Check out the new design

وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان سوره‌تی: آل عمران   ئایه‌تی:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُدْعَوْنَ اِلٰی كِتٰبِ اللّٰهِ لِیَحْكُمَ بَیْنَهُمْ ثُمَّ یَتَوَلّٰی فَرِیْقٌ مِّنْهُمْ وَهُمْ مُّعْرِضُوْنَ ۟
ఓ ప్రవక్తా! తౌరాతు జ్ఞానం కలిగి ఉండి నీ ప్రవక్తత్త్వానికి సాక్ష్యం ఇస్తున్న యూదులను నీవు చూడలేదా ? ఏ విషయంలోనైతే వారు విభేదిస్తున్నారో, దాని గురించి తేల్చేందుకు అల్లాహ్ గ్రంథమైన తౌరాతు గ్రంథాన్ని పరిశీలించమని వారికి పిలుపు ఇచ్చినప్పుడు, తౌరాతులోని ధర్మాదేశాల గురించి తాము ఎరుగనట్లు వారిలోని ఒక పండితుల మరియు నాయకుల బృందం వెనుదిరిగి పోయింది. ఎందుకంటే ఆ తౌరాతు గ్రంథంలోని ధర్మాదేశాలు వారి వాంఛలతో ఏకీభవించడం లేదు. వారు తౌరాతు గ్రంథాన్ని అనుసరిస్తూ, దాని తీర్పును యథాతథంగా, నిస్సంకోచంగా స్వీకరించడమే వారి కొరకు సరైన విషయమై ఉండేది.
تەفسیرە عەرەبیەکان:
ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدٰتٍ ۪— وَّغَرَّهُمْ فِیْ دِیْنِهِمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟
వారు సత్యం నుండి దూరంగా పోయారు మరియు సత్యాన్ని ఉపేక్షించారు. ఎందుకంటే ప్రళయదినాన తమను నరకాగ్ని కొన్ని రోజులు మాత్రమే తాకుతుందని, ఆ తరువాత స్వర్గంలో ప్రవేశిస్తామని వారు వాదించేవారు. వారు కల్పించుకున్న అసత్యాలు,అబద్దాలైన ఆలోచన వారిని మోసానికి గురి చేసింది. ఈ విధంగా వారు అల్లాహ్ కు ఆయన ధర్మమునకు వ్యతిరేకంగా ధైర్యం చేశారు.
تەفسیرە عەرەبیەکان:
فَكَیْفَ اِذَا جَمَعْنٰهُمْ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ۫— وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
వారి పరిస్థితి ఏమవుతుంది మరియు వారు ఎంతగా బాధపడతారు, పశ్చాత్తాప పడతారు ? పునరుత్థాన దినాన లెక్క తీసుకోవడానికి మేము వారిని జమ చేసినప్పుడు, అది చాలా భయంకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మంచి పనులలో తగ్గింపు లేదా చెడు పనులలో హెచ్చింపు వంటి దౌర్జన్యాలు, అన్యాయాలకు తావు లేకుండా ప్రతీ వ్యక్తికీ, అతడి ఆచరణలకు బదులుగా తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది.
تەفسیرە عەرەبیەکان:
قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِی الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُ ؗ— وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُ ؕ— بِیَدِكَ الْخَیْرُ ؕ— اِنَّكَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రవక్తా! నీ ప్రభువును స్తుతిస్తూ మరియు ఆయన ఘనతను ప్రకటించడంలో ఇలా ప్రశంసించు: ఓ అల్లాహ్! ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో అధికారమంతా నీకే చెందుతుంది. నీవు నీ సృష్టిలో ఎవరికి కావాలనుకుంటే వారికి అధికారం ఇస్తావు మరియు నీ సృష్టిలో నీవు కోరుకునే వారి నుండి దాన్ని తొలగిస్తావు. నీవు కోరుకున్న వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరుకున్న వారిని అవమానిస్తావు. ఇవన్నీ నీ జ్ఞానం మరియు న్యాయం ప్రకారమే జరుగుతాయి. మంచి అంతా నీ చేతిలో మాత్రమే ఉంది. ప్రతిదానిపై నీకు అధికారం ఉంది.
تەفسیرە عەرەبیەکان:
تُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ؗ— وَتُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَتُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ ؗ— وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
(ఓ అల్లాహ్) నీ శక్తి యొక్క ప్రదర్శన ఏమిటంటే, నీ వలననే రాత్రి పగటిలోకి ప్రవేశించడం ద్వారా రాత్రి సుదీర్ఘం అవుతుంది మరియు పగటి రాత్రిలోకి ప్రవేశించడం ద్వారా పగలు సుదీర్ఘం అవుతున్నది. దీనికి కారణం నీవే. నీవు అవిశ్వాసిలో నుండి విశ్వాసిని మరియు విత్తనాల నుండి పంటలను బయటికి తీసినట్లుగా, నీవు నిర్జీవమైన వాటి నుండి జీవమున్న వాటిని బయటికి తీస్తావు. అలాగే విశ్వాసిలో నుండి అవిశ్వాసిని మరియు కోడిలో నుండి గ్రుడ్డును బయటికి తీసినట్లుగా నీవు జీవమున్న వాటి నుండి నిర్జీవమైన వాటిని బయటికి తీస్తావు. నీవు తలిచిన వారికి ఎలాంటి పరిమితి లేదా లెక్క లేకుండా సమృద్ధిగా ప్రసాదిస్తావు.
تەفسیرە عەرەبیەکان:
لَا یَتَّخِذِ الْمُؤْمِنُوْنَ الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ۚ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ فَلَیْسَ مِنَ اللّٰهِ فِیْ شَیْءٍ اِلَّاۤ اَنْ تَتَّقُوْا مِنْهُمْ تُقٰىةً ؕ— وَیُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟
ఓ విశ్వాసులారా! ఇతర విశ్వాసులను విడిచి పెట్టి, మీరు ప్రేమించే మరియు మద్దతునిచ్చే అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోకండి: ఇలా చేసిన వారికి అల్లాహ్ ఏ విధంగానూ సహాయం చేయడు. అయితే, ఒకవేళ మీరు వారి అధికారం కింద ఉండి, ప్రాణభయంతో ఉంటే, మనసు లోపల వారిని అసహ్యించుకుంటూ, పైకి మాత్రం మీ మాటల్లో మరియు చేతల్లో వారితో మంచిగా ప్రవర్తిస్తే అందులో ఎలాంటి హానీ ఉండదు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయనకు భయపడండి మరియు పాపాలు చేయడం ద్వారా ఆయన కోపానికి గురికాకండి. పునరుత్థాన దినం నాడు తమ ఆచరణల ప్రతిఫలం కోసం మానవులందరూ అల్లాహ్ వైపునకే మరలుతారు.
تەفسیرە عەرەبیەکان:
قُلْ اِنْ تُخْفُوْا مَا فِیْ صُدُوْرِكُمْ اَوْ تُبْدُوْهُ یَعْلَمْهُ اللّٰهُ ؕ— وَیَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రవక్తా! ప్రకటించండి : అల్లాహ్ నిషేధించిన అవిశ్వాసులతో స్నేహం చేయడం వంటి వాటిని మీరు మీ హృదయాల్లో దాచుకున్నా లేదా అదే బయటికి వెల్లడించినా, దాని గురించి అల్లాహ్ కు తెలిసి పోతుంది. ఆయన నుండి ఏదీ దాగదు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయనను ఏదీ అశక్తుడినిగా చేయదు.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• أن التوفيق والهداية من الله تعالى، والعلم - وإن كثر وبلغ صاحبه أعلى المراتب - إن لم يصاحبه توفيق الله لم ينتفع به المرء.
కేవలం అల్లాహ్ నుండి మాత్రమే మార్గదర్శకత్వం మరియు సాఫల్యం లభిస్తుంది. ఎంతో తెలివైన వ్యక్తి, అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పటికీ, అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకుండా అది అతడికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.

