Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Vertimų turinys


Reikšmių vertimas Aja (Korano eilutė): (158) Sūra: Sūra Al-A’raf
قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ جَمِیْعَا ١لَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ یُحْیٖ وَیُمِیْتُ ۪— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهِ النَّبِیِّ الْاُمِّیِّ الَّذِیْ یُؤْمِنُ بِاللّٰهِ وَكَلِمٰتِهٖ وَاتَّبِعُوْهُ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరి వైపు మీలో నుండి అరబ్బులకు,మీలో నుండి ఆరబేతరులకు అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తగా వచ్చాను. ఆయన ఒక్కడి కొరకే ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు ఆయన కొరకే భూమి పై సామ్రాజ్యాధికారము. పరిశుద్దుడైన ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. ఆయన మృతులను జీవింప జేస్తాడు. జీవించి ఉన్న వారికి మరణాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఓ ప్రజలారా మీరు అల్లాహ్ ను విశ్వసించండి. మరియు వ్రాయలేని,చదవలేని ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మీరు విశ్వసించండి. ఆయన వైపునకు దైవ వాణి ద్వారా ఆయన ప్రభువు తెలిపిన వాటిని మాత్రమే ఆయన తీసుకుని వచ్చారు,ఆయనే అల్లాహ్ ను విశ్వసిస్తున్నారు,ఆయన పై అవతరింప బడిన దానిని,ఆయన కన్న మునుపు ప్రవక్తలపై అవతరింపబడిన వాటిని ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసిస్తున్నారు. మరియు మీరు ఇహపర లోకాల్లో మీ శ్రేయస్సు ఉన్న దాని వైపు మీరు సన్మార్గం పొందుతారని ఆశిస్తు ఆయన తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో ఆయనని అనుసరించండి.
Tafsyrai arabų kalba:
Šiame puslapyje pateiktų ajų nauda:
• تضمَّنت التوراة والإنجيل أدلة ظاهرة على بعثة النبي محمد صلى الله عليه وسلم وعلى صدقه.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం,ఆయన నీతి గురించి ప్రత్యక్ష ఆధారాలు తౌరాతు,ఇంజీలులో కలవు.

• رحمة الله وسعت كل شيء، ولكن رحمة الله عباده ذات مراتب متفاوتة، تتفاوت بحسب الإيمان والعمل الصالح.
అల్లాహ్ కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉన్నది. కాని అల్లాహ్ కారుణ్యం దాసుల కొరకు వేరు వేరు స్థానాలు కలదై ఉంటుంది. విశ్వాసము,సత్కార్యాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది.

• الدعاء قد يكون مُجْملًا وقد يكون مُفَصَّلًا حسب الأحوال، وموسى في هذا المقام أجمل في دعائه.
సంధర్భాలను బట్టి దుఆ ఒక్కొక్కసారి సంక్షిప్తంగా ఉంటుంది,ఒక్కొక్కసారి వివరణగా ఉంటుంది. మరియు మూసా ఈ స్థానములో తన దుఆను అత్యంత సంక్షిప్తంగా చేసేవారు.

• من صور عدل الله عز وجل إنصافه للقِلَّة المؤمنة، حيث ذكر صفات بني إسرائيل المنافية للكمال المناقضة للهداية، فربما توهَّم متوهِّم أن هذا يعم جميعهم، فَذَكَر تعالى أن منهم طائفة مستقيمة هادية مهدية.
విశ్వాసపరులు తక్కువగా ఉన్నా అల్లాహ్ యొక్క న్యాయ వ్యవహారం ఉండటం అల్లాహ్ న్యాయ స్వరూపాల్లోంచిది. అయితే ఆయన సన్మార్గమును (హిదాయత్ ను) విచ్చిన్నం చేసే,పరిపూర్ణతను వ్యతిరేకించే ఇస్రాయీలు సంతతి వారి లక్షణాలను ప్రస్తావించాడు. సందేహపడేవాడు ఇది వారందరిలో ఉన్నదని సందేహ పడవచ్చు అందుకనే మహోన్నతుడైన అల్లాహ్ వారిలోంచి ఒక వర్గము సవ్యంగా,సన్మార్గము పై ఉన్నదని ప్రస్తావించాడు.

 
Reikšmių vertimas Aja (Korano eilutė): (158) Sūra: Sūra Al-A’raf
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Vertimų turinys

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uždaryti