Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni


Traduzione dei significati Sura: Al-Mâ’idah   Versetto:
اِنَّمَا یُرِیْدُ الشَّیْطٰنُ اَنْ یُّوْقِعَ بَیْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ فِی الْخَمْرِ وَالْمَیْسِرِ وَیَصُدَّكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ وَعَنِ الصَّلٰوةِ ۚ— فَهَلْ اَنْتُمْ مُّنْتَهُوْنَ ۟
షైతాను ఉద్దేశం మాత్రం మత్తు పదార్దాల ద్వారా,జూదము ద్వారా హృదయాల మధ్య ధ్వేషాలను,వైరాలను వేయటం,అల్లాహ్ ధ్యానము నుండి మరలించటం.ఓ విశ్వాసపరులారా మీరు ఈ చెడులను వదిలేస్తారా?.ఇది (వదిలి వేయటం) మీకు తగినదని చెప్పడంలో సందేహం లేదు.అయితే మీరు వాటిని వదిలి వేయండి.
Esegesi in lingua araba:
وَاَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ وَاحْذَرُوْا ۚ— فَاِنْ تَوَلَّیْتُمْ فَاعْلَمُوْۤا اَنَّمَا عَلٰی رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِیْنُ ۟
మీరు ధర్మ ఆదేశాలను పాటించి,అది (ధర్మము) వారించిన వాటికి దూరంగా ఉండి అల్లాహ్ కు,ప్రవక్తకు విధేయత చూపండి.వ్యతిరేకతకు దూరంగా ఉండండి.ఒక వేళ మీరు దీని నుండి విముఖత చూపితే మన ప్రవక్తపై అల్లాహ్ చేరవేయమని ఇచ్చిన ఆదేశాలను చేరవేసే బాధ్యత మాత్రమే అన్న విషయాన్ని తెలుసుకోండి.ఆయన చేరవేసేశారు.ఒక వేళ మీరు సన్మార్గమును స్వీకరిస్తే అది మీ స్వయం కొరకు.ఒక వేళ మీరు చెడు చేస్తే దాని ప్రకారం (ప్రతి ఫలం) ఉంటుంది.
Esegesi in lingua araba:
لَیْسَ عَلَی الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِیْمَا طَعِمُوْۤا اِذَا مَا اتَّقَوْا وَّاٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوْا وَّاٰمَنُوْا ثُمَّ اتَّقَوْا وَّاَحْسَنُوْا ؕ— وَاللّٰهُ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟۠
అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన సన్నిదిని పొందటానికి సత్కార్యాలు చేసినవారిపై అల్లాహ్ ఆగ్రహం తమపై కురుస్తుందని భయపడి ఆయనపై విశ్వాసమును కనబరుస్తూ,సత్కార్యములను చేస్తూ నిషేదించబడిన వాటికి దూరమైనప్పుడు మధ్యమును నిషేదించబడక మునుపు సేవించిన దానికి ఎటువంటి దోషం లేదు.ఆ తరువాత వారు అల్లాహ్ సన్నిదిని ఎంతవరకు పొందారంటే అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఆరాధించసాగారు.అల్లాహ్ తనను ప్రత్యక్షంగా చూస్తున్న భావనతో ఆరాధన చేసేవారిని ఇష్టపడుతాడు.వారిలో అల్లాహ్ యొక్క పర్యవేక్షణ భావన ఎల్లప్పుడు ఉండటం వలన అది విశ్వాసపరునికి తన ఆచరణను ఉత్తమంగా,నైపుణ్యతతో చేయటానికి తోడ్పడుతుంది.
Esegesi in lingua araba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَیَبْلُوَنَّكُمُ اللّٰهُ بِشَیْءٍ مِّنَ الصَّیْدِ تَنَالُهٗۤ اَیْدِیْكُمْ وَرِمَاحُكُمْ لِیَعْلَمَ اللّٰهُ مَنْ یَّخَافُهٗ بِالْغَیْبِ ۚ— فَمَنِ اعْتَدٰی بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను మీ వద్దకు తీసుకుని వచ్చి మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాడు.వాటిలోంచి చిన్న వాటిని మీ చేతులతో,పెద్దవాటిని మీ ఈటెలతో పొందుతారు.అల్లాహ్.దాశుల్లోంచి ఎవరు ఆయనను చూడకుండానే ఆయనపై,ఆయన జ్ఞానం పట్ల సంపూర్ణ విశ్వాసం వలన ఆయనతో భయపడుతాడో,తన కార్యం తన సృష్టికర్తపై గోప్యంగా ఉండదని భయపడి వేటను ఆపుకుంటాడో అల్లాహ్ తన ఆవిర్బావ జ్ఞానము ద్వార తెలుసుకుని దాని ప్రకారం లెక్క తీసుకుంటాడు.ఎవరైతే హద్దుమీరి ప్రవర్తిస్తాడో,హజ్,ఉమ్రా ఇహ్రామ్ స్ధితిలో వేటాడుతాడో అతని కొరకు ప్రళయ దినాన బాధాకరమైన శిక్ష ఉన్నది.ఎందుకంటే అతను అల్లాహ్ వారించిన దానిని చేసి వ్యతిరేకతను చూపాడు.
