Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: ശ്ശുഅറാഅ്   ആയത്ത്:
وَاتَّقُوا الَّذِیْ خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْاَوَّلِیْنَ ۟ؕ
ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో మరియు పూర్వ సమాజాలను సృష్టించాడో ఆయన మీపై తన శిక్షను అవతరింపజేస్తాడని ఆయనతో భయముతో భీతిని కలిగి ఉండండి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۙ
షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా ఫలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలము సంభవించిన వారిలోంచి వాడివి చివరికి మంత్రజాలము నీ బుద్ధిని వశపరచుకుని దాన్ని పోగొట్టింది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا وَاِنْ نَّظُنُّكَ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۚ
మరియు నీవు మాత్రం మాలాంటి మనిషివి మాత్రమే నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు నీవు ఎలా ప్రవక్తవవుతావు ?. నీవు ప్రవక్తవని వాదిస్తున్న విషయంలో నిన్ను అసత్యడువని మేము భావిస్తున్నాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاَسْقِطْ عَلَیْنَا كِسَفًا مِّنَ السَّمَآءِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟ؕ
నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ సత్యవంతుడివి అయితే ఆకాశము నుండి ఒక తునకను మాపై పడవేయి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قَالَ رَبِّیْۤ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ ۟
షుఐబ్ వారితో ఇలా పలికారు : మీరు చేస్తున్న షిర్కు ,పాపకార్యాల గురించి మా ప్రభువుకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَكَذَّبُوْهُ فَاَخَذَهُمْ عَذَابُ یَوْمِ الظُّلَّةِ ؕ— اِنَّهٗ كَانَ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
అయితే వారు తమ తిరస్కారముపైనే కొనసాగారు. అప్పుడు వారికి పెద్ద శిక్ష తీవ్ర వేడి కల దినము తరువాత ఒక మేఘము వారిని నీడ నిచ్చేటట్లు చుట్టుకుంది. అప్పుడు అది వారిపై అగ్నిని కురిపించి వారిని కాల్చివేసింది. నిశ్ఛయంగా వారి వినాశనము యొక్క దినము పెద్ద భయంకర దినమైనది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన షుఐబ్ అలైహిస్సలాం జాతి వారి వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِنَّهٗ لَتَنْزِیْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
نَزَلَ بِهِ الرُّوْحُ الْاَمِیْنُ ۟ۙ
దీన్ని విశ్వసనీయుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని దిగారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
عَلٰی قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా అతడు దాన్ని తీసుకుని నీ హృదయంపై నీవు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించే, వారిని భయపెట్టే ప్రవక్తల్లోంచి అవటానికి దిగాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
بِلِسَانٍ عَرَبِیٍّ مُّبِیْنٍ ۟ؕ
అతడు దాన్ని స్పష్టమైన అరబీ భాషలో తీసుకుని దిగాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِنَّهٗ لَفِیْ زُبُرِ الْاَوَّلِیْنَ ۟
మరియు నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ పూర్వ గ్రంధాలలో ప్రస్తావించబడినది. నిశ్ఛయంగా పూర్వ దివ్య గ్రంధాలు దీని గురించి శుభవార్తను ఇచ్చినవి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَوَلَمْ یَكُنْ لَّهُمْ اٰیَةً اَنْ یَّعْلَمَهٗ عُلَمٰٓؤُا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
ఏమీ అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి ఇస్రాయీలు సంతతి వారి పండితులకు సయితం మీపై అవతరింపబడిన దాని వాస్తవికత తెలిసి ఉండటం మీ నిజాయితీపై ఒక సూచనగా మిమ్మల్ని తిరస్కరించే వీరందరికి సరిపోదా ?.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَوْ نَزَّلْنٰهُ عَلٰی بَعْضِ الْاَعْجَمِیْنَ ۟ۙ
మరియు ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబీ మట్లాడలేని అరబ్బేతరుల్లోంచి కొందరిపై అవతరింపజేసి ఉంటే.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَقَرَاَهٗ عَلَیْهِمْ مَّا كَانُوْا بِهٖ مُؤْمِنِیْنَ ۟ؕ
అప్పుడు అతను దాన్ని వారికి చదివి వినిపించినా వారు దాన్ని విస్వసించేవారు కాదు; ఎందుకంటే వారు మాకు అది అర్ధం కాలేదు అంటారు. కావున వారు అది వారి భాషలో అవతరింపబడినది కాబట్టి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
كَذٰلِكَ سَلَكْنٰهُ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ؕ
ఈ విధంగా మేము తిరస్కారమును,అవిశ్వాసమును అపరాధుల హృదయాలలో ప్రవేశింపజేశాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
لَا یُؤْمِنُوْنَ بِهٖ حَتّٰی یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ ۟ۙ
వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు తాము ఉన్న అవిశ్వాసము నుండి మారరు,విశ్వసించరు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَیَاْتِیَهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ
అప్పుడు ఈ శిక్ష వారి వద్దకు అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. వారి వద్దకు అది అకస్మాత్తుగా వచ్చేంతవరకు దాని రావటమును వారు గుర్తించరు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَیَقُوْلُوْا هَلْ نَحْنُ مُنْظَرُوْنَ ۟ؕ
వారిపై శిక్ష అకస్మాత్తుగా అవతరించినప్పుడు వారు తీవ్ర బాధతో ఇలా పలుకుతారు : మేము అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడటానికి మాకు గడువు ఇవ్వబడుతుందా ?!.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَفَبِعَذَابِنَا یَسْتَعْجِلُوْنَ ۟
ఏమి ఈ తిరస్కారులందరు మా శిక్ష గురించి ఇలా పలుకుతూ తొందర చేస్తున్నారా : నీవు మాపై వాదించినట్లు ఆకాశము ఏదైన తునకమును పడవేసేనంత వరకు మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము ?!
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَفَرَءَیْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు నాకు తెలపండి ఒక వేళ మేము మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటము నుండి విముఖత చూపే ఈ అవిశ్వాసపరులందరికి కొంత కాలము అనుగ్రహాల ద్వారా ప్రయోజనం చేకూర్చినా.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ثُمَّ جَآءَهُمْ مَّا كَانُوْا یُوْعَدُوْنَ ۟ۙ
ఆ తరువాత వారు ఈ అనుగ్రహాలను పొందిన కాలం తరువాత వారితో వాగ్దానం చేయబడిన శిక్ష వారి వద్దకు వచ్చినది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• كلما تعمَّق المسلم في اللغة العربية، كان أقدر على فهم القرآن.
ఎప్పుడెప్పుడైతే ముస్లిము అరబీ భాష లోతులోకి వెళ్