Check out the new design

Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed * - Vertimų turinys

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Reikšmių vertimas Sūra: Al-Ma’idah’   Aja (Korano eilutė):
اُحِلَّ لَكُمْ صَیْدُ الْبَحْرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّكُمْ وَلِلسَّیَّارَةِ ۚ— وَحُرِّمَ عَلَیْكُمْ صَیْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం,[1] జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
[1] నీటి జంతువు మరణించినది కూడా 'హలాలే. చూడండి, ఇబ్నె-కసీ'ర్.
Tafsyrai arabų kalba:
جَعَلَ اللّٰهُ الْكَعْبَةَ الْبَیْتَ الْحَرَامَ قِیٰمًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْیَ وَالْقَلَآىِٕدَ ؕ— ذٰلِكَ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَاَنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు.[1] మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.
[1] క'అబహ్ ('హరమ్) సరిహద్దులలో - ఇ'హ్రాంలో ఉన్నా, లేకున్నా - వేటాడటం, జంతువులను చంపటం, చెట్లను నరుకటం నిషేధింపబడ్డాయి. చూడండి, 2:125.
Tafsyrai arabų kalba:
اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟ؕ
నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Tafsyrai arabų kalba:
مَا عَلَی الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ ۟
సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్ సందేశాలను) మీకు అందజేయటమే! మరియు మీరు వెలి బుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
Tafsyrai arabų kalba:
قُلْ لَّا یَسْتَوِی الْخَبِیْثُ وَالطَّیِّبُ وَلَوْ اَعْجَبَكَ كَثْرَةُ الْخَبِیْثِ ۚ— فَاتَّقُوا اللّٰهَ یٰۤاُولِی الْاَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟۠
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు మంచి వస్తువులు సరిసమానం కాజాలవు.[1] కావున ఓ బుద్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి."
[1] 'ఖబీస్': అంటే, అధర్మ, అపవిత్ర, చెడ్డ, నికృష్ట, అపరిశుద్ధ వస్తువులు, చేష్టలు, మాటలు, విషయాలు మొదలైనవి. 'తయ్యిబ్: అంటే ధర్మ, మంచి, పవిత్ర, ఉత్కృష్ట, శ్రేష్ట, పరిశుద్ధ వస్తువులు, చేష్టలు, మాటలు విషయాలు మొదలైనవి.
Tafsyrai arabų kalba:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَسْـَٔلُوْا عَنْ اَشْیَآءَ اِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ ۚ— وَاِنْ تَسْـَٔلُوْا عَنْهَا حِیْنَ یُنَزَّلُ الْقُرْاٰنُ تُبْدَ لَكُمْ ؕ— عَفَا اللّٰهُ عَنْهَا ؕ— وَاللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ ۟
ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచ బడవచ్చు! వాటి కొరకు (ఇంత వరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.
Tafsyrai arabų kalba:
قَدْ سَاَلَهَا قَوْمٌ مِّنْ قَبْلِكُمْ ثُمَّ اَصْبَحُوْا بِهَا كٰفِرِیْنَ ۟
వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు.[1]
[1] అబూ హురైరా (ర'ది.'అ.) కథనం: దైవప్రవక్త ('స'అస) తమ ప్రవచనంలో ఇలా అన్నారు:" 'హజ్ మీ కొరకు విధిగా నియమించబడింది." అపుడు ఒకతను (ర'ది.'అ) ప్రశ్నించాడు: "ప్రతి సంవత్సరామా?" దైవప్రవక్త ('స'అస) మౌనం వహించారు. ఆ వ్యక్తి మరీ రెండు సార్లు అదే ప్రశ్న అడిగాడు. దానికతను: "నేను అవును అంటే అది మీకు విధి అయ్యేది మరియు అది మీకు చేతనయ్యేది కాదు." ('స. ముస్లిం కితాబుల్ 'హజ్ 'హదీస్' నం. 412, దీనినే అ'హ్మద్, అబూ-దావూద్, నసాయీ' మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు). కావున ఖుర్ఆన్ లో ఉన్న ఆజ్ఞలను, ఉన్నవి ఉన్నట్లే పాటించాలి. ఏ విషయమైతే దానిలో పేర్కొనబడలేదో వాటిని గురించి మౌనం వహించటమే మేలు.
Tafsyrai arabų kalba:
مَا جَعَلَ اللّٰهُ مِنْ بَحِیْرَةٍ وَّلَا سَآىِٕبَةٍ وَّلَا وَصِیْلَةٍ وَّلَا حَامٍ ۙ— وَّلٰكِنَّ الَّذِیْنَ كَفَرُوْا یَفْتَرُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ ؕ— وَاَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ ۟
అల్లాహ్ బహీరహ్ ను గానీ, సాయిబహ్ ను గానీ, వసీలహ్ ను గానీ లేక హామ్ ను గానీ నియమించలేదు.[1] కాని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!
[1] ఇవి ముష్రిక్ ఖురైషులు తమ ఆడ ఒంటెలకు ఇచ్చిన పేర్లు. వాటిని వారు తమ దేవతలకు అర్పితం చేసి, వాటిని పనులకు, సవారీలకు ఉపయోగించకుండా, విచ్ఛలవిడిగా మేస్తూ తిరుగటానికి వదిలేవారు. ఇంకా చూడండి, 6:138-139, 143-144.
Tafsyrai arabų kalba:
 
Reikšmių vertimas Sūra: Al-Ma’idah’
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed - Vertimų turinys

Išvertė Abdur-Rahim Bin Muchamed.

Uždaryti