరగాలని ప్రోత్సహించడం జరిగింది.

 
Traduzione dei significati Sura: Al-Baqarah
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi