Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - សន្ទស្សន៍នៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាន់នូរ   អាយ៉ាត់:
فَاِنْ لَّمْ تَجِدُوْا فِیْهَاۤ اَحَدًا فَلَا تَدْخُلُوْهَا حَتّٰی یُؤْذَنَ لَكُمْ ۚ— وَاِنْ قِیْلَ لَكُمُ ارْجِعُوْا فَارْجِعُوْا هُوَ اَزْكٰی لَكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟
ఒక వేళ మీరు ఈ ఇండ్లలో ఎవరినీ పొందకపోతే అనుమతిచ్చే అధికారము కలవారు వాటిలో ప్రవేశించటానికి మీకు అనుమతిచ్చేంత వరకు మీరు వాటిలో ప్రవేశించకండి. ఒక వేళ వాటి యజమానులు మీకు (మీరు వాపసు అయిపోండి) అంటే మీరు వాపసు అయిపోండి వాటిలో ప్రవేశించకండి. ఎందుకంటే అది అల్లాహ్ వద్ద మీ కొరకు ఎంతో పరిశుద్ధమైనది. మరియు అల్లాహ్ మీరు చేసే వాటి గురించి తెలిసిన వాడు. ఆయనపై మీరు చేసిన కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ مَسْكُوْنَةٍ فِیْهَا مَتَاعٌ لَّكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ ۟
ఎవ్వరికీ చెందని ప్రజల ప్రయోజనాల కొరకు సిద్ధం చేయబడిన లైబ్రరీలు, బజారులలోని దుకాణాల్లాంటి ప్రజా ఇళ్ళలో అనుమతి లేకుండా మీరు ప్రవేశించటంలో మీపై ఎటువంటి పాపం లేదు. మరియు మీరు బహిర్గం చేసే మీ కర్మలు,మీ స్థితులు,మీరు గోప్యంగా ఉంచేవి అన్నీ అల్లాహ్ కి తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُلْ لِّلْمُؤْمِنِیْنَ یَغُضُّوْا مِنْ اَبْصَارِهِمْ وَیَحْفَظُوْا فُرُوْجَهُمْ ؕ— ذٰلِكَ اَزْكٰی لَهُمْ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا یَصْنَعُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులతో వారు తమ చూపులను తమ కొరకు సమ్మతం కాని స్త్రీలను,నగ్నమైన వాటిని చూడటం నుండి ఆపుకోమని మరియు మర్మావయవాలను నిషిద్ధ కార్యముల్లో పడటం నుండి, అవి బహిర్గతం అవటం నుండి కాపాడుకోమని చెప్పండి. అల్లాహ్ నిషేధించిన వాటి వైపు చూడటం నుండి ఈ ఆపుకోవటం వారి కొరకు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది. నిశ్ఛయంగా వారు చేస్తున్న వాటి గురించి బాగా తెలిసినవాడు. దానిలో నుండి ఆయనపై ఎదీ గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَقُلْ لِّلْمُؤْمِنٰتِ یَغْضُضْنَ مِنْ اَبْصَارِهِنَّ وَیَحْفَظْنَ فُرُوْجَهُنَّ وَلَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا مَا ظَهَرَ مِنْهَا وَلْیَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلٰی جُیُوْبِهِنَّ ۪— وَلَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا لِبُعُوْلَتِهِنَّ اَوْ اٰبَآىِٕهِنَّ اَوْ اٰبَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اَبْنَآىِٕهِنَّ اَوْ اَبْنَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اَخَوٰتِهِنَّ اَوْ نِسَآىِٕهِنَّ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُنَّ اَوِ التّٰبِعِیْنَ غَیْرِ اُولِی الْاِرْبَةِ مِنَ الرِّجَالِ اَوِ الطِّفْلِ الَّذِیْنَ لَمْ یَظْهَرُوْا عَلٰی عَوْرٰتِ النِّسَآءِ ۪— وَلَا یَضْرِبْنَ بِاَرْجُلِهِنَّ لِیُعْلَمَ مَا یُخْفِیْنَ مِنْ زِیْنَتِهِنَّ ؕ— وَتُوْبُوْۤا اِلَی اللّٰهِ جَمِیْعًا اَیُّهَ الْمُؤْمِنُوْنَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
మరియు మీరు విశ్వాసపరులైన స్త్రీలతో తమకు చూడటం సమ్మతం కాని మర్మావయవాల వైపు చూడటం నుండి తమ చూపులను ఆపి ఉంచమని,తమ మర్మాంగాలను అశ్లీలత నుండి దూరంగా ఉండి,వస్త్రంతో కప్పి పరిరక్షించమని,తమ అలంకరణను పరాయి వారి ముందు ప్రదర్శించవద్దని కాని అందులోంచి బహిర్గతమైపోయేవి వేటినైతే దాయటం అసంభవమో అవి తప్ప ఉదాహరణకు : వస్త్రములు, తమ దుపట్టాలను తమ వస్త్రముల పై భాగములో తెరవబడిన భాగములపై నుండు తమ శిరోజాలను,తమ ముఖములను,తమ మెడలను కప్పుకోవటానికి వేసుకోమని, తమ దాచిన అలంకరణను తమ భర్తల ముందు లేక తమ తండ్రుల ముందు లేక తమ మామల ముందు లేక తమ కొడుకుల ముందు లేక తమ భర్తల కొడుకుల ముందు లేక తమ సోదరుల ముందు లేక తమ సోదరుల కుమారుల ముందు లేక తమ అక్కాచెల్లెళ్ల కుమారుల ముందు లేక తమతో కలిసి ఉండే స్త్రీల ముందు వారు ముస్లిములైన లేదా ముస్లిమేతరులైనా లేక స్త్రీ అయిన లేదా పురుషుడైన బానిస ముందు లేక స్త్రిలలో ఇతరత్రా ఉద్దేశాలు లేని లోబడి ఉన్న పురుషుల ముందు లేక తమ బాల్యము వలన స్త్రీల మర్మావయవాల అవగాహన లేని పిల్లల ముందు మాత్రమే బహిర్గతం చేయాలని చెప్పండి. మరియు కాలి పట్టీలు, వాటిని పోలినటువంటి తాము దాచి పెట్టుకున్న అలంకరణను తెలియాలనే ఉద్ధేశంతో తమ కాళ్ళను (నేలమీద) కొట్టకూడదు. ఓ విశ్వాసపరులారా మీరందరు మీ కొరకు సంభవించిన చూపులు మొదలగు వాటి గురించి మీరు కోరుకున్న వాటి ద్వారా మీరు సాఫల్యం చెందుతారని,భయపడే వాటి నుండి విముక్తి పొందుతారని ఆశిస్తూ అల్లాహ్ యందు తౌబా చేయండి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• جواز دخول المباني العامة دون استئذان.
ప్రజా భవనాల్లో అనుమతి లేకుండా ప్రవేశము సమ్మతము.

• وجوب غض البصر على الرجال والنساء عما لا يحلّ لهم.
స్త్రీ,పురుషులపై తమకు సమ్మతం కాని వాటి నుండి చూపులను క్రిందకు పెట్టటం తప్పనిసరి.

• وجوب الحجاب على المرأة.
పరదా (హిజాబ్) స్త్రీపై విధి.

• منع استخدام وسائل الإثارة.
ప్రేరేపించే కారకాలను ఉపయోగించటం నిరోధం.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាន់នូរ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