Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - សន្ទស្សន៍នៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សទ   អាយ៉ាត់:
وَوَهَبْنَا لَهٗۤ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
అప్పుడు మేము అతని కొరకు దుఆను స్వీకరించి ఆయనకు కలిగిన కష్టమును తొలగించాము. మరియు మేము అతనికి అతని కుటుంబంవారిని ప్రసాదించాము. మరియు మేము అతనికి వారి వంటివారిని కుమారుల్లోంచి మనవుళ్ళోంచి మా వద్ద నుండి కారుణ్యంగా ఆయనకు మరియు ఆయన సహనంనకు ప్రతిఫలంగా ప్రసాదించాము. సరైన బుద్దుల కలవారు సహనము యొక్క పరిణామం ఆపద తొలిగిపోవటం మరియు పుణ్యం అని హితబోధన గ్రహించాలి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَخُذْ بِیَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِّهٖ وَلَا تَحْنَثْ ؕ— اِنَّا وَجَدْنٰهُ صَابِرًا ؕ— نِّعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యపై ఆగ్రహం చెంది ఆమెకు వంద కొరడా దెబ్బలు కొడతారని శపధం చేశారు. మేము ఆయనకు ఇలా ఆదేశించాము : నీవు ఖర్జూర పండ్ల గుత్తి కట్టను నీ చేతిలో తీసుకుని నీ ప్రమాణము యొక్క వియోచనం కొరకు దానితో ఆమెను కొట్టు. నీవు చేసిన ప్రమాణమును భంగపరచకు. అప్పుడు ఆయన ఖర్జూరపు పండ్ల గుత్తి కట్టతో ఆమెను కొట్టారు. నిశ్చయంగా మేము ఆయన్ని పరీక్షించిన దానిలో సహనం చూపేవాడిగా పొందాము. ఆయన ఎంతో మంచి దాసుడు. నిశ్ఛయంగా ఆయన అల్లాహ్ వైపునకు ఎక్కువగా మరలే వాడును,పశ్చాత్తాపముతో మరలేవాడును.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاذْكُرْ عِبٰدَنَاۤ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ اُولِی الْاَیْدِیْ وَالْاَبْصَارِ ۟
ఓ ప్రవక్తా మీరు మేము ఎంచుకున్న మా దాసులైన మరియు మేము పంపించిన ప్రవక్తలైన ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ లను గుర్తు చేసుకోండి. వారు అల్లాహ్ పై విధేయత చూపే విషయంలో మరియు ఆయన మన్నతలను కోరకునే విషయంలో బలవంతులుగా ఉండేవారు. మరియు వారు సత్యం విషయంలో అంతర్దృష్టి కలవారు,నీతిమంతులు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَی الدَّارِ ۟ۚ
నిశ్ఛయంగా మేము వారిపై ఒక ప్రత్యేక గుణమును అనుగ్రహించి దానితో వారిని ప్రత్యేకించాము. మరియు అది వారి హృదయములను పరలోక నివాస చింతనతో నిర్మించటం మరియు దాని కొరకు సత్కర్మతో సిద్ధం కావటం మరియు ప్రజలను దాని కొరకు ఆచరించటం వైపునకు పిలవటం.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَیْنَ الْاَخْیَارِ ۟ؕ
మరియు నిశ్ఛయంగా వారు మా వద్ద మా విధేయత కొరకు,మా ఆరాధన కొరకు ఎన్నుకోబడినవారు. మరియు మేము వారిని మా దైవదౌత్యమును మోయటానికి మరియు ప్రజలకు దాన్ని చేరవేయటానికి ఎన్నుకున్నాము.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَاذْكُرْ اِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَذَا الْكِفْلِ ؕ— وَكُلٌّ مِّنَ الْاَخْیَارِ ۟ؕ
ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలామ్ కుమారుడగు ఇస్మాయీల్ అలైహిస్సలాంను జ్ఞాపకం చేసుకోండి మరియు అల్ యసఅ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు జుల్ కిఫ్ల్ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు వారిపై మంచిగా కీర్తించండి. వారు దానికి యోగ్యులు. మరియు వారందరు అల్లాహ్ వద్ద ఎంచుకోబడిన మరియు ఎన్నుకోబడిన వారిలో నుంచి వారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هٰذَا ذِكْرٌ ؕ— وَاِنَّ لِلْمُتَّقِیْنَ لَحُسْنَ مَاٰبٍ ۟ۙ
వీరందరి కొరకు ఖర్ఆన్ లో మంచి కీర్తి ద్వారా ఈ గుర్తింపు కలదు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే దైవభీతి కలవారి కొరకు పరలోక నివాసములో మంచి మరలే చోటు కలదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
جَنّٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْاَبْوَابُ ۟ۚ
ఈ మంచి మరలింపు అది వారు ప్రళయదినాన ప్రవేశించే శాశ్వత స్వర్గ వనాలు. మరియు వారిపై మర్యాదగా వారి కొరకు వాటి తలుపులు తెరవబడి ఉంటాయి.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
مُتَّكِـِٕیْنَ فِیْهَا یَدْعُوْنَ فِیْهَا بِفَاكِهَةٍ كَثِیْرَةٍ وَّشَرَابٍ ۟
వారి కొరకు అలంకరించబడి ఉన్న ఆసనాలపై ఆనుకుని కూర్చుని తమ సేవకులతో తాము కోరుకునే చాలా రకరకాల ఫలాలను మరియు తాము కోరే మధుపానీయముల్లోంచి,ఇతర వాటిలోంచి పానీయములను తమ ముందు ప్రవేశపెట్టమని కోరుతుంటారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ اَتْرَابٌ ۟
మరియు వారి వద్ద తమ భర్తల ముందు తమ చూపులను క్రిందకు వాల్చిన స్త్రీలు ఉంటారు. వారు వారిని దాటి ఇతరుల వద్దకు వెళ్ళరు. మరియు వారు సమవయస్కులై ఉంటారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هٰذَا مَا تُوْعَدُوْنَ لِیَوْمِ الْحِسَابِ ۟
ఓ దైవభీతి కలవారా ఇది మీరు ఇహలోకములో చేసుకున్న మీ సత్కర్మలపై ప్రళయదినమున మంచి ప్రతిఫలము ప్రసాదించబడతుందని మీకు చేయబడిన వాగ్ధానము.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ هٰذَا لَرِزْقُنَا مَا لَهٗ مِنْ نَّفَادٍ ۟ۚۖ
నిశ్చయంగా మేము ప్రస్తావించిన ఈ ప్రతిఫలము మీమిచ్చే జీవనోపాధి దాన్ని మేము ప్రళయదినమున దైవభీతికలవారికి ప్రసాదిస్తాము. మరియు అది నిరంతరం ఉండే జీవనోపాధి. అది తరగదు మరియు అంతమవదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هٰذَا ؕ— وَاِنَّ لِلطّٰغِیْنَ لَشَرَّ مَاٰبٍ ۟ۙ
మేము ప్రస్తావించిన ఇది దైవభీతి కలవారి యొక్క ప్రతిఫలము. మరియు నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారి కొరకు దైవభీతి కలవారి ప్రతిఫలమునకు భిన్నంగా ప్రతిఫలముంటుంది. వారి కొరకు ప్రళయదినమున వారు మరలివెళ్ళే అతి చెడ్డ మరలే చోటు కలదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمِهَادُ ۟
ఈ ప్రతిఫలం అది నరకము వారిని చుట్టుముట్టి ఉంటుంది. వారు దాని వేడిని మరియు దాని జ్వాలలను అనుభవిస్తారు. వారి కొరకు దాని నుండి ఒక పరుపు ఉంటుంది. వారి పరుపు ఎంతో చెడ్డదైన పరుపు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هٰذَا ۙ— فَلْیَذُوْقُوْهُ حَمِیْمٌ وَّغَسَّاقٌ ۟ۙ