Esegesi in lingua araba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقْتُلُوا الصَّیْدَ وَاَنْتُمْ حُرُمٌ ؕ— وَمَنْ قَتَلَهٗ مِنْكُمْ مُّتَعَمِّدًا فَجَزَآءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ یَحْكُمُ بِهٖ ذَوَا عَدْلٍ مِّنْكُمْ هَدْیًا بٰلِغَ الْكَعْبَةِ اَوْ كَفَّارَةٌ طَعَامُ مَسٰكِیْنَ اَوْ عَدْلُ ذٰلِكَ صِیَامًا لِّیَذُوْقَ وَبَالَ اَمْرِهٖ ؕ— عَفَا اللّٰهُ عَمَّا سَلَفَ ؕ— وَمَنْ عَادَ فَیَنْتَقِمُ اللّٰهُ مِنْهُ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ ذُو انْتِقَامٍ ۟
ఓ విశ్వాసపరులారా మీరు హజ్ లేదా ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి.మీలో నుంచి ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపితే అతనిపై తాను చంపిన జంతువునకు సమానమైన జంతువు ఒంటె,ఆవు,గొర్రెలో నుంచి పరిహారంగా చెల్లించటం ఆవశ్యం.దాని గురించి ముస్లిముల మధ్య న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులు తీర్పునిస్తారు.వారిద్దరు నిర్ణయించేది చేయాలి.పరిహారంగా ఇచ్చే ఖుర్బానీని మక్కాకు చేరవేసి హరమ్లో దానిని జుబాహ్ చేయాలి లేదా దాని విలువగల భోజనమును హరమ్ ప్రాంతపు పేదవారికి ఏర్పాటు చేయాలి.ప్రతి పేదవానికి సగం సా (1.25కిగ్రా) ఇవ్వాలి లేదా ప్రతి సగం సా కి బదులుగా ఒక రోజు ఉపవాసముండాలి.ఇదంతా వేట జంతువుని చంపిన వ్యక్తి తాను దానిని చంపటానికి ముందడుగు వేసినందుకు శిక్షను అనుభవించటం కొరకు.వేట జంతువును చంపటంను నిషేదించక మునుపు ఇహ్రామ్ వేసుకున్న వ్యక్తి చంపిన దానిని అల్లాహ్ మన్నించి వేశాడు.నిషేదము తరువాత దానిని చేసేవాడిని అల్లాహ్ శిక్షిస్తూ ప్రతీకారం తీసుకుంటాడు.మరియు అల్లహ్ బలవంతుడును,ఆపేవాడును తనపై విధేయత చూపే వారిని తాను తలచుకుంటే ప్రతీకారం తీసుకోవటం అతని శక్తిలోంచే.దాని నుంచి ఎవరు ఆయనను ఆపలేరు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• عدم مؤاخذة الشخص بما لم يُحَرَّم أو لم يبلغه تحريمه.
ఒక వ్యక్తిని నిషేదించబడని వాటి వలన లేదా దాని నిషేదము గురించి వార్త అతనికి చేరక ముందు చేసిన వాటి వలన శిక్షించటం జరగదు.

• تحريم الصيد على المحرم بالحج أو العمرة، وبيان كفارة قتله.
ఉమ్రా లేదా హజ్ ఇహ్రామ్ కట్టుకున్న వ్యక్తి పై వేటాడటం నిషేదం,వాటిని చంపటం నకు పరిహారము వివరణ.

• من حكمة الله عز وجل في التحريم: ابتلاء عباده، وتمحيصهم، وفي الكفارة: الردع والزجر.
నిషేదించటంలో అల్లాహ్ ఉద్దేశం:తన దాశులను పరీక్షించటం,వారిని పరిశీలించటం.మరియు పరిహారమును విధించటంలో ఉద్దేశం:నిరోదించటం,మందలించటం.

 
Traduzione dei significati Sura: Al-Mâ’idah
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi