Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Indice Traduzioni


Traduzione dei significati Versetto: (257) Sura: Al-Baqarah
اَللّٰهُ وَلِیُّ الَّذِیْنَ اٰمَنُوْا یُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ۬— وَالَّذِیْنَ كَفَرُوْۤا اَوْلِیٰٓـُٔهُمُ الطَّاغُوْتُ یُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَی الظُّلُمٰتِ ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
తన పై విశ్వాసం ఉంచిన వారిని అల్లాహ్ బాగా చూసుకుంటాడు. ఆయన వారికి సాఫల్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా, ఆయన వారిని అవిశ్వాసం మరియు అజ్ఞానంతో నిండిన చీకటి నుండి బయటికి తీసి, విశ్వాసం మరియు జ్ఞానంతో నిండిన వెలుగులోకి తీసుకు వెళతాడు. అవిశ్వాసుల స్నేహితులు - సాతాను మరియు అతని సహాయకులు. వారు అవిశ్వాసాన్ని వారికి ఆకర్షణీయంగా కనబడేలా చేస్తారు. ఇంకా, అవిశ్వాసులను విశ్వాసం మరియు జ్ఞానంతో నిండిన వెలుగు నుండి తప్పించి, అవిశ్వాసం మరియు అజ్ఞానంతో నిండిన చీకటిలోకి గెంటుతారు. అలాంటి ప్రజలే ఎల్లప్పుడూ నరకాగ్నిలో పడి ఉంటారు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• من أعظم ما يميز أهل الإيمان أنهم على هدى وبصيرة من الله تعالى في كل شؤونهم الدينية والدنيوية، بخلاف أهل الكفر.
విశ్వాసుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అవిశ్వాసుల మాదిరిగా కాకుండా, వారి ప్రాపంచిక మరియు ధార్మిక పరమైన అన్నీ వ్యవహారాలలో అల్లాహ్ నుండి వారికి మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టి లభిస్తూ ఉంటుంది.

• من أعظم أسباب الطغيان الغرور بالقوة والسلطان حتى يعمى المرء عن حقيقة حاله.
తన సృష్టికర్తపై తిరుగుబాటు యొక్క ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే, అతడి శక్తి మరియు అధికారం ఆ వ్యక్తిని మోసగించి, వాస్తవికతను చూడలేని అంధుడిగా చేసి వేయడం.

• مشروعية مناظرة أهل الباطل لبيان الحق، وكشف ضلالهم عن الهدى.
సత్యాన్ని వివరించడానికి మరియు వారి తప్పిదాలను చూపించడానికి సత్యతిరస్కారులతో చర్చలు జరపడం ఆమోదయోగ్యమే.

• عظم قدرة الله تعالى؛ فلا يُعْجِزُهُ شيء، ومن ذلك إحياء الموتى.
అల్లాహ్ యొక్క శక్తి ఎంతో గొప్పది మరియు అతను జీవన్మరణాలను శాసించడంతో సహా ఏదైనా చేయగలడు.

 
Traduzione dei significati Versetto: (257) Sura: Al-Baqarah
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Indice Traduzioni

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Chiudi