Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Sura: Al-Ahqâf   Versetto:
وَاِذْ صَرَفْنَاۤ اِلَیْكَ نَفَرًا مِّنَ الْجِنِّ یَسْتَمِعُوْنَ الْقُرْاٰنَ ۚ— فَلَمَّا حَضَرُوْهُ قَالُوْۤا اَنْصِتُوْا ۚ— فَلَمَّا قُضِیَ وَلَّوْا اِلٰی قَوْمِهِمْ مُّنْذِرِیْنَ ۟
ఓ ప్రవక్తా మేము మీ వైపునకు జిన్నుల్లో నుండి ఒక వర్గమును మీ వద్దకు పంపిస్తే వారు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ ను వింటున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. వారు దాన్ని వినటానికి హాజరు అయినప్పుడు పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు : మేము దాన్ని వినగలిగే వరకు మీరు నిశబ్దంగా ఉండండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖిరాఅత్ ను ముగించగానే వారు తమ జాతి వారి వద్దకు ఒక వేళ వారు ఈ ఖుర్ఆన్ ను విశ్వసించకపోతే వారిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ మరలారు.
Esegesi in lingua araba:
قَالُوْا یٰقَوْمَنَاۤ اِنَّا سَمِعْنَا كِتٰبًا اُنْزِلَ مِنْ بَعْدِ مُوْسٰی مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ یَهْدِیْۤ اِلَی الْحَقِّ وَاِلٰی طَرِیْقٍ مُّسْتَقِیْمٍ ۟
వారు వారితో ఇలా పలికారు : ఓ మా జాతి వారా మేము మూసా తరువాత అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధమును విన్నాము అది దాని కన్న మునుపు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను దృవీకరుస్తుంది. మేము విన్న ఈ గ్రంధము సత్యము వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది. మరియు అది ఇస్లాం మార్గము.
Esegesi in lingua araba:
یٰقَوْمَنَاۤ اَجِیْبُوْا دَاعِیَ اللّٰهِ وَاٰمِنُوْا بِهٖ یَغْفِرْ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَیُجِرْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ ۟
ఓ మా జాతి వారా ముహమ్మద్ మిమ్మల్ని పిలుస్తున్న సత్యము విషయంలో ఆయనను స్వీకరించండి. మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపములను మీ కొరకు మన్నించివేస్తాడు మరియు ఆయన మిమ్మల్ని మీ కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన సత్యము విషయంలో ఆయనను అంగీకరించకపోయినప్పుడు మరియు ఆయనను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించనప్పుడు మీరు బాధాకరమైన శిక్షకు అర్హులవుతారు.
Esegesi in lingua araba:
وَمَنْ لَّا یُجِبْ دَاعِیَ اللّٰهِ فَلَیْسَ بِمُعْجِزٍ فِی الْاَرْضِ وَلَیْسَ لَهٗ مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءُ ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిచిన సత్యమును అంగీకరించని వాడు భూమిలో పారిపోయి అల్లాహ్ నుండి తప్పించుకోలేడు. మరియు అతని కొరకు శిక్ష నుండి రక్షించే వాడు అల్లాహ్ కాకుండా ఏ రక్షకుడు లేడు. వారందరు సత్యము నుండి స్పష్టముగా తప్పిపోయారు.
Esegesi in lingua araba:
اَوَلَمْ یَرَوْا اَنَّ اللّٰهَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَلَمْ یَعْیَ بِخَلْقِهِنَّ بِقٰدِرٍ عَلٰۤی اَنْ یُّحْیِ الْمَوْتٰی ؕ— بَلٰۤی اِنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరు ఆ అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని సృష్టించిన వాడు మరియు అవి పెద్దవైనా కూడా,విశాలమైనా కూడా వాటిని సృష్టించటం నుండి అశక్తుడు కాని వాడు మృతులను లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు జీవింపజేయటం పై సామర్ధ్యం కలవాడని చూడటం లేదా ?! ఎందుకు కాదు. ఆయన వారిని జీవింపజేయటంపై సామర్ధ్యము కలవాడు. పరిశుద్ధుడైన ఆయన ప్రతీ వస్తువుపై సామర్ధ్యం కలవాడు. మృతులను జీవిపజేయటం నుండి ఆయన అశక్తుడు కాడు.
Esegesi in lingua araba:
وَیَوْمَ یُعْرَضُ الَّذِیْنَ كَفَرُوْا عَلَی النَّارِ ؕ— اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ— قَالُوْا بَلٰی وَرَبِّنَا ؕ— قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟
మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శక్షించటానికి తిసుకుని రాబడే దినమున వారితో మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఏమీ మీరు చూస్తున్నటువంటి ఈ శిక్ష వాస్తవం కాదా ?! లేదా మీరు ఇహలోకంలో మీరు పలికిన విధంగా అబద్దమా ?! వారు, మా ప్రభువు సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము అని పలుకుతారు. అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : అల్లాహ్ పై మీ అవిశ్వాసం కారణంగా మీరు శిక్షను చవిచూడండి.
Esegesi in lingua araba:
فَاصْبِرْ كَمَا صَبَرَ اُولُوا الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِلْ لَّهُمْ ؕ— كَاَنَّهُمْ یَوْمَ یَرَوْنَ مَا یُوْعَدُوْنَ ۙ— لَمْ یَلْبَثُوْۤا اِلَّا سَاعَةً مِّنْ نَّهَارٍ ؕ— بَلٰغٌ ۚ— فَهَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الْفٰسِقُوْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు నూహ్,ఇబ్రాహీమ్,మూసా,ఈసా అలైహిముస్సలాంటి దృఢ సంకల్పం కల ప్రవక్తలు సహహనం పాటించినట్లుగా మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించటంపై సహనం చూపండి. వారి కొరకు శిక్ష గురించి తొందర చేయకండి. మీ జాతి వారిలో నుండి తిరస్కారులు పరలోకంలో వారికి వాగ్దానం చేయబడిన శిక్షను చూసిన రోజు వారి శిక్ష పొడిగింపు వలన వారు ఇహలోకంలో దినపు ఒక ఘడియను మాత్రమే గడిపారనుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఒక సందేశము మరియు మానవులకు,జిన్నులకు చాలును. నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన జాతి వారు మాత్రమే శిక్ష ద్వారా నాశనం చేయబడుతారు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• من حسن الأدب الاستماع إلى المتكلم والإنصات له.
మాట్లాడేవాడి మాటను వినటం మరియు అతని ముందు నిశబ్దంగా ఉండటం మంచి నడవడిక.

• سرعة استجابة المهتدين من الجنّ إلى الحق رسالة ترغيب إلى الإنس.
జిన్నుల్లో నుండి సత్యం వైపునకు మార్గం పొందిన వారి ప్రతిస్పందన వేగము మానవులకు ప్రేరణ కలిగించే సందేశం.

• الاستجابة إلى الحق تقتضي المسارعة في الدعوة إليه.
సత్యము వైపునకు ప్రతిస్పందించటం దాని వైపునకు సందేశమివ్వటంలో త్వరపడటమును నిర్ణయిస్తుంది.

• الصبر خلق الأنبياء عليهم السلام.
సహనం దైవ ప్రవక్తలు అలైహిముస్సలాముల గుణము.

 
Traduzione dei significati Sura: Al-Ahqâf
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi