Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ   ആയത്ത്:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا تَدَایَنْتُمْ بِدَیْنٍ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی فَاكْتُبُوْهُ ؕ— وَلْیَكْتُبْ بَّیْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۪— وَلَا یَاْبَ كَاتِبٌ اَنْ یَّكْتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ فَلْیَكْتُبْ ۚ— وَلْیُمْلِلِ الَّذِیْ عَلَیْهِ الْحَقُّ وَلْیَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا یَبْخَسْ مِنْهُ شَیْـًٔا ؕ— فَاِنْ كَانَ الَّذِیْ عَلَیْهِ الْحَقُّ سَفِیْهًا اَوْ ضَعِیْفًا اَوْ لَا یَسْتَطِیْعُ اَنْ یُّمِلَّ هُوَ فَلْیُمْلِلْ وَلِیُّهٗ بِالْعَدْلِ ؕ— وَاسْتَشْهِدُوْا شَهِیْدَیْنِ مِنْ رِّجَالِكُمْ ۚ— فَاِنْ لَّمْ یَكُوْنَا رَجُلَیْنِ فَرَجُلٌ وَّامْرَاَتٰنِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَدَآءِ اَنْ تَضِلَّ اِحْدٰىهُمَا فَتُذَكِّرَ اِحْدٰىهُمَا الْاُخْرٰی ؕ— وَلَا یَاْبَ الشُّهَدَآءُ اِذَا مَا دُعُوْا ؕ— وَلَا تَسْـَٔمُوْۤا اَنْ تَكْتُبُوْهُ صَغِیْرًا اَوْ كَبِیْرًا اِلٰۤی اَجَلِهٖ ؕ— ذٰلِكُمْ اَقْسَطُ عِنْدَ اللّٰهِ وَاَقْوَمُ لِلشَّهَادَةِ وَاَدْنٰۤی اَلَّا تَرْتَابُوْۤا اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً حَاضِرَةً تُدِیْرُوْنَهَا بَیْنَكُمْ فَلَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَلَّا تَكْتُبُوْهَا ؕ— وَاَشْهِدُوْۤا اِذَا تَبَایَعْتُمْ ۪— وَلَا یُضَآرَّ كَاتِبٌ وَّلَا شَهِیْدٌ ؕ۬— وَاِنْ تَفْعَلُوْا فَاِنَّهٗ فُسُوْقٌ بِكُمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ ؕ— وَیُعَلِّمُكُمُ اللّٰهُ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! మీరు అప్పుతో కూడిన లావాదేవీలు చేసేటప్పుడు అంటే మీరు నిర్ణీత వ్యవధి కొరకు ఒకరికొకరు అప్పు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు, దాన్ని లిఖితరూపంలో వ్రాసుకోండి. వ్రాయటం వచ్చిన వ్యక్తి దానిని న్యాయంగా మరియు పవిత్రమైన అల్లాహ్ చట్టానికి అనుగుణంగా వ్రాయాలి. అంతేగాని అతడు న్యాయంగా వ్రాయటం గురించి అల్లాహ్ తనకు నేర్పించిన దాన్ని అనుసరిస్తూ, రుణపత్రం వ్రాయడానికి నిరాకరించకూడదు. హక్కుదారుడు నిర్దేశించిన దానిని అతను వ్రాయాలి. తద్వారా అది అతని సమ్మతిగా పని చేస్తుంది. ప్రతీది అల్లాహ్ గమనిస్తూ ఉంటాడనే సత్యాన్ని గుర్తు చేసుకుంటూ అతడు వ్రాయాలి మరియు రుణం విలువ లేదా వివరణలలో దేనినీ తగ్గించి వ్రాయకూడదు. ఒకవేళ అప్పు పుచ్చుకునేవాడికి లావాదేవీలు చేయడంలో అనుభవం లేకపోయినా, తక్కువ వయస్సు వాడైనా, మతిస్థిమితం లేని వాడైనా, మూగతనం లేదా వేరే ఇతర కారణాల వల్ల చెప్పి వ్రాయించుకోవటం కుదరకపోతే, అతడి తరుపున అతడి అధికార సంరక్షకుడు దానిని న్యాయబద్ధంగా చెప్పి వ్రాయించాలి. అలాగే, ఇద్దరు బుద్ధిమంతులు మరియు సత్పురుషులను సాక్ష్యం కోసం పిలవాలి. ఇద్దరు పురుషులు లభించకపోతే, వారి ధర్మం మరియు నిజాయితీతో మీరు సంతృప్తి చెందిన ఒక మగ మరియు ఇద్దరు స్త్రీలను పిలవాలి. తద్వారా స్త్రీలలో ఒకరు మర్చిపోతే, మరొకరు ఆమెకు గుర్తు చేయవచ్చు. సాక్షులు ఈ రుణం విషయంలో సాక్షులుగా ఉండటానికి నిరాకరించకూడదు. అవసరమైనప్పుడు వారు తప్పనిసరిగా సాక్ష్యమివ్వాలి. ఎంత చిన్న మొత్తమైనా సరే. అప్పు పత్రం వ్రాయడాన్ని తేలిగ్గా తీసుకో వద్దు. ఎందుకంటే ఇది అల్లాహ్ చట్టంలో ఎంతో న్యాయమైనది. సముచితమైన సాక్ష్యాధారాలతో ఎంతో విశ్వసనీయమైనది. ఇంకా తరువాత కాలంలో అప్పు రకం, మొత్తం లేదా వ్యవధిలో ఏవైనా సందేహాలు వస్తే, వాటిని సులభంగా తొలగించే అవకాశం కల్పిస్తుంది. ఏదేమైనా, మంచి ధరకు బదులుగా ఒక వస్తువు మార్పిడి చేసుకోవడం వంటి లావాదేవీ అయితే, దానిని వ్రాయక పోవడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. ఎందుకంటే అలా చేయవలసిన అవసరం లేదు. వివాదాలు తలెత్తకుండా సాక్షులను పిలవడం అనేది చట్టబద్ధమైన చర్యయే. సాక్షులకు లేదా వ్రాసే వానికి ఏదైనా హాని కలిగించడం చట్టబద్ధం కాదు; రుణపత్రం వ్రాయమని లేదా సాక్షిగా నిలబడమని అభ్యర్థించిన వారికీ ఎలాంటి హానీ కలిగించకూడదు. ఒకవేళ ఎవరైనా వారికి హాని కలిగించినట్లయితే, అతను అల్లాహ్ యొక్క పవిత్రమైన చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడవుతాడు. ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఆజ్ఞలను నెరవేర్చడం మరియు ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం ద్వారా ఆయన ఉనికిని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇహపరలోకాలలో మీ కొరకు ఏది ఉత్తమమో అల్లాహ్ మీకు బోధిస్తాడు. అల్లాహ్ అన్నీ ఎరుగును మరియు ఆయన నుండి ఏమీ దాగదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• وجوب تسمية الأجل في جميع المداينات وأنواع الإجارات.
తరువాత ఎదురయ్యో అసమ్మతులు లేదా వివాదాలను నివారించడానికి అప్పులు మరియు అన్నీ వాణిజ్య లావాదేవీలను నమోదు చేసుకోవటం ధర్మబద్ధం చేయబడినది.

మతిస్థిమితం, మానసిక బలహీనత లేదా తక్కువ వయస్సు కారణంగా తమ వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేని వారి విషయంలో అల్లాహ్ యొక్క పవిత్ర చట్టం సంరక్షకత్వాన్ని ఆదేశిస్తుంది.

అప్పులు మరియు హక్కులను గుర్తించడానికి సాక్షులను ఏర్పాటు చేయటం ధర్మబద్ధం చేయబడినది.

లావాదేవీకి సంబంధించిన సరైన పదాలు మరియు వాక్యాలను ఉపయోగించడం ఉత్తమమైన మరియు అత్యంత సరైన మార్గం.

రుణపత్రం వ్రాస్తున్నప్పుడు దాని హక్కులను కలిగి ఉన్నవారు లేదా వాటిని రికార్డ్ చేస్తున్నవారు లేదా సాక్ష్యుల ద్వారా అప్పులు మరియు హక్కులను నమోదు చేసేటప్పుడు ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదు.

 
പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർകസ് തഫ്സീർ പുറത്തിറക്കിയത്.

അടക്കുക