Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Sura: Muhammad   Versetto:
وَلَوْ نَشَآءُ لَاَرَیْنٰكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسِیْمٰهُمْ ؕ— وَلَتَعْرِفَنَّهُمْ فِیْ لَحْنِ الْقَوْلِ ؕ— وَاللّٰهُ یَعْلَمُ اَعْمَالَكُمْ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మేము కపటులను మీకు తెలిపరచదలచితే వారిని మీకు తప్పకుండా తెలియపరుస్తాము. అప్పుడు మీరు వారి చిహ్నాల ద్వారా వారిని గుర్తు పడతారు. మరియు మీరు తొందరలోనే వారిని వారి మాట తీరు ద్వారా గుర్తుపట్టేవారు. మరియు మీ కర్మల గురించి అల్లాహ్ కు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Esegesi in lingua araba:
وَلَنَبْلُوَنَّكُمْ حَتّٰی نَعْلَمَ الْمُجٰهِدِیْنَ مِنْكُمْ وَالصّٰبِرِیْنَ ۙ— وَنَبْلُوَاۡ اَخْبَارَكُمْ ۟
ఓ విశ్వాసపరులారా మేము తప్పకుండా మిమ్మల్ని ధర్మ యుద్దముతో,శతృవుల పోరాటముతో,చంపటముతో పరీక్షిస్తాము చివరికి అల్లాహ్ మార్గములో మీలో నుండి ధర్మపోరాటకులను మరియు ఆయన శతృవులతో పోరాటములో మీలో నుండి సహనం పాటించే వారిని మేము తెలుసుకుంటాము. మరియు మేము మిమ్మల్ని పరీక్షించి మీలో నుండి సత్యపరుడిని మరియు అసత్యపరుడిని మేము తెలుసుకుంటాము.
Esegesi in lingua araba:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ وَشَآقُّوا الرَّسُوْلَ مِنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدٰی ۙ— لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ؕ— وَسَیُحْبِطُ اَعْمَالَهُمْ ۟
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచి, స్వయంగా అల్లాహ్ ధర్మము నుండి ఆపుకుని మరియు ఇతరులను కూడా దాని నుండి ఆపి మరియు ఆయన ప్రవక్తను విరోధించి,ఆయన ఒక ప్రవక్త అని స్పష్టమైన తరువాత కూడా ఆయనతో శతృత్వమును చూపుతారో వారు అల్లాహ్ కు నష్టం కలిగించలేరు. వారు తమ స్వయమునకు మాత్రమే నష్టం కలిగించుకుంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే వారి కర్మలను నిష్ఫలం చేస్తాడు.
Esegesi in lingua araba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ وَلَا تُبْطِلُوْۤا اَعْمَالَكُمْ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించిన వారా మీరు అల్లాహ్ పై ,ప్రవక్త పై వారిరువురి ఆదేశములను పాటించి,వారు వారించిన వాటిని విడనాడి విధేయత చూపండి. మరియు మీరు అవిశ్వాసముతో,ప్రదర్శనా బుద్ధితో మీ కర్మలను వృధా చేసుకోకండి.
Esegesi in lingua araba:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ مَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అల్లాహ్ ధర్మము నుండి తమ స్వయాన్ని ఆపుకుని,ప్రజలను ఆపి ఆ తరువాత పశ్చాత్తాప్పడక ముందే తమ అవిశ్వాస స్థితిలో మరణించేవారిని అల్లాహ్ వారి పాపములను వాటిపై పరదా వేసి మన్నించడు. కాని వారిని వాటి పరంగా పట్టుకుంటాడు మరియు వారిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేశింపజేస్తాడు.
Esegesi in lingua araba:
فَلَا تَهِنُوْا وَتَدْعُوْۤا اِلَی السَّلْمِ ۖۗ— وَاَنْتُمُ الْاَعْلَوْنَ ۖۗ— وَاللّٰهُ مَعَكُمْ وَلَنْ یَّتِرَكُمْ اَعْمَالَكُمْ ۟
ఓ విశ్వాసపరులారా మీరు మీ శతృవులను ఎదుర్కోవటం నుండి బలహీనపడకండి మరియు మీరు వారిని సంధి కొరకు వారు పిలవక ముందే వారిని పిలవకండి. మరియు మీరే వారిపై ప్రాబల్యం పొందేవారును,ఆధిక్యతను చూపేవారును. మరియు అల్లాహ్ తన సహాయము ద్వారా,తన మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాడు. మరియు ఆయన మీ కర్మల ప్రతిఫలమును మీకు ఏ మాత్రం తగ్గించడు. అంతేకాదు ఆయన తన వద్ద నుండి ఉపకారముగా మరియు అనుగ్రహముగా మీకు అధికంగా ఇస్తాడు.
