Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano * - Indice Traduzioni

Traduzione dei significati Sura: Ar-Rahmân   Versetto:
مَرَجَ الْبَحْرَیْنِ یَلْتَقِیٰنِ ۟ۙ
ఆయన (అల్లాహ్) ఉప్పు మరియు తీపి సముద్రములను కలిపాడు అవి కంటికి కనిపించటంలో కలుస్తుంటాయి.
Esegesi in lingua araba:
بَیْنَهُمَا بَرْزَخٌ لَّا یَبْغِیٰنِ ۟ۚ
వాటి మధ్య ఒక అడ్డు కట్ట ఉన్నది అది వాటిలో నుండి ప్రతి ఒక్క దాన్ని వేరే దాన్ని ఆక్రమించుకోకుండా తీపిది తీపిగా మరియు ఉప్పుది ఉప్పగా ఉండేందుకు ఆపుతుంది.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
یَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ ۟ۚ
రెండు సముద్రముల నుండి పెద్దవి మరియు చిన్నవి ముత్యములు వెలికి వస్తాయి.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
وَلَهُ الْجَوَارِ الْمُنْشَاٰتُ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ۟ۚ
సముద్రముల్లో పర్వతములవలె పయనించే ఓడలను పయనింపచేసే అధికారము పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన ఒక్కడికే ఉన్నది.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟۠
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
كُلُّ مَنْ عَلَیْهَا فَانٍ ۟ۚۖ
సృష్టితాల్లోంచి భూమిపై ఉన్న ప్రతీది ఖచ్చితంగా నాశనమవుతుంది.
Esegesi in lingua araba:
وَّیَبْقٰی وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ ۟ۚ
ఓ ప్రవక్తా తన దాసుల పట్ల గొప్పతనము,దాతృత్వం మరియు దయ కల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మిగిలి ఉంటుంది. దానికి వినాశనం ఎన్నటికీ కలగదు.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
یَسْـَٔلُهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلَّ یَوْمٍ هُوَ فِیْ شَاْنٍ ۟ۚ
ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి మరియు భూమిలో ఉన్న జిన్నులు,మానవుల్లోంచి ప్రతి ఒక్కరు తమ అవసరములను ఆయనతోనే వేడుకుంటారు. ప్రతి రోజు ఆయన తన దాసుల వ్యవహారములైన జీవింపజేయటం,మరణింపజేయటం మరియు ఆహారం ప్రసాదించటం మొదలగు వాటిలొ నిమగ్నుడై ఉంటాడు.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
سَنَفْرُغُ لَكُمْ اَیُّهَ الثَّقَلٰنِ ۟ۚ
ఓ మానవుల్లారా,జిన్నుల్లారా త్వరలోనే మేము మీ లెక్క చూసి ప్రతి ఒక్కరికి వారికి యోగ్యమైన ప్రతిఫలమును,శిక్షను ప్రసాదిస్తాము.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
یٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا ؕ— لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ ۟ۚ
జిన్నులు మరియు మానవులు సమావేశమైనప్పుడు ప్రళయదినమున అల్లాహ్ ఇలా పలుకుతాడు : ఓ జిన్నుల మరియు మానవుల జాతుల వారా ఒక వేళ మీరు మీ కొరకు భూమ్యాకాశముల సరిహద్దుల్లోంచి ఏ సరిహద్దు నుంచైన బయటకు పోయే మార్గం పొందగలిగితే మీరు చేసి చూడండి. మీరు అది ఏదైన బలముతో,ఆధారముతో మాత్రమే చేయగలుగుతారు. మరియు అది మీ దగ్గర ఎక్కడున్నది ?.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
یُرْسَلُ عَلَیْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ ۙ۬— وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ ۟ۚ
ఓ మానవులు మరియు జిన్నాతుల్లారా ఆయన మీపై పొగ లేని అగ్ని జ్వాలలను మరియు జ్వాలలు లేని పొగను పంపిస్తాడు. మీరు దాన్ని ఆపలేరు.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ ۟ۚ
మరియు ఆకాశం దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్దలైనప్పుడు అది రంగు మెరవటంలో నూనెలా ఎర్రగా అయిపోతుంది.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
فَیَوْمَىِٕذٍ لَّا یُسْـَٔلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ ۟ۚ
ఆ మహోన్నతమైన దినమున మానవులకు,జిన్నులకు వారి పాపముల గురించి అడగబడదు ఎందుకంటే వారి కర్మల గురించి అల్లాహ్ కు తెలుసు కాబట్టి.
Esegesi in lingua araba:
فَبِاَیِّ اٰلَآءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۟
ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
Esegesi in lingua araba:
یُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِیْمٰهُمْ فَیُؤْخَذُ بِالنَّوَاصِیْ وَالْاَقْدَامِ ۟ۚ
అపరాదులు ప్రళయదినమున తమ చిహ్నాలైన ముఖములు నల్లబడటం,కళ్ళు నీలంగా మారటం ద్వారా గుర్తించబడుతారు. అప్పుడు వారి నుదుటులను వారి కాళ్ళతో కలిపి కట్టబడి వారు నరకంలో విసరబడుతారు.
Esegesi in lingua araba:
Alcuni insegnamenti da trarre da questi versi sono:
• الجمع بين البحر المالح والعَذْب دون أن يختلطا من مظاهر قدرة الله تعالى.
ఉప్పు నీటి,తీపి నీటి సముద్రముల మధ్య అవి రెండు కలవకుండా సమీకరించటం మహోన్నతుడైన అల్లాహ్ సామర్ధ్యము యొక్క దృశ్యముల్లోంచివి.

• ثبوت الفناء لجميع الخلائق، وبيان أن البقاء لله وحده حضٌّ للعباد على التعلق بالباقي - سبحانه - دون من سواه.
సృష్టి రాసులందరి వినాశన నిరూపణ మరియు అల్లాహ్ ఒక్కడికే అనునిత్యం ఉండటం సాధ్యం అని ప్రకటన దాసుల కొరకు ఎవరు కాకుండా పరిశుద్ధుడైన నిత్యం ఉండే వాడితో సంబంధం ఏర్పరుచుకోవటం కొరకు ప్రేరణ కలదు.

• إثبات صفة الوجه لله على ما يليق به سبحانه دون تشبيه أو تمثيل.
అల్లాహ్ కొరకు ముఖము యొక్క గుణము పరిశుద్ధుడైన ఆయనకు తగిన విధంగా ఎటువంటి పోలిక లేదా నమూనా లేకుండా నిరూపించటం.

• تنويع عذاب الكافر.
అవిశ్వాసపరుని శిక్ష యొక్క రకాలను తెలపటం.

Traduzione dei significati Sura: Ar-Rahmân
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione telugu dell'Abbreviata Esegesi del Nobile Corano - Indice Traduzioni

Emesso dal Tafseer Center per gli Studi Coranici.

Chiudi