Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (48) Sūra: Sūra Al-Ma’idah’
وَاَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ الْكِتٰبِ وَمُهَیْمِنًا عَلَیْهِ فَاحْكُمْ بَیْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ عَمَّا جَآءَكَ مِنَ الْحَقِّ ؕ— لِكُلٍّ جَعَلْنَا مِنْكُمْ شِرْعَةً وَّمِنْهَاجًا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ لِّیَبْلُوَكُمْ فِیْ مَاۤ اٰتٰىكُمْ فَاسْتَبِقُوا الْخَیْرٰتِ ؕ— اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మేము మీ వైపునకు ఖుర్ఆన్ ను అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము కాని సంశయం కాని లేని సత్యముతో అవతరింపజేశాము. అది తనకు పూర్వం అవతరింపబడిన గ్రంధములను దృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. అది వాటిలో నుండి దేనికి అనుగుణంగా ఉన్నదో అది సత్యము. మరియు అది దేనికి భిన్నంగా ఉన్నదో అది అసత్యము. కావున మీరు అల్లాహ్ మీపై అందులో ఏది అవతరింపజేశాడో దానితో ప్రజల మధ్య తీర్పునివ్వండి. మరియు ఎటువంటి సందేహం లేని మీపై అవతరింపబడిన సత్యమును వదిలివేస్తూ వారు ఎంచుకున్నటువంటి వారి మనోవాంఛలను అనుసరించకండి. మరియు మేము ప్రతీ సమాజం కొరకు ఆచరణాత్మక తీర్పులు కల ధర్మాన్ని మరియు మార్గదర్శకం పొందే స్పష్టమైన మార్గమును చేశాము. మరియు ఒక వేళ అల్లాహ్ ధర్మాలన్నింటిని ఒకే ధర్మంగా చేయదలచుకుంటే చేసేవాడు. కాని ఆయన ప్రతీ సమాజం కొరకు ఒక ధర్మాన్ని చేశాడు. ఆయన అందరిని పరీక్షించటానికి .అప్పుడు అవిధేయుడి నుండి విధేయుడు స్పష్టమవుతాడు. కావున మీరు సత్కర్మలు చేయటానికి మరియు చెడులను విడనాడటానికి త్వరపడండి. ప్రళయదినమున మీ మరలటం అన్నది ఒక్కడైన అల్లాహ్ వైపే జరుగును. మరియు ఏ విషయంలో నైతే విబేధించుకుంటున్నారో దాని గురించి ఆయన మీకు తొందరలోనే తెలియపరుస్తాడు. మరియు తొందరలోనే ఆయన మీరు ముందు పంపించుకున్న కర్మలకు మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే.

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి.

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (48) Sūra: Sūra Al-Ma’idah’
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti