وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - پێڕستی وه‌رگێڕاوه‌كان


وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (4) سوره‌تی: سورەتی محمد
فَاِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا فَضَرْبَ الرِّقَابِ ؕ— حَتّٰۤی اِذَاۤ اَثْخَنْتُمُوْهُمْ فَشُدُّوا الْوَثَاقَ ۙ— فَاِمَّا مَنًّا بَعْدُ وَاِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الْحَرْبُ اَوْزَارَهَا— ذٰلِكَ ۛؕ— وَلَوْ یَشَآءُ اللّٰهُ لَانْتَصَرَ مِنْهُمْ ۙ— وَلٰكِنْ لِّیَبْلُوَاۡ بَعْضَكُمْ بِبَعْضٍ ؕ— وَالَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ فَلَنْ یُّضِلَّ اَعْمَالَهُمْ ۟
విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరులను యుద్దం చేస్తుండగా ఎదుర్కొన్నపప్పుడు మీ ఖడ్గములతో వారి మెడలను వదించండి. వారిలో మీరు హత్యాకాండను అధికం చేసేంత వరకు వారితో యుద్ధమును కొనసాగించండి. వారి ప్రాబల్యమును కూకటి వ్రేళ్ళతో తీసివేయండి. మీరు వారిలో హత్యాకాండను అధికం చేసినప్పుడు ఖైదీల గొలుసులను బిగించండి. మీరు వారిని బందీలుగా చేసుకున్నప్పుడు ప్రయోజనమునకు తగినట్లుగా మీకు ఎంపిక చేసుకునే అధికారముంటుంది. ఎటువంటి బదులు లేకుండా వారిని బందీ నుండి విడుదల చేయటం ద్వారా లేదా ధనం లేదా వేరే ఇతర వాటి ద్వారా వారి నుండి లబ్ది పొంది వారిపై కనికరించటం. అవిశ్వాసపరులు ఇస్లాం స్వీకరించటం లేదా వారితో ఒప్పందం తో యుద్ధం ముగిసేంతవరకు వారితో మీరు యుద్దమును మరియు బందీలను చేయటమును కొనసాగించండి. ఈ ప్రస్తావించబడిన అవిశ్వాసపరులతో విశ్వాసపరులను పరీక్షించటం, కాల చక్రము, ఒకరిపై ఒకరికి విజయము ఇవి అల్లాహ్ ఆదేశము. ఒక వేళ అల్లాహ్ ఎటువంటి యుద్ధం లేకుండా అవిశ్వాసపరులపై విజయం కలిగించదలచుకుంటే వారిపై విజయమును కలిగించేవాడు. కాని ఆయన ధర్మ పోరాటమును మీలో నుండి కొందరిని కొందరితో పరీక్షించటానికి ధర్మబద్ధం చేశాడు. కాబట్టి ఆయన విశ్వాసపరుల్లోంచి ఎవరు యుద్ధం చేస్తాడో మరియు ఎవరు యుద్ధం చేయడో ఆయన పరీక్షిస్తాడు. మరియు ఆయన ఆవిశ్వాసపరుడిని విశ్వాసపరుడితో పరీక్షిస్తాడు. ఒక వేళ అతడు విశ్వాసపరుడిని వదించితే అతడు (విశ్వాసపరుడు) స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఒక వేళ అతడిని విశ్వాసపరుడు వదిస్తే అతడు (అవిశ్వాసపరుడు) నరకంలో ప్రవేశిస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో వదించబడే వారి కర్మలను అల్లాహ్ వృధా చేయడు.
تەفسیرە عەرەبیەکان:
سوودەکانی ئایەتەکان لەم پەڕەیەدا:
• النكاية في العدوّ بالقتل وسيلة مُثْلى لإخضاعه.
శతృవు విషయంలో హత్యాకాండ ద్వారా ఆధిక్యత చూపటం అతన్ని లొంగదీసుకోవటానికి అనువైన మార్గం.

• المن والفداء والقتل والاسترقاق خيارات في الإسلام للتعامل مع الأسير الكافر، يؤخذ منها ما يحقق المصلحة.
కనికరించటం,వియోచనం,హతమార్చటం మరియు బానిస చేసుకోవటం అవిశ్వాసపరుడైన ఖైదీ పట్ల వ్యవహరించటం కొరకు ఇస్లాంలో అనుమతులు కలవు. వాటిలో నుండి ప్రయోజనకరమైన దానిని ఎంచుకోబడును.

• عظم فضل الشهادة في سبيل الله.
అల్లాహ్ మార్గములో వీరగతి పొందటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము.

• نصر الله للمؤمنين مشروط بنصرهم لدينه.
విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము ఆయన ధర్మమునకు వారి సహాయము షరతుతో కూడినది.

 
وه‌رگێڕانی ماناكان ئایه‌تی: (4) سوره‌تی: سورەتی محمد
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - پێڕستی وه‌رگێڕاوه‌كان

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

داخستن