Check out the new design

ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - សន្ទស្សន៍នៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សារីយ៉ាត   អាយ៉ាត់:
وَالسَّمَآءِ ذَاتِ الْحُبُكِ ۟ۙ
మరియు అల్లాహ్ మార్గాలు కల మంచి సృష్టి అయిన ఆకాశముపై ప్రమాణం చేస్తున్నాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّكُمْ لَفِیْ قَوْلٍ مُّخْتَلِفٍ ۟ۙ
ఓ మక్కా వాసులారా నిశ్చయంగా మీరు ఒక పరస్పర వైరుధ్యమైన,విరుద్దమైన మాటలో ఉన్నారు. ఒక సారి మీరు ఖుర్ఆన్ ను మంత్రజాలము అంటే ఒక సారి కవిత్వం అంటున్నారు. మరియు మీరు ముహమ్మద్ ను ఒక సారి మంత్రజాలకుడు అంటే ఒక సారి కవి అంటున్నారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یُّؤْفَكُ عَنْهُ مَنْ اُفِكَ ۟ؕ
ఖుర్ఆన్ పై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసము నుండి అతడే మరలింపబడుతాడు ఎవడైతే అల్లాహ్ జ్ఞానములో అతడు విశ్వసించడని మరియు సన్మార్గము పొందే భాగ్యమును కలగడని ఉన్నదో.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قُتِلَ الْخَرّٰصُوْنَ ۟ۙ
ఖుర్ఆన్ విషయంలో మరియు తమ ప్రవక్త విషయంలో ఇలా పలికిన తిరస్కారులే శపించబడ్డారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
الَّذِیْنَ هُمْ فِیْ غَمْرَةٍ سَاهُوْنَ ۟ۙ
వారే అజ్ఞానంలో పడి ఉండి పరలోక నివాసము నుండి పరధ్యానంలో ఉన్నారు. వారు దాని గురించి పట్టించుకోరు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یَسْـَٔلُوْنَ اَیَّانَ یَوْمُ الدِّیْنِ ۟ؕ
వారు ప్రతిఫల దినము ఎప్పుడూ ? అని అడుగుతున్నారు. వాస్తవానికి వారు దాని కొరకు ఆచరించటంలేదు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
یَوْمَ هُمْ عَلَی النَّارِ یُفْتَنُوْنَ ۟
అల్లాహ్ వారి ప్రశ్న గురుంచి వారికి ఇలా సమాధానమిస్తున్నాడు : ఆ రోజు వారు నరకాగ్నిపై శిక్షింపబడుతారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ذُوْقُوْا فِتْنَتَكُمْ ؕ— هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ ۟
వారితో ఇలా పలకబడుతుంది : మీరు మీ శిక్ష రుచి చూడండి. మీరు హెచ్చరించబడినప్పుడు హేళనగా దేని గురించైతే తొందరపెట్టే వారో అదే ఇది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ
నిశ్ఛయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడేవారు ప్రళయదినమున స్వర్గవనాల,ప్రవహించే సెలయేరుల మధ్య ఉంటారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اٰخِذِیْنَ مَاۤ اٰتٰىهُمْ رَبُّهُمْ ؕ— اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُحْسِنِیْنَ ۟ؕ
వారికి వారి ప్రభువు ఇచ్చే మర్యాదపూర్వక ప్రతిఫలమును పుచ్చుకుంటూ ఉంటారు. నిశ్ఛయంగా వారు ఈ మర్యాదపూర్వక ప్రతిఫలము కన్న ముందు ఇహలోకంలో సదాచర సంపన్నులుగా ఉండేవారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
كَانُوْا قَلِیْلًا مِّنَ الَّیْلِ مَا یَهْجَعُوْنَ ۟
వారు రాత్రి పూట నమాజు చదివే వారు. తక్కువ సమయం నిదురపోయేవారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَبِالْاَسْحَارِ هُمْ یَسْتَغْفِرُوْنَ ۟
రాత్రి చివరి ఘడియల్లో తమ పాపముల నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకునేవారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَفِیْۤ اَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّآىِٕلِ وَالْمَحْرُوْمِ ۟
మరియు వారి సంపదల్లోంచి వారు స్వచ్చందంగా ఇచ్చే దానిలో ప్రజల్లోంచి యాచించేవారి కొరకు మరియు ఏదో ఒక కారణం చేత ఆహారోపాధి ఆగిపోయన వారిలో నుండి వారితో యాచించని వారి కొరకు హక్కు ఉన్నది.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَفِی الْاَرْضِ اٰیٰتٌ لِّلْمُوْقِنِیْنَ ۟ۙ
మరియు భూమిలో మరియు అల్లాహ్ అందులో ఉంచిన పర్వతాల్లో,సముద్రముల్లో,చెలమల్లో,వృక్షముల్లో,మొక్కల్లో మరియు జంతువుల్లో అల్లాహ్ యే సృష్టికర్త,రూపకల్పన చేసేవాడు అని నమ్మేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై సూచనలు కలవు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَفِیْۤ اَنْفُسِكُمْ ؕ— اَفَلَا تُبْصِرُوْنَ ۟
మరియు మీ స్వయంలో ఓ ప్రజలారా అల్లాహ్ సామర్ధ్యంపై సూచనలు కలవు. ఏమీ మీరు గుణపాఠం నేర్చుకోవటం కొరకు చూడరా ?!
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
وَفِی السَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوْعَدُوْنَ ۟
మరియు ఆకాశములో మీ ప్రాపంచిక మరియు ధార్మిక ఆహారోపాధి కలదు. మరియు అందులో మీతో వాగ్దానం చేయబడిన మంచి లేదా చెడులు కలవు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَوَرَبِّ السَّمَآءِ وَالْاَرْضِ اِنَّهٗ لَحَقٌّ مِّثْلَ مَاۤ اَنَّكُمْ تَنْطِقُوْنَ ۟۠
భూమ్యాకాశముల ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మరణాంతరం లేపబడటం వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానంటే మీరు మాట్లాడుకునేటప్పుడు మీ మాట్లాడటంలో సందేహం లేదో ఆ విధంగా.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
هَلْ اَتٰىكَ حَدِیْثُ ضَیْفِ اِبْرٰهِیْمَ الْمُكْرَمِیْنَ ۟ۘ
ఓ ప్రవక్తా మీకు ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దైవదూతల్లోంచి ఆయన మర్యాదలు చేసిన అతిధుల గురించి మీకు (సమాచారం) చేరినదా ?.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ— قَالَ سَلٰمٌ ۚ— قَوْمٌ مُّنْكَرُوْنَ ۟
వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో సలాం (నీపై శాంతి కురియుగాక) అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రతిసలాంచేస్తూ సలాం (మీపై శాంతి కురియుగాక) అన్నారు. మరియు ఆయన (ఇబ్రాహీం అలైహిస్సలాం) తన మనసులో వీరందరు మాకు పరిచయం లేని జనులు అనుకున్నారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَرَاغَ اِلٰۤی اَهْلِهٖ فَجَآءَ بِعِجْلٍ سَمِیْنٍ ۟ۙ
అప్పుడు ఆయన చాటుగా తన ఇంటివారి వైపునకు మరలి వారి వద్ద నుండి ఒక సంపూర్ణ బలిసిన ఒక ఆవు దూడను వారు మనుషులని భావించి తీసుకుని వచ్చారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَقَرَّبَهٗۤ اِلَیْهِمْ قَالَ اَلَا تَاْكُلُوْنَ ۟ؗ
అప్పుడు ఆయన ఆవు దూడను వారికి దగ్గరగా చేశారు. మరియు వారితో మృదువుగా పలుకుతూ మీ ముందు ఉంచిన ఆహారమును మీరు తినరా ? అని అన్నారు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَوْجَسَ مِنْهُمْ خِیْفَةً ؕ— قَالُوْا لَا تَخَفْ ؕ— وَبَشَّرُوْهُ بِغُلٰمٍ عَلِیْمٍ ۟
వారు తినకపోవటం చూసినప్పుడు ఆయన తన మనసులో వారి నుండి భయపడసాగారు అప్పుడు వారు ఆయన నుండి గుర్తించారు. అప్పుడు వారు ఆయనను సంత్రుప్తిపరుస్తూ ఇలా పలికారు : మీరు భయపడకండి. మేము అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ దూతలము. మరియు వారు ఆయనకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు చాలా జ్ఞానం కల ఒక మగ సంతానము కలుగుతుందని తెలిపారు. మరియు శుభవార్త ఇవ్వబడినది ఇస్హాఖ్ అలైహిస్సలాం గురించే.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
فَاَقْبَلَتِ امْرَاَتُهٗ فِیْ صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوْزٌ عَقِیْمٌ ۟
ఎప్పుడైతే ఆయన భార్య శుభవార్తను విన్నదో సంతోషముతో అరుస్తూ ముందుకు వచ్చినది. మరియు తన నుదిటిపై కొడుతూ ఆశ్ఛర్యముతో ఇలా పలికింది : ఏమీ ఒక వృద్ధురాలు జన్మనిస్తుందా. మరియు ఆమె వాస్తవానికి గొడ్రాలు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
قَالُوْا كَذٰلِكِ ۙ— قَالَ رَبُّكِ ؕ— اِنَّهٗ هُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ ۟
ఆమెతో దూతలు ఇలా పలికారు : నీ ప్రభువు చెప్పినదే నీకు మేము తెలిపాము. ఆయన చెప్పిన దాన్ని మార్చే వాడు ఎవడూ లేడు. నిశ్ఛయంగా ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రాతలో విజ్ఞత కలవాడు. తన సృష్టి రాసుల గురించి మరియు వారికి ప్రయోజనకరమైన వాటి గురించి తెలిసినవాడు.
តាហ្វសៀរជាភាសា​អារ៉ាប់ជាច្រេីន:
ក្នុង​ចំណោម​អត្ថប្រយោជន៍​នៃអាយ៉ាត់ទាំងនេះក្នុងទំព័រនេះ:
• إحسان العمل وإخلاصه لله سبب لدخول الجنة.
ఆచరణ మంచిగా చేయటం మరియు దాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకించటం స్వర్గములో ప్రవేశించటమునకు ఒక కారణం.

• فضل قيام الليل وأنه من أفضل القربات.
రాత్రి వేళ ఖియామ్ చేయటం (తహజ్జుద్ నమాజ్) యొక్క ప్రాముఖ్యత మరియు అది దైవ సాన్నిద్యమును కలిగించే గొప్ప కార్యాల్లోంచిది.

• من آداب الضيافة: رد التحية بأحسن منها، وتحضير المائدة خفية، والاستعداد للضيوف قبل نزولهم، وعدم استثناء شيء من المائدة، والإشراف على تحضيرها، والإسراع بها، وتقريبها للضيوف، وخطابهم برفق.
అతిధి మర్యాదల పద్దతుల్లోంచి : సలాాంనకు దాని కన్న ఉత్తమ రీతిలో ప్రతి సలాం చేయటం,చాటుగా భోజన ఏర్పాటు చేయటం, అతిధులు రాక ముందే సిద్ధంగా ఉండటం, భోజనం నుండి ఏదీ మినహాయించకుండా ఉండటం,దాన్ని మర్యాదపూర్వకంగా ప్రవేశపెట్టటం,దాన్ని తొందరగా చేయటం,దాన్ని అతిధులకు దగ్గర చేయటం, వారితో మృధువుగా మాట్లాడటం.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាស់ហ្សារីយ៉ាត
សន្ទស្សន៍នៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - សន្ទស្សន៍នៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