Esegesi in lingua araba:
اِنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّلَهْوٌ ؕ— وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا یُؤْتِكُمْ اُجُوْرَكُمْ وَلَا یَسْـَٔلْكُمْ اَمْوَالَكُمْ ۟
నిశ్చయంగా ప్రాపంచిక జీవితం ఓ ఆట మరియు కాలక్షేపం మాత్రమే. కావున ఒక బుద్ధిమంతుడు వాటి వలన తన పరలోక కర్మ నుండి నిర్లక్ష్యం చేయకూడదు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి, అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటిని విడనాడి భయభీతిని కలిగి ఉంటే ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలమును తగ్గించకుండా సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ నుండి మీ సంపదలను పూర్తిగా అడగడు. ఆయన మీ నుండి విధి దానమైన జకాత్ ను మాత్రమే అడుగుతాడు.
Esegesi in lingua araba:
اِنْ یَّسْـَٔلْكُمُوْهَا فَیُحْفِكُمْ تَبْخَلُوْا وَیُخْرِجْ اَضْغَانَكُمْ ۟
ఒక వేళ ఆయన మీ నుండి మీ సంపదలన్నింటిని అడిగి మరియు దాన్ని మీ నుండి అడగటమును పట్టుబట్టితే మీరు దాని విషయంలో పిసినారితనమును చూపుతారు. మరియు ఆయన తన మార్గంలో ఖర్చు చేయటం విషయంలో మీ హృదయముల్లో ఉన్న అసహ్యమును బయటపెడుతాడు. కావున ఆయన మీపై దయ వలన దాన్ని మీ నుండి అడగటమును వదిలివేశాడు.
Esegesi in lingua araba:
هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ تُدْعَوْنَ لِتُنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— فَمِنْكُمْ مَّنْ یَّبْخَلُ ۚ— وَمَنْ یَّبْخَلْ فَاِنَّمَا یَبْخَلُ عَنْ نَّفْسِهٖ ؕ— وَاللّٰهُ الْغَنِیُّ وَاَنْتُمُ الْفُقَرَآءُ ۚ— وَاِنْ تَتَوَلَّوْا یَسْتَبْدِلْ قَوْمًا غَیْرَكُمْ ۙ— ثُمَّ لَا یَكُوْنُوْۤا اَمْثَالَكُمْ ۟۠
ఇదిగో మీరే అల్లాహ్ మార్గంలో మీ సంపదల నుండి కొంత భాగమును ఖర్చు చేయమని పిలవబడిన వారందరు. మరియు మీ సంపదలన్నింటిని ఖర్చు చేయమని మీతో అడగబడలేదు. అయితే మీలో నుండి కొందరు దాని నుండి పిసినారితనంతో ఖర్చు చేయమని అడగబడిన దాని నుండి ఆగిపోయిన వారు ఉన్నారు. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో తన సంపద నుండి కొంత భాగమును ఖర్చు చేయటం నుండి పిసినారితనం చూపుతాడో వాస్తవానికి అతను ఖర్చు చేయటం యొక్క పుణ్యమును కొల్పోవటం వలన తన స్వయంపై మాత్రమే పిసినారితనం చూపుతాడు. మరియు అల్లాహ్ స్వయంసమృద్ధుడు ఆయనకు మీ ఖర్చు చేయటం యొక్క అవసరం లేదు. మరియు మీరు ఆయన అవసరం కలవారు. ఒక వేళ మీరు ఇస్లాం నుండి అవిశ్వాసం వైపునకు మరలితే ఆయన మిమ్మల్ని నాశనం చేసి ఇతర జాతిని తీసుకుని వస్తాడు. ఆ పిదప వారు మీలాంటి వారై ఉండరు. అంతే కాదు వారు ఆయనకు విధేయులై ఉంటారు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• سرائر المنافقين وخبثهم يظهر على قسمات وجوههم وأسلوب كلامهم.
కపటుల రహస్యాలు మరియు వారి దుర్మార్గం వారి ముఖాల లక్షణాలు మరియు వారి మాట తీరులో బహిర్గతమవుతాయి.

• الاختبار سُنَّة إلهية لتمييز المؤمنين من المنافقين.
విశ్వాసపరులను కపటుల నుండి వేరు పరచుట కొరకు పరీక్షించటం ఒక దైవ సంప్రదాయం.

• تأييد الله لعباده المؤمنين بالنصر والتسديد.
సహయం చేయటం ద్వారా మరియు సరైన మార్గం చూపటం ద్వారా తన దాసుల కొరకు అల్లాహ్ మద్దతు.

• من رفق الله بعباده أنه لا يطلب منهم إنفاق كل أموالهم في سبيل الله.
తన దాసులతో వారి సంపదలన్నీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటమును కోరకపోవటం వారిపై అల్లాహ్ దయ.

 
Traduzione dei significati Sura: Muhammad
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi