Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Sura: Al-Jâthiyah   Versetto:
قُلْ لِّلَّذِیْنَ اٰمَنُوْا یَغْفِرُوْا لِلَّذِیْنَ لَا یَرْجُوْنَ اَیَّامَ اللّٰهِ لِیَجْزِیَ قَوْمًا بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారితో ఇలా పలకండి : మీరు మీకు బాధ కలిగించిన, అల్లాహ్ అనుగ్రహములను లేదా ఆయన శిక్షలను పట్టించుకోని వారైన అవిశ్వాసపరులను మన్నించి వదిలేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ సహనం చూపే విశ్వాసపరుడికి మరియు అతిక్రమించే అవిశ్వాసపరుడికి ఇహలోకంలో వారు చేసుకున్న కర్మలకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Esegesi in lingua araba:
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ اَسَآءَ فَعَلَیْهَا ؗ— ثُمَّ اِلٰی رَبِّكُمْ تُرْجَعُوْنَ ۟
ఎవరైన ఏదైన సత్కర్మను చేస్తే అతని కర్మ యొక్క ఫలితము అతని కొరకు ప్రయోజనకరమైనది. అతని కర్మ అల్లాహ్ కు అవసరం లేదు. మరియు ఎవరి కర్మ చెడుగా ఉంటుందో అతని కర్మ యొక్క ఫలితము దాని యొక్క శిక్ష అతనిపై చెడుగా ఉండును. మరియు అతని చెడు చేయటం అల్లాహ్ కు నష్టం కలిగించదు. ఆ తరువాత పరలోకంలో ప్రతి ఒక్కరికి యోగ్యమైన ప్రతిఫలమును మేము ప్రసాదించటానికి మీరు మా ఒక్కరి వైపునకే మరలించబడుతారు.
Esegesi in lingua araba:
وَلَقَدْ اٰتَیْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ وَرَزَقْنٰهُمْ مِّنَ الطَّیِّبٰتِ وَفَضَّلْنٰهُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟ۚ
మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీలు సంతతి వారికి తౌరాత్ ను,దాని ఆదేశాలతో ప్రజల మధ్య తీర్పునివ్వటమును ప్రసాదించాము. మరియు మేము వారిలో నుండి చాలామంది ప్రవక్తలను ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలో నుండి చేశాము. మరియు మేము వారికి రకరకాలైన మంచి ఆహారోపాధిని ప్రసాదించాము. మరియు మేము వారికి వారి కాలము నాటి సర్వజనులపై ప్రాధాన్యతను కలిగించాము.
Esegesi in lingua araba:
وَاٰتَیْنٰهُمْ بَیِّنٰتٍ مِّنَ الْاَمْرِ ۚ— فَمَا اخْتَلَفُوْۤا اِلَّا مِنْ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ ۙ— بَغْیًا بَیْنَهُمْ ؕ— اِنَّ رَبَّكَ یَقْضِیْ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
మరియు మేము వారికి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే సూచనలను ప్రసాదించాము. వారు మాత్రం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యము గురించి వారి ముందు వాదనలు నెలకొన్న తరువాత విభేదించుకున్నారు. మరియు వారికి ఈ విభేదాలకు దారి తీసింది మాత్రం వారిలో కొందరు కొందరిపై నాయకత్వము,ప్రతిష్ట పట్ల ఉన్న అత్యాస వలన ఆధిక్యతను ప్రదర్శించటం. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రళయదినమున వారి మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిస్తాడు. అప్పుడు ఎవరు సత్యవంతుడో,ఎవరు అసత్యవంతుడో తేటతెల్లమవుతుంది.
Esegesi in lingua araba:
ثُمَّ جَعَلْنٰكَ عَلٰی شَرِیْعَةٍ مِّنَ الْاَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ۟
ఆ తరువాత మేము మీ కన్న మునుపు ప్రవక్తలకు ఆదేశించిన మా ఆదేశము నుండి మేము మిమ్మల్ని విశ్వాసము వైపునకు మరియు సత్కర్మ వైపునకు పిలిచే ఒక మార్గము,సంప్రదాయము,పధ్ధతిపై నియమించాము. కావున మీరు ఈ ధర్మమును అనుసరించండి. మరియు మీరు సత్యమును గురించి తెలియని వారి మనోవాంఛలను అనుసరించకండి. వారి మనోవాంఛలు సత్యము నుండి తప్పించివేస్తాయి.
Esegesi in lingua araba:
اِنَّهُمْ لَنْ یُّغْنُوْا عَنْكَ مِنَ اللّٰهِ شَیْـًٔا ؕ— وَاِنَّ الظّٰلِمِیْنَ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ۚ— وَاللّٰهُ وَلِیُّ الْمُتَّقِیْنَ ۟
నిశ్చయంగా సత్యమును గురించి తెలియని వారు ఒక వేళ మీరు వారి మనోవాంఛలను అనుసరిస్తే వారు మీ నుండి అల్లాహ్ శిక్షను కొంచము కూడా ఆపజాలరు. మరియు నిశ్చయంగా అన్నీ ధర్మాల్లోంచి,మతాల్లోంచి దుర్మార్గులు ఒకరినొకరు మద్దతిస్తారు. వారి మద్దతు విశ్వాసపరులకు వ్యతిరేకంగా ఉంటుంది. మరియు అల్లాహ్ తన ఆదేశములను పాటించి,తను వారించినవాటి నుండి దూరంగా ఉండి తన భయభీతి కలిగిన వారికి సహాయకుడిగా ఉంటాడు.
Esegesi in lingua araba:
هٰذَا بَصَآىِٕرُ لِلنَّاسِ وَهُدًی وَّرَحْمَةٌ لِّقَوْمٍ یُّوْقِنُوْنَ ۟
మన ప్రవక్తపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అంతర్దృష్టిని ఇచ్చేది దీని ద్వారా ప్రజలు అసత్యము నుండి సత్యమును చూస్తారు. మరియు సత్యము వైపునకు మార్గ దర్శకత్వం చేసేది మరియు నమ్మకమును కలిగిన జనులకు కారుణ్యము. ఎందుకంటే వారే దాని ద్వారా సన్మార్గము వైపునకు తమ నుండి తమ ప్రభువు సంతృప్తి చెంది తమను ఆయన స్వర్గంలో ప్రవేశింపజేసి మరియు తమను నరకాగ్ని నుండి దూరం చేయటానికి మార్గమును పొందుతారు.
Esegesi in lingua araba:
اَمْ حَسِبَ الَّذِیْنَ اجْتَرَحُوا السَّیِّاٰتِ اَنْ نَّجْعَلَهُمْ كَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ۙ— سَوَآءً مَّحْیَاهُمْ وَمَمَاتُهُمْ ؕ— سَآءَ مَا یَحْكُمُوْنَ ۟۠
ఏమీ తమ అవయవాలతో అవిశ్వాసమునకు,పాపకార్యములకు పాల్పడిన వారిని మేము ప్రతిఫల విషయంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసిన వారి మాదిరిగా ఇహలోకములో,పరలోకములో సమానంగా ఉండేటట్లుగా చేస్తామని భావిస్తున్నారా ?. వారి ఈ తీర్పు ఎంతో చెడ్డది.
Esegesi in lingua araba:
وَخَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ وَلِتُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
మరియు అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని అత్యంత విజ్ఞతతో సృష్టించాడు. ఆ రెండిటిని ఆయన వృధాగా సృష్టించలేదు. మరియు ప్రతీ ప్రాణి తాను చేసుకున్న మంచి లేదా చెడుకు ప్రతిఫలం ప్రసాదించబడటానికి. మరియు అల్లాహ్ వారి పుణ్యములను తగ్గించి మరియు వారి పాపములను అధికం చేసి వారికి అన్యాయం చేయడు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• العفو والتجاوز عن الظالم إذا لم يُظهر الفساد في الأرض، ويَعْتَدِ على حدود الله؛ خلق فاضل أمر الله به المؤمنين إن غلب على ظنهم العاقبة الحسنة.
దుర్మార్గుడిని అతడు భూమిలో సంక్షోభమును రేకెత్తించనప్పుడు మరియు అల్లాహ్ హద్దులను అతిక్రమించనప్పుడు మన్నించి,క్షమించి వదిలి వేయటం అల్లాహ్ విశ్వాసపరులకు ఆదేశించిన ఉన్నత గుణము. (ఇలాగే చేస్తే) ఒక మంచి ఫలితము వారి ఆలోచనకు దాటివేయాలి.

• وجوب اتباع الشرع والبعد عن اتباع أهواء البشر.
ధర్మమమును అనుసరించటం మరియు మనిషి యొక్క మనోవాంఛలను అనుసరించటం నుండి దూరంగా ఉండటం తప్పనిసరి అవటం.

• كما لا يستوي المؤمنون والكافرون في الصفات، فلا يستوون في الجزاء.
విశ్వాసపరులు అవిశ్వాసపరులకు గుణములలో సమానము కానట్లే ప్రతిఫలం విషయంలో సమానులు కారు.

• خلق الله السماوات والأرض وفق حكمة بالغة يجهلها الماديون الملحدون.
అల్లాహ్ ఆకాశములను గొప్ప జ్ఞానంతో సృష్టించాడు దాని గురించి నాస్తికులకు,భౌతికవాదులకు తెలియదు.

 
Traduzione dei significati Sura: Al-Jâthiyah
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi