Check out the new design

Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed * - Indice Traduzioni

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduzione dei significati Sura: An-Naba’   Versetto:
اِنَّ لِلْمُتَّقِیْنَ مَفَازًا ۟ۙ
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
Esegesi in lingua araba:
حَدَآىِٕقَ وَاَعْنَابًا ۟ۙ
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
Esegesi in lingua araba:
وَّكَوَاعِبَ اَتْرَابًا ۟ۙ
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
Esegesi in lingua araba:
وَّكَاْسًا دِهَاقًا ۟ؕ
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
Esegesi in lingua araba:
لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا وَّلَا كِذّٰبًا ۟ۚۖ
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
Esegesi in lingua araba:
جَزَآءً مِّنْ رَّبِّكَ عَطَآءً حِسَابًا ۟ۙ
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
Esegesi in lingua araba:
رَّبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الرَّحْمٰنِ لَا یَمْلِكُوْنَ مِنْهُ خِطَابًا ۟ۚ
భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
Esegesi in lingua araba:
یَوْمَ یَقُوْمُ الرُّوْحُ وَالْمَلٰٓىِٕكَةُ صَفًّا ۙۗؕ— لَّا یَتَكَلَّمُوْنَ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَقَالَ صَوَابًا ۟
ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.[2]
[1] చూడండి 16:2 మరియు 97:4
[2] అల్లాహ్ (సు.తా.) దైవదూతలకు మరియు దైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) మాట్లాడే అనుమతినిస్తాడు. వారు కేవలం సత్యమే పలుకుతారు. చూడండి, 10:3.
Esegesi in lingua araba:
ذٰلِكَ الْیَوْمُ الْحَقُّ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ مَاٰبًا ۟
అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [1]
[1] చూడండి, 69:1.
Esegesi in lingua araba:
اِنَّاۤ اَنْذَرْنٰكُمْ عَذَابًا قَرِیْبًا ۖۚ۬— یَّوْمَ یَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ یَدٰهُ وَیَقُوْلُ الْكٰفِرُ یٰلَیْتَنِیْ كُنْتُ تُرٰبًا ۟۠
నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు.
[1] చూడండి 18:49 చూడండి 75:13
[2] చూడండి, 69:27.
Esegesi in lingua araba:
 
Traduzione dei significati Sura: An-Naba’
Indice delle Sure Numero di pagina
 
Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed - Indice Traduzioni

Tradotta da Abdur-Rahim bin Muhammad.

Chiudi