Check out the new design

Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed * - Vertimų turinys

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Reikšmių vertimas Sūra: Al-Bakara   Aja (Korano eilutė):
لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا كَسَبَتْ قُلُوْبُكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ ۟
మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు[1].
[1] 'హలీమున్: The Fore-Bearing, Clement. సహనశీలుడు, ఓర్పు గలవాడు, సౌమ్యుడు, విశాల హృదయుడు, శిక్షించటంలో తొందరపడనివాడు. అల్ - 'హమీము, అర్ - రషీదు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 11:87.
Tafsyrai arabų kalba:
لِلَّذِیْنَ یُؤْلُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ تَرَبُّصُ اَرْبَعَةِ اَشْهُرٍ ۚ— فَاِنْ فَآءُوْ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము, అని) ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది[1]. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
[1] ఈలా: అంటే శపథం. ఏ వ్యక్తి అయినా తన భార్యతో ఇన్ని నెలలు కలువనని శపథం చేసి ఆ గడువు పూర్తి కాక ముందే ఆమెతో కలిస్తే కఫ్ఫారా చేయాలి. ఒకవేళ ఆ గడువు 4 నెలల కంటే ఎక్కువ ఉంటే - అతడు ఆమెను 4 నెలల కంటే ఎక్కువ కాలం వ్రేలాడ నివ్వలేడు కావున - నాలుగు నెలల తరువాత ఆమెతో ఆదరంగా దాంపత్య జీవితం సాగించాలి. లేదా ఆదరంగా సాగనంపాలి. (ఇబ్నె - కసీ'ర్).
Tafsyrai arabų kalba:
وَاِنْ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
కాని వారు విడాకులకే నిర్ణయించుకుంటే! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేనాడు, సర్వజ్ఞుడు.
Tafsyrai arabų kalba:
وَالْمُطَلَّقٰتُ یَتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍ ؕ— وَلَا یَحِلُّ لَهُنَّ اَنْ یَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِیْۤ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ یُؤْمِنَّ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِیْ ذٰلِكَ اِنْ اَرَادُوْۤا اِصْلَاحًا ؕ— وَلَهُنَّ مِثْلُ الَّذِیْ عَلَیْهِنَّ بِالْمَعْرُوْفِ ۪— وَلِلرِّجَالِ عَلَیْهِنَّ دَرَجَةٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి[1]. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు[2]. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి. ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది[3]. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
[1] ఈ శాసనం గర్భవతి అయిన స్త్రీకి వర్తించదు. వారి వేచి యుండే సమయం ('ఇద్దత్) కాన్పు వరకు ఉంటుంది. మరియు నికా'హ్ తరువాత సంభోగం కాని స్త్రీకి కూడా వర్తించదు. ఆమెకు 'ఇద్దత్ గడువు ఉండదు. మరియు ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీ మరియు ఋతుస్రావం ఆగిన స్త్రీకి కూడా వర్తించదు. వారి గడువు మూడు మాసాలు, (ఇబ్నె-కసీ'ర్). చూడండి, 65:1-7. ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. (2:234) [2] ఇక్కడ గర్భం మరియు ఋతుస్రావం రెండింటిని కూడా దాచ వద్దని అర్థం. [3] మగవారికి ఉన్న ఆధిక్యత, వారి శారీరక బలం, వారికున్న జిహాద్ అనుమతి, వారసత్వంలో ఆధిక్యత మరియు భార్యాపిల్లలను మరియు కుటుంబం వారిని పోషించే బాధ్యత మొదలైనవి.
Tafsyrai arabų kalba:
اَلطَّلَاقُ مَرَّتٰنِ ۪— فَاِمْسَاكٌ بِمَعْرُوْفٍ اَوْ تَسْرِیْحٌ بِاِحْسَانٍ ؕ— وَلَا یَحِلُّ لَكُمْ اَنْ تَاْخُذُوْا مِمَّاۤ اٰتَیْتُمُوْهُنَّ شَیْـًٔا اِلَّاۤ اَنْ یَّخَافَاۤ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— فَاِنْ خِفْتُمْ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ۙ— فَلَا جُنَاحَ عَلَیْهِمَا فِیْمَا افْتَدَتْ بِهٖ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَعْتَدُوْهَا ۚ— وَمَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి[1]. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు[2]. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు[3].
[1] భర్త తన భార్యను 'ఇద్దత్ గడువులోపల కేవలం రెండుసార్లు మాత్రమే తిరిగి స్వీకరించవచ్చు. అంటే మొదటిసారి ఇచ్చిన విడాకుల తరువాత మరియు రెండవసారి ఇచ్చిన విడాకుల తరువాత. మూడవసారి విడాకులిచ్చిన తరువాత 'ఇద్దత్ గడువులోపల భార్యను తిరిగి స్వీకరించే అనుమతి లేదు. 'అ'త్తలాఖు మర్రతాన్' దీని అర్థం ఏమిటంటే ఒకేసారి మూడు విడాకులు పూర్తికావు. అంటే ఒకే సమయంలో 'తలాఖ్ అని ఎన్నిసార్లు పలికినా అది ఒకే 'తలాఖ్ గా పరిగణించబడాలి. [2] స్త్రీ విడాకులు కోరితే, సమంజసమైన కారణం చూపి, పరిహారమిచ్చి లేక మహ్ర్ వాపసు ఇచ్చి, ఖుల'అ తీసుకోవచ్చు. న్యాయస్థానం ఈ విషయంలో ఆమెకు తోడ్పడుతుంది. పురుషుడు అంగీకరించని పక్షంలో న్యాయాధికారి స్త్రీ చూపిన కారణాలతో ఏకీభవిస్తే, వారి వివాహబంధాన్ని రద్దు చేయవచ్చు (అబూ - దావూద్, తిర్మిజీ', నసాయీ' - ఫ'త్హ అల్ - ఖదీర్). [3] 'స. బు'ఖారీ, పుస్తకం - 7, 'హదీస్' నం. 197.
Tafsyrai arabų kalba:
فَاِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنْ بَعْدُ حَتّٰی تَنْكِحَ زَوْجًا غَیْرَهٗ ؕ— فَاِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَیْهِمَاۤ اَنْ یَّتَرَاجَعَاۤ اِنْ ظَنَّاۤ اَنْ یُّقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ یُبَیِّنُهَا لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
ఒకవేళ అతడు (మూడవసారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు.
Tafsyrai arabų kalba:
 
Reikšmių vertimas Sūra: Al-Bakara
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed - Vertimų turinys

Išvertė Abdur-Rahim Bin Muchamed.

Uždaryti