• أن الملك لله تعالى، فهو المعطي المانع، المعز المذل، بيده الخير كله، وإليه يرجع الأمر كله، فلا يُسأل أحد سواه.
అధికారం మొత్తం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది: ఆయన మాత్రమే ప్రసాదించేవాడు మరియు వెనక్కి తీసుకునేవాడూను; గౌరవం ప్రసాదించేవాడూ మరియు అవమానం పాలు చేసేవాడూను. అన్నీ విషయాలు ఆయనతోనే ఉన్నాయి కనుక ఎవ్వరూ, ఆయనను వదిలి మరెవ్వరినీ అర్థించ కూడదు.

• خطورة تولي الكافرين، حيث توعَّد الله فاعله بالبراءة منه وبالحساب يوم القيامة.
విశ్వాసులతో స్నేహం చేయడం మరియు అవిశ్వాసులను వదిలివేయడం అవసరం. ప్రళయదినం నాడు అల్లాహ్ దీనిని ఉపేక్షించిన వారి లెక్కతీసుకుంటానని హెచ్చరిస్తున్నాడు.

 
وه‌رگێڕانی ماناكان سوره‌تی: آل عمران
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلگۆیی بۆ پوختەی تەفسیری قورئانی پیرۆز - پێڕستی وه‌رگێڕاوه‌كان

بڵاوكراوەتەوە لەلایەن ناوەندی تەفسیر بۆ خوێندنە قورئانیەکان.

داخستن