Check out the new design

وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان سوره‌تی: الحج   ئایه‌تی:
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ۙ— وَّاَنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یُّرِیْدُ ۟
మేము మరణాంతరం లేపబడటం గురించి మీకు స్పష్టమైన వాదనలను విశదీకరించినట్లే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై స్పష్టమైన ఆయతుల ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా తాను కోరుకున్న వారికి సన్మార్గమును అనుగ్రహిస్తాడు.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالصّٰبِـِٕیْنَ وَالنَّصٰرٰی وَالْمَجُوْسَ وَالَّذِیْنَ اَشْرَكُوْۤا ۖۗ— اِنَّ اللّٰهَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟
నిశ్ఛయంగా ఈ జాతిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు,యూదులు,సాబియులు ( కొంతమంది ప్రవక్తలను అనుసరించే వారు ),క్రైస్తవులు,అగ్నిని పూజించేవారు,విగ్రహారాధకులు ఉన్నారు. నిశ్చయంగా అల్లాహ్ వారి మధ్య ప్రళయదినాన తిర్పునిచ్చి విశ్వాసపరులను స్వర్గములో,ఇతరులను నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల యొక్క మాటల్లో నుండి,వారి కార్యాల్లో నుండి ప్రతీ దానిని పర్యవేక్షిస్తున్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటిపరంగా ఆయన వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
تەفسیرە عەرەبیەکان:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَسْجُدُ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُوْمُ وَالْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَآبُّ وَكَثِیْرٌ مِّنَ النَّاسِ ؕ— وَكَثِیْرٌ حَقَّ عَلَیْهِ الْعَذَابُ ؕ— وَمَنْ یُّهِنِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّكْرِمٍ ؕ— اِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یَشَآءُ ۟
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా అల్లాహ్ ఆకాశములో ఉన్న దైవ దూతలు,భూమిలో ఉన్న మానవుల్లోంచి,జిన్నుల్లోంచి విశ్వాసపరులు ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగపడుతున్నారని,ఆయన కొరకు సూర్యుడు సాష్టాంగపడుతున్నాడని,ఆయనకి చంద్రుడు సాష్టాంగపడుతున్నాడని,ఆయనకి ఆకాశములో ఉన్న నక్షత్రాలు,భూమిలో ఉన్న పర్వతాలు,చెట్లు,జంతువులు సాష్టాంగ నమస్కారము చేస్తున్నారని మీకు తెలియదా. ప్రజల్లోంచి చాలామంది ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగం చేస్తున్నారు. మరియు చాలామంది ఆయనకి విధేయతతో కూడిన సాష్టాంగము చేయటం లేదు. అయితే వారి తిరస్కారము వలన అల్లాహ్ శిక్ష వారిపై వాటిల్లుతుంది. మరియు అల్లాహ్ ఎవరినైతే అతని తిరస్కారము వలన అవమానము ద్వారా,పరాభవము ద్వారా తీర్పునిస్తాడో అతనిని గౌరవించేవాడు ఎవడూ ఉండడు. నిశ్ఛయంగా అల్లాహ్ తాను తలచుకున్నది చేసి తీరుతాడు. పరిశుద్ధుడైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ లేడు.
تەفسیرە عەرەبیەکان:
هٰذٰنِ خَصْمٰنِ اخْتَصَمُوْا فِیْ رَبِّهِمْ ؗ— فَالَّذِیْنَ كَفَرُوْا قُطِّعَتْ لَهُمْ ثِیَابٌ مِّنْ نَّارٍ ؕ— یُصَبُّ مِنْ فَوْقِ رُءُوْسِهِمُ الْحَمِیْمُ ۟ۚ
ఈ రెండు వర్గములు తమ ప్రభువు విషయంలో వారిలో నుంచి ఎవరు హక్కుదారులని వాదులాడినవారు : విశ్వాసపు వర్గము,అవిశ్వాసపు వర్గము.అవిశ్వాసపు వర్గము వారికి నరకాగ్ని బట్టలను తొడిగేవాడికి బట్టలు ఏవిధంగా చుట్టుముట్టుకుని ఉంటాయో ఆ విధంగా చుట్టుముట్టుకుంటుంది. వారి తలలపై నుండి అత్యంత వేడిదైన నీరు గుమ్మరించబడుతుంది.
تەفسیرە عەرەبیەکان:
یُصْهَرُ بِهٖ مَا فِیْ بُطُوْنِهِمْ وَالْجُلُوْدُ ۟ؕ
దాని వేడి తీవ్రత వలన వారి కడుపుల్లో ఉన్న పేగులు కరిగిపోతాయి. మరియు అది వారి చర్మములకు చేరి వాటినీ కరిగింపజేస్తుంది.
تەفسیرە عەرەبیەکان:
وَلَهُمْ مَّقَامِعُ مِنْ حَدِیْدٍ ۟
మరియు నరకాగ్నిలో వారి కొరకు ఇనుప గదలు (సమిటెలు) ఉంటాయి. దైవ దూతలు వాటి ద్వారా వారి తలలపై మోదుతారు.
تەفسیرە عەرەبیەکان:
كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ یَّخْرُجُوْا مِنْهَا مِنْ غَمٍّ اُعِیْدُوْا فِیْهَا ۗ— وَذُوْقُوْا عَذَابَ الْحَرِیْقِ ۟۠
అందులో వారు పొందిన బాధ తీవ్రత వలన నరకాగ్ని నుండి బయటపడాలని ప్రయత్నించినప్పుడల్లా వారు అందులోకే మరలించబడుతారు. వారితో ఇలా అనబడుతుంది : మీరు దహించివేసే అగ్ని శిక్ష రుచి చూడండి.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ؕ— وَلِبَاسُهُمْ فِیْهَا حَرِیْرٌ ۟
మరియు విశ్వాసపు వర్గము వారే ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేస్తారో అల్లాహ్ వారిని స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి,వాటి చెట్ల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తుంటాయి. అల్లాహ్ వారికి బంగారపు కంకణములను తొడిగించి అలంకరిస్తాడు. మరియు వారికి ముత్యాలతో కూడిన ఆభరణములను తొడిగించి అలంకరిస్తాడు. మరియు అందులో వారి వస్త్రములు పట్టువి ఉంటాయి.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• الهداية بيد الله يمنحها من يشاء من عباده.
సన్మార్గం చూపటం అల్లాహ్ చేతిలో ఉన్నది. ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి దాన్ని అనుగ్రహిస్తాడు.

• رقابة الله على كل شيء من أعمال عباده وأحوالهم.
అల్లాహ్ యొక్క పర్యవేక్షణ ఆయన దాసుల కార్యాల్లోంచి,వారి స్థితుల్లోంచి ప్రతీ దానిపై ఉంటుంది.

• خضوع جميع المخلوقات لله قدرًا، وخضوع المؤمنين له طاعة.
సృష్టితాలన్నింటి నిమమ్రత అల్లాహ్ విధివ్రాతతో కూడుకుని ఉన్నది.మరియు విశ్వాసపరుల నిమమ్రత విధేయతతో కూడుకున్నది.

• العذاب نازل بأهل الكفر والعصيان، والرحمة ثابتة لأهل الإيمان والطاعة.
అవిశ్వాసపరులపై,అవిధేయపరులపై శిక్ష కురుస్తుంది. విశ్వాసపరులపై,విధేయపరులపై కారుణ్యం స్థిరంగా ఉంటుంది.

 
وه‌رگێڕانی ماناكان سوره‌تی: الحج
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز - پێڕستی وه‌رگێڕاوه‌كان

بڵاوكراوەتەوە لەلایەن ناوەندی تەفسیر بۆ خوێندنە قورئانیەکان.

داخستن