ఈ శిక్ష అత్యంత వేడిగల నీరు, అందులో శిక్షింపబడే నరకవాసుల శరీరముల నుండి కారే చీము రూపంలో ఉంటుంది. అయితే వారు దాన్ని త్రాగాలి. అది దాహమును తీర్చని వారి పానీయం.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَّاٰخَرُ مِنْ شَكْلِهٖۤ اَزْوَاجٌ ۟ؕ
మరియు వారి కొరకు ఈ శిక్ష కన్న వేరే రూపంలో ఇంకో శిక్ష కలదు. అయితే వారి కొరకు ఎన్నో రకాల శిక్షలు కలవు. వారు వాటి ద్వారా పరలోకంలో శిక్షింపబడుతారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۚ— لَا مَرْحَبًا بِهِمْ ؕ— اِنَّهُمْ صَالُوا النَّارِ ۟
మరియు నరకవాసులు ప్రవేశించినప్పుడు వారి మధ్య ప్రత్యర్దుల మధ్య వాటిల్లే ధూషణలు వాటిల్లుతాయి. మరియు వారు ఒకరి నుండి ఒకరు విసుగును చూపుతారు. వారిలో నుండి కొందరు ఇలా పలుకుతారు : ఇది నరకవాసుల్లోంచి ఒక వర్గము మీతో పాటు నరకంలో ప్రవేశిస్తుంది. అప్పుడు వారు వారికి ఇలా సమాధానమిస్తారు : వారికి ఎలాంటి స్వాగతం లేదు నిశ్ఛయంగా వారు మేము బాధపడుతున్నట్లే నరకాగ్ని శిక్ష వలన బాధపడుతారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالُوْا بَلْ اَنْتُمْ ۫— لَا مَرْحَبًا بِكُمْ ؕ— اَنْتُمْ قَدَّمْتُمُوْهُ لَنَا ۚ— فَبِئْسَ الْقَرَارُ ۟
అనుసరించేవారి వర్గము అనుసరించబడిన తమ నాయకులతో ఇలా పలుకుతారు : కాదు మీకే ఓ అనుసరించబడిన నాయకులారా ఎటువంటి స్వాగతం లేదు. మీరే మాకు అపమార్గమునకు లోను చేయటం వలన,పెడదారికి గురి చేయటం వలన ఈ బాధాకరమైన శిక్షకు కారణమయ్యారు. ఈ నివాస స్థలం ఎంత చెడ్డ నివాస స్థలము. అందరి నివాస స్థలము అది నరకాగ్ని.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالُوْا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِی النَّارِ ۟
అనుసరించేవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మా వద్దకు వచ్చిన తరువాత సన్మార్గము నుండి ఎవరైతే మమ్మల్ని తప్పించారో వారికి నరకాగ్నిలో రెట్టింపు శిక్షను కలిగించు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• من صبر على الضر فالله تعالى يثيبه ثوابًا عاجلًا وآجلًا، ويستجيب دعاءه إذا دعاه.
బాధపై ఎవరైతే సహనం చూపుతారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ త్వరగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు మరియు ఆలస్యంగ ప్రసాదిస్తాడు. మరియు అతను దుఆ చేసినప్పుడు అతని దుఆను స్వీకరిస్తాడు.

• في الآيات دليل على أن للزوج أن يضرب امرأته تأديبًا ضربًا غير مبرح؛ فأيوب عليه السلام حلف على ضرب امرأته ففعل.
ఆయతుల్లో భర్త తన భార్యను సంస్కరణ ఉద్దేశంతో బాధ కలిగించకుండా కొట్టటం పై ఆధారం ఉన్నది. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యను కొడతానని ప్రమాణం చేశారు. పూర్తి చేశారు.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: សទ
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