وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلوغی - عبدالرحيم محمد * - پێڕستی وه‌رگێڕاوه‌كان

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الحجر   ئایه‌تی:

సూరహ్ అల్-హిజ్ర్

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ وَقُرْاٰنٍ مُّبِیْنٍ ۟
అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.[2]
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
'[2] చూడండి, 5:15.
تەفسیرە عەرەبیەکان:
رُبَمَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ كَانُوْا مُسْلِمِیْنَ ۟
సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.
تەفسیرە عەرەبیەکان:
ذَرْهُمْ یَاْكُلُوْا وَیَتَمَتَّعُوْا وَیُلْهِهِمُ الْاَمَلُ فَسَوْفَ یَعْلَمُوْنَ ۟
వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.
تەفسیرە عەرەبیەکان:
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُوْمٌ ۟
మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.[1]
[1] ఇంకా చూడండి, 26:208 మరియు 6:131.
تەفسیرە عەرەبیەکان:
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟
ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.[1]
[1] చూడండి, 7:34. ఏ నగరం కూడా దాని సత్యతిరస్కారం మరియు అత్యాచారాలకు వెంటనే నాశనం చేయబడలేదు. దానికి ఒక వ్యవధి, నియమిత కాలం అల్లాహుతా'ఆలా తరఫు నుండి ఇవ్వబడుతోంది. ఇక ఆ నియమిత కాలం వచ్చిన తరువాత వారు దాని నుండి వెనుకా ముందు కాలేరు అంటే ఒక్క క్షణం కూడా వ్యవధి పొందలేరు.
تەفسیرە عەرەبیەکان:
وَقَالُوْا یٰۤاَیُّهَا الَّذِیْ نُزِّلَ عَلَیْهِ الذِّكْرُ اِنَّكَ لَمَجْنُوْنٌ ۟ؕ
మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు.
تەفسیرە عەرەبیەکان:
لَوْ مَا تَاْتِیْنَا بِالْمَلٰٓىِٕكَةِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
"నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు?"
تەفسیرە عەرەبیەکان:
مَا نُنَزِّلُ الْمَلٰٓىِٕكَةَ اِلَّا بِالْحَقِّ وَمَا كَانُوْۤا اِذًا مُّنْظَرِیْنَ ۟
మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.[1]
[1] చూడండి, 6:8-9.
تەفسیرە عەرەبیەکان:
اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟
నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.[1]
[1] 1400 సంవత్సరాలలో ఒక అక్షరం కూడా మార్పు లేకుండా భద్రపరచబడిన దివ్యగ్రంథం కేవలం ఈ ఖుర్ఆన్ మాత్రమే. ఎందుకంటే అల్లాహుతా'ఆలా: "నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపడేవారము." అని అన్నాడు. ఇంకా చూడండి, 2:23 మరియు 85:22.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ شِیَعِ الْاَوَّلِیْنَ ۟
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.
تەفسیرە عەرەبیەکان:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.[1]
[1] చూడండి, 6:10.
تەفسیرە عەرەبیەکان:
كَذٰلِكَ نَسْلُكُهٗ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ۙ
ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము.
تەفسیرە عەرەبیەکان:
لَا یُؤْمِنُوْنَ بِهٖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْاَوَّلِیْنَ ۟
వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.
تەفسیرە عەرەبیەکان:
وَلَوْ فَتَحْنَا عَلَیْهِمْ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوْا فِیْهِ یَعْرُجُوْنَ ۟ۙ
మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ!
تەفسیرە عەرەبیەکان:
لَقَالُوْۤا اِنَّمَا سُكِّرَتْ اَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُوْرُوْنَ ۟۠
ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది."[1]
[1] ఇంకా చూడండి, 6:7 మరియు 10:2.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ جَعَلْنَا فِی السَّمَآءِ بُرُوْجًا وَّزَیَّنّٰهَا لِلنّٰظِرِیْنَ ۟ۙ
మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.
تەفسیرە عەرەبیەکان:
وَحَفِظْنٰهَا مِنْ كُلِّ شَیْطٰنٍ رَّجِیْمٍ ۟ۙ
మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా [1]
[1] ఇంకా చూడండి, 2:14 మరియు 37:7.
تەفسیرە عەرەبیەکان:
اِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَاَتْبَعَهٗ شِهَابٌ مُّبِیْنٌ ۟
కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.[1]
[1] ఇంకా చూడండి, 37:10.
تەفسیرە عەرەبیەکان:
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ شَیْءٍ مَّوْزُوْنٍ ۟
మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.
تەفسیرە عەرەبیەکان:
وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ وَمَنْ لَّسْتُمْ لَهٗ بِرٰزِقِیْنَ ۟
మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]
[1] ఇంకా చూడండి, 11:6.
تەفسیرە عەرەبیەکان:
وَاِنْ مِّنْ شَیْءٍ اِلَّا عِنْدَنَا خَزَآىِٕنُهٗ ؗ— وَمَا نُنَزِّلُهٗۤ اِلَّا بِقَدَرٍ مَّعْلُوْمٍ ۟
మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.
تەفسیرە عەرەبیەکان:
وَاَرْسَلْنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسْقَیْنٰكُمُوْهُ ۚ— وَمَاۤ اَنْتُمْ لَهٗ بِخٰزِنِیْنَ ۟
మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!
تەفسیرە عەرەبیەکان:
وَاِنَّا لَنَحْنُ نُحْیٖ وَنُمِیْتُ وَنَحْنُ الْوٰرِثُوْنَ ۟
మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.[1]
[1] ఇంకా చూడండి, 3:180 మరియు 57:10.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِیْنَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَاْخِرِیْنَ ۟
మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.[1]
[1] 'ఎవరైతే ముందుగా (మా వద్దకు) వస్తారో మరియు ఎవరు వెనుక ఉండిపోతారో...తెలుసు'. ఈ రెండురకాల వ్యాఖ్యానాలు కూడ సరైనవే అని వ్యాఖ్యాతలు అంగీకరించారు. మరొక వ్యాఖ్యానం: 'మరియు వాస్తవానికి, మీలో ముందుకు సాగిపోయే వారెవరో మాకు తెలుసు మరియు వాస్తవానికి, వెనుకంజ వేసేవారెవరో కూడా మాకు తెలుసు.' అని కూడా ఇవ్వబడింది.
تەفسیرە عەرەبیەکان:
وَاِنَّ رَبَّكَ هُوَ یَحْشُرُهُمْ ؕ— اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ ۟۠
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟ۚ
మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.[1]
[1] మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు. వేర్వేరు చోట్లలో ఆ మట్టి స్థితిని బట్టి వేర్వేరు పేర్లు ఇవ్వబడ్డాయి. 1) సాధారణంగా ఎడిపోయిన (తడిలేని) మట్టిని తురాబ్ - దుమ్ము అని, 2) దానిని నీళ్ళు వేసి కలిపితే 'తీన్ - మట్టి అని, 3) అది చాలా నీళ్ళతో కలిపి వాసన వచ్చే బురదగా ఉంటె, 'హమఇన్ మస్నూన్ - జిగట బురద అని, 4) అది ఎండిపోయి శబ్దం చేస్తే, - 'స'ల్సాల్ - అని, 5) దానిని కాల్చితే, ఫ'ఖ్ఖార్ - పెంకు, అని పేర్లు ఇవ్వబడ్డాయి. (చూడండి, 55:14).
تەفسیرە عەرەبیەکان:
وَالْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ ۟
మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.[1]
[1] అల్ - జిన్ను, జిన్నతున్ (బ.వ.) అంటే మానవుల కండ్లకు కనబడనిది అని అర్థము. అందుకే వారిని ఈ పేరుతో పిలుస్తారు. వారికి తెలివి ఉంది, మంచి చెడుల విచక్షణా శక్తి ఉంది. పొగలేని అగ్నిజ్వాలలతో సృష్టించబడ్డారు. వారు తింటారు, త్రాగుతారు. వారి సంతతి పెరుగుతుంది. వారికి మరణం ఉంది. వారి కర్మలను బట్టి వారికి, మానవుల వలె స్వర్గనరకాల ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. ('అబ్దుల్ మజీద్ దర్యాబాది, ర'హ్మ.) చూడండి 55:15 మరియు 6:100.
تەفسیرە عەرەبیەکان:
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
تەفسیرە عەرەبیەکان:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."[1]
[1] ఈ సాష్టాంగం కేవలం అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించటానికి చేయబడిన గౌరవప్రదమైన సాష్టాంగం. ఇది ఆరాధనార్థం చేసింది కాదు. ము'హమ్మద్ ('స'అస) షరీఅత్ లో గౌరవార్థం కూడా ఎవ్వరికైనను సాష్టాంగం చేయటం ధర్మసమ్మతం కాదు. ఇంకా చూడండి, 2:30-34 మరియు 7:11-18.
تەفسیرە عەرەبیەکان:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -
تەفسیرە عەرەبیەکان:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰۤی اَنْ یَّكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.[1]
[1] 'మానవుడు మట్టితో సృష్టించబడ్డాడు, కాని నేనైతే అగ్నితో సృష్టించబడ్డాను, కాబట్టి నేను మానవుని కంటే ఉత్తముడను, నేనెందుకు అతనికి సజ్దా చేయాలి.' అని ఇబ్లీస్ అన్నాడు. దైవప్రవక్తలందరూ మట్టితోనే సృష్టించబడ్డ మానవులేనని ఖుర్ఆన్ విశదీకరించింది. దీనిని విశ్వసించక పోవడం మరియు మట్టితో సృష్టించబడ్డవారు అధములని భావించడం షై'తాన్ ను అనుసరించడమే! ఇంకా చూడండి, 7:11.
تەفسیرە عەرەبیەکان:
قَالَ یٰۤاِبْلِیْسُ مَا لَكَ اَلَّا تَكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు?"
تەفسیرە عەرەبیەکان:
قَالَ لَمْ اَكُنْ لِّاَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهٗ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను."
تەفسیرە عەرەبیەکان:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙ
(అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు!
تەفسیرە عەرەبیەکان:
وَّاِنَّ عَلَیْكَ اللَّعْنَةَ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది."
تەفسیرە عەرەبیەکان:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
(ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
تەفسیرە عەرەبیەکان:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
(అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు!
تەفسیرە عەرەبیەکان:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు!"
تەفسیرە عەرەبیەکان:
قَالَ رَبِّ بِمَاۤ اَغْوَیْتَنِیْ لَاُزَیِّنَنَّ لَهُمْ فِی الْاَرْضِ وَلَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.
تەفسیرە عەرەبیەکان:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప!"
تەفسیرە عەرەبیەکان:
قَالَ هٰذَا صِرَاطٌ عَلَیَّ مُسْتَقِیْمٌ ۟
(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.[1]
[1] బహిష్కరించబడిన ఇబ్లీస్, అల్లాహుతా'ఆలా ఇచ్ఛనే నెరవేరుస్తున్నాడు. అల్లాహ్ (సు.తా.) మానవునికి మంచి చెడును అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించి, ఎవడు చెడు (షై'తాన్ ప్రేరణ)లో పడిపోతాడో చూస్తాడు. ఈ విధంగా షై'తాన్ అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ నిర్వహణలో ఒక పాత్ర నిర్వహిస్తున్నాడు. కావు షై'తాన్ వల నుండి తప్పించుకునే వాడు ఋజుమార్గం మీద ఉండగలడు. ఇంకా చూడండి, 19:83 మరియు 7:24.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ عِبَادِیْ لَیْسَ لَكَ عَلَیْهِمْ سُلْطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغٰوِیْنَ ۟
నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప![1]
[1] చూడండి, 14:22 మరియు 7:11-18.
تەفسیرە عەرەبیەکان:
وَاِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!
تەفسیرە عەرەبیەکان:
لَهَا سَبْعَةُ اَبْوَابٍ ؕ— لِكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُوْمٌ ۟۠
దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి.[1] వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.
[1] నరకానికి ఏడు అంతస్తులు లేక శ్రేణులున్నాయి. 1) జహన్నుమ్, 2) ల"జ్జా, 3) 'హుత్మ', 4) స'యీర్, 5) సఖర్, 6) జ'హీమ్, 7) హావియహ్, ఇది అన్నింటి కంటే క్రింది అంతస్తు, ఇందులో మునాపిఖులు (కపటవిశ్వాసులు) ఉంటారు. (ఫ'త్హ అల్ ఖదీర్), చూడండి, 74:27 వ్యాఖ్యానం 2.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ؕ
నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు.
تەفسیرە عەرەبیەکان:
اُدْخُلُوْهَا بِسَلٰمٍ اٰمِنِیْنَ ۟
వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు.
تەفسیرە عەرەبیەکان:
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ اِخْوَانًا عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیْنَ ۟
వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు.[1]
[1] చూడండి, 56:15 మరియు 88:13.
تەفسیرە عەرەبیەکان:
لَا یَمَسُّهُمْ فِیْهَا نَصَبٌ وَّمَا هُمْ مِّنْهَا بِمُخْرَجِیْنَ ۟
అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు."
تەفسیرە عەرەبیەکان:
نَبِّئْ عِبَادِیْۤ اَنِّیْۤ اَنَا الْغَفُوْرُ الرَّحِیْمُ ۟ۙ
నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.[1]
[1] చూడండి, 6:12 మరియు 6:54.
تەفسیرە عەرەبیەکان:
وَاَنَّ عَذَابِیْ هُوَ الْعَذَابُ الْاَلِیْمُ ۟
మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!
تەفسیرە عەرەبیەکان:
وَنَبِّئْهُمْ عَنْ ضَیْفِ اِبْرٰهِیْمَ ۟ۘ
మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు.[1]
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క విరరమైన గాథ కొరకు చూడండి, 11:69-76. దీనికి కొంత కాలం ముందే అవతరింపజేయబడిన సూరహ్.
تەفسیرە عەرەبیەکان:
اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ— قَالَ اِنَّا مِنْكُمْ وَجِلُوْنَ ۟
వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."[1]
[1] వారి భయానికి కారణం కొరకు చూడండి, 11:70 దీని ద్వారా తెలిసేదేమిటంటే ఇబ్రాహీమ్ ('అ.స.) ఒక దైవప్రవక్త అయినా, వచ్చిన అతిథులు దైవదూతలని వారు చెప్పేంత వరకు తెలుసుకోలేక పోయారు. అంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అల్లాహ్ (సు.తా.) వారికి తెలిపినది మాత్రమే వారికి తెలుస్తుంది.
تەفسیرە عەرەبیەکان:
قَالُوْا لَا تَوْجَلْ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمٍ عَلِیْمٍ ۟
వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము."
تەفسیرە عەرەبیەکان:
قَالَ اَبَشَّرْتُمُوْنِیْ عَلٰۤی اَنْ مَّسَّنِیَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُوْنَ ۟
(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?"
تەفسیرە عەرەبیەکان:
قَالُوْا بَشَّرْنٰكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِّنَ الْقٰنِطِیْنَ ۟
వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు."
تەفسیرە عەرەبیەکان:
قَالَ وَمَنْ یَّقْنَطُ مِنْ رَّحْمَةِ رَبِّهٖۤ اِلَّا الضَّآلُّوْنَ ۟
(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?"
تەفسیرە عەرەبیەکان:
قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ ۟
(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?"
تەفسیرە عەرەبیەکان:
قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰی قَوْمٍ مُّجْرِمِیْنَ ۟ۙ
వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము [1] -
[1] సోడోమ్ మరియు గొమొర్రహ్ ప్రజల గాథ కొరకు చూడండి, 7:80-84 మరియు 11:77-83.
تەفسیرە عەرەبیەکان:
اِلَّاۤ اٰلَ لُوْطٍ ؕ— اِنَّا لَمُنَجُّوْهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
లూత్ ఇంటివారు[1] తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;
[1] ఆల : అంటే ఇంటివారే కాక అనుచరులందరూ కూడా అన్నమాట.
تەفسیرە عەرەبیەکان:
اِلَّا امْرَاَتَهٗ قَدَّرْنَاۤ ۙ— اِنَّهَا لَمِنَ الْغٰبِرِیْنَ ۟۠
అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1]
[1] చూడండి, 7:83 11:81 మరియు 66:10.
تەفسیرە عەرەبیەکان:
فَلَمَّا جَآءَ اٰلَ لُوْطِ ١لْمُرْسَلُوْنَ ۟ۙ
తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;
تەفسیرە عەرەبیەکان:
قَالَ اِنَّكُمْ قَوْمٌ مُّنْكَرُوْنَ ۟
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1]
[1] ఆ దేవదూతలు యువకుల ఆకారంలో వచ్చారు. చూడండి, 11:77.
تەفسیرە عەرەبیەکان:
قَالُوْا بَلْ جِئْنٰكَ بِمَا كَانُوْا فِیْهِ یَمْتَرُوْنَ ۟
వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1]
[1] చూడండి, 6:57-58, 8:32, 11:8.
تەفسیرە عەرەبیەکان:
وَاَتَیْنٰكَ بِالْحَقِّ وَاِنَّا لَصٰدِقُوْنَ ۟
మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.
تەفسیرە عەرەبیەکان:
فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَاتَّبِعْ اَدْبَارَهُمْ وَلَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ وَّامْضُوْا حَیْثُ تُؤْمَرُوْنَ ۟
కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి."
تەفسیرە عەرەبیەکان:
وَقَضَیْنَاۤ اِلَیْهِ ذٰلِكَ الْاَمْرَ اَنَّ دَابِرَ هٰۤؤُلَآءِ مَقْطُوْعٌ مُّصْبِحِیْنَ ۟
మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు."
تەفسیرە عەرەبیەکان:
وَجَآءَ اَهْلُ الْمَدِیْنَةِ یَسْتَبْشِرُوْنَ ۟
మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.
تەفسیرە عەرەبیەکان:
قَالَ اِنَّ هٰۤؤُلَآءِ ضَیْفِیْ فَلَا تَفْضَحُوْنِ ۟ۙ
(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1]
[1] చూడండి, 7:80-81, 11:77-79.
تەفسیرە عەرەبیەکان:
وَاتَّقُوا اللّٰهَ وَلَا تُخْزُوْنِ ۟
మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి."
تەفسیرە عەرەبیەکان:
قَالُوْۤا اَوَلَمْ نَنْهَكَ عَنِ الْعٰلَمِیْنَ ۟
వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"[1]
[1] లూ'త్ ('అ.స.) సొడోమ్ ప్రాంతంలో విదేశీయుడు. ఎందుకంటే అతను మెసపొటోమియా నుండి వచ్చినవాడు. చూడండి, 7:80-82.
تەفسیرە عەرەبیەکان:
قَالَ هٰۤؤُلَآءِ بَنَاتِیْۤ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟ؕ
(లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు."[1]
[1] లూ'త్ ('అ.స.) తన జాతి స్త్రీలను తన కుమార్తెలని సంబోధించారు.
تەفسیرە عەرەبیەکان:
لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ یَعْمَهُوْنَ ۟
"నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు."[1] (అని దైవదూతలు అన్నారు.)
[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ లూ'త్ ('అ.స.) ను సంబోధిస్తున్నదని అంటారు. మరికొందరు దైవప్రవక్త ('స'అస) ను సంబోధిస్తున్నదని. అల్లాహుతా'ఆలా ఇక్కడ ము'హమ్మద్ ('స'అస) యొక్క ప్రాణ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన (సు.తా.) తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహుతా'ఆలా తప్ప మరెవ్వరి ప్రమాణం చేయటం ధర్మసమ్మతం కాదు.
تەفسیرە عەرەبیەکان:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُشْرِقِیْنَ ۟ۙ
ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది.
تەفسیرە عەرەبیەکان:
فَجَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهِمْ حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۟ؕ
తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْمُتَوَسِّمِیْنَ ۟
నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి.
تەفسیرە عەرەبیەکان:
وَاِنَّهَا لَبِسَبِیْلٍ مُّقِیْمٍ ۟
మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّلْمُؤْمِنِیْنَ ۟ؕ
నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.
تەفسیرە عەرەبیەکان:
وَاِنْ كَانَ اَصْحٰبُ الْاَیْكَةِ لَظٰلِمِیْنَ ۟ۙ
మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.[1]
[1] అయ్ కహ్ వాసులు (దట్టమైన వనవాసులు) మద్ యన్ ప్రజలు. వారు తమ ప్రవక్తల షు'ఐబ్ ను తిరస్కరించారు. వారు ఒక భూకంపం మరియు జ్వాలాముఖి సంభవించి నాశనమయ్యారు. చూడండి, 7:85-93 మరియు 11:84-95.
تەفسیرە عەرەبیەکان:
فَانْتَقَمْنَا مِنْهُمْ ۘ— وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِیْنٍ ۟ؕ۠
కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.[1]
[1] లూ'త్ ('అ.స.) ప్రజలు మరియు షు'ఐబ్ ('అ.స.) ప్రజలు దగ్గరి దగ్గరి ప్రాంతాలలో నివసించారు. వారు లూ'త్ ('అ.స.) మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత వచ్చారు.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِیْنَ ۟ۙ
మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.[1]
[1] స'మూద్ జాతి మరియు వారి ప్రవక్త 'సాలి'హ్ ('అ.స.) నివసించే ప్రాంతం పేరు 'హిజ్ర్, కావున వారిని అస్'హాబ్ అల్-'హిజ్ర్ అంటారు. ఈ ప్రంతం మదీనా - తబూక్ ల మధ్య ఉంది. చూడండి, 7:73-79.
تەفسیرە عەرەبیەکان:
وَاٰتَیْنٰهُمْ اٰیٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟ۙ
మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. [1]
[1] ఈ అద్భుత సూచనలలో ఆ ఆడఒంటె ఒకటి. కాని వారు దానిని చంపేశారు.
تەفسیرە عەرەبیەکان:
وَكَانُوْا یَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا اٰمِنِیْنَ ۟
మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు,[1] సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!
[1] చూడండి, 7:74. 9వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ నగరం దారిలో వచ్చింది. అతను ('స'అస) తమ నెత్తి మీద బట్ట చుట్టుకున్నారు మరియు తమ ఒంటె గమనాన్ని తీవ్రం చేశారు. మరియు తమ సహీబీలతో ఇలా అన్నారు: 'ఏడుస్తూ, అల్లాహ్ (సు.తా.) శిక్షకు భయపడుతూ ఈ నగరం నుండి ప్రయణించండి. ('స'హీ'హ్ బు'ఖారీ, 433; 'స. ముస్లిం 2285. ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం).
تەفسیرە عەرەبیەکان:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُصْبِحِیْنَ ۟ۙ
చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది.
تەفسیرە عەرەبیەکان:
فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟ؕ
అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది.
تەفسیرە عەرەبیەکان:
وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ— وَاِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِیْلَ ۟
మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే[1] సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు!
[1] చూడండి, 53:31.
تەفسیرە عەرەبیەکان:
اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ ۟
నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త,[1] సర్వజ్ఞుడు.[2]
[1] అల్-'ఖల్లాఖ్: The Greatest Creator, The Creator of all things. సృష్టి క్రియలో పరిపూర్ణుడు, సృష్టికర్త. సముచిత రూపం శక్తిసామర్థ్యాలు ఇచ్చి తీర్చిదిద్ది అత్యుత్తమంగా సృష్టించేవాడు. చూడండి, అల్-'ఖాలిఖు:7:102. [2] చూడండి, 7:199.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ اٰتَیْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِیْ وَالْقُرْاٰنَ الْعَظِیْمَ ۟
మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.[1]
[1] సబ్ 'అమ్మినల్ మసా'ని. ఈ పేరు సూరహ్ అల్ ఫాతిహా'కు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) స్వయంగా ఇచ్చారు. అది దివ్యఖుర్ఆన్ సారం (ఉమ్ముల్ కితాబ్) అని కూడా అనబడుతుంది. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్ సూరాహ్ అల్-'హిజ్ర్). చూడండి, సూరహ్ అల్ ఫాతి'హా (1).
تەفسیرە عەرەبیەکان:
لَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَیْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِیْنَ ۟
వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.[1]
[1] విశ్వసించినవారితో సానుభూతితో, ప్రేమతో, కనికరంతో వ్యవహరించు. చూడండి, 17:24.
تەفسیرە عەرەبیەکان:
وَقُلْ اِنِّیْۤ اَنَا النَّذِیْرُ الْمُبِیْنُ ۟ۚ
మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే!"
تەفسیرە عەرەبیەکان:
كَمَاۤ اَنْزَلْنَا عَلَی الْمُقْتَسِمِیْنَ ۟ۙ
ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో![1]
[1] 1) కొందరు వ్యాఖ్యాతలు అ'న్జల్ నా అవతరింపబజేశాము అంటే 'అజా'బ్ - శిక్ష అ అర్థంలో తీసుకున్నారు. ఆ శిక్ష వారి (ఖురైషుల) కొరకు ఎవరైతే దివ్యగ్రంథాన్ని (ఈ ఖుర్ఆన్ ను) వేర్వేరు ముక్కలుగా చేసి, కొంత భాగాన్ని కవిత అని, కొంత భాగాన్ని మంత్రజాలమని, మరికొంత భాగాన్ని ప్రాచీన గాథలని, పేర్లు పెట్టారో. 2) మరికొందరు వ్యాఖ్యాతలు ముఖ్తసిమీన్ - అంటే పూర్వ గ్రంథ ప్రజలు (యూదులు, క్రైస్తవులు) అని అంటారు. మరియు ఖుర్ఆన్ అంటే తౌరాత్ /ఇంజీల్ అంటారు. వారు వీటిని విభిన్న భాగాలలోకి ముక్కలు ముక్కలుగా చేశారు. 3) ఇంకా మరికొందరు వ్యాఖ్యాతలు వీరు 'సాలి'హ్ ('అస) యొక్క జాతివారు అంటారు. వారు 'సాలి'హ్ మరియు అతన కుటుంబం వారిని చంపి ముక్కలుముక్కలుగా చేయాలని కుట్రలు పన్నారు. చూడండి, 27:49. 4) మరొక వ్యాఖ్యానం ఏమిటంటే దివ్యగ్రంథపు కొంత భాగాన్ని నమ్మి, ఇతర భాగాన్ని తిరస్కరించటం.
تەفسیرە عەرەبیەکان:
الَّذِیْنَ جَعَلُوا الْقُرْاٰنَ عِضِیْنَ ۟
ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో!
تەفسیرە عەرەبیەکان:
فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;
تەفسیرە عەرەبیەکان:
عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.
تەفسیرە عەرەبیەکان:
فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ ۟
కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు.[1] మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.
[1] ఈ ఆయత్ అవతరింక ముందు దైవప్రవక్త ('స'అస) రహస్యంగా ప్రజలకు ధర్మబోధన (తబ్లీగ్ / ద'ఆవహ్) చేసేవారు. ఇది అవతరింప జేయబడిన తరువాత బహిరంగంగా ధర్మబోధన (ద'ఆవహ్) చేయటం ప్రారంభించారు. (ఫ'త్హ్ అల్ ఖదీర్).
تەفسیرە عەرەبیەکان:
اِنَّا كَفَیْنٰكَ الْمُسْتَهْزِءِیْنَ ۟ۙ
నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!
تەفسیرە عەرەبیەکان:
الَّذِیْنَ یَجْعَلُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۚ— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.
تەفسیرە عەرەبیەکان:
وَلَقَدْ نَعْلَمُ اَنَّكَ یَضِیْقُ صَدْرُكَ بِمَا یَقُوْلُوْنَ ۟ۙ
మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.
تەفسیرە عەرەبیەکان:
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِّنَ السّٰجِدِیْنَ ۟ۙ
కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.
تەفسیرە عەرەبیەکان:
وَاعْبُدْ رَبَّكَ حَتّٰی یَاْتِیَكَ الْیَقِیْنُ ۟۠
మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.[1]
[1] అల్ - యఖీను: అంటే మరణం. ('స. బు'ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్). ఇంకా చూడండి, 74:47.
تەفسیرە عەرەبیەکان:
 
وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الحجر
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی تلوغی - عبدالرحيم محمد - پێڕستی وه‌رگێڕاوه‌كان

وەرگێڕاوی ماناکانی قورئانی پیرۆز بۆ زمانی تیلیگۆ، وەرگێڕان: عبد الرحيم بن محمد.

داخستن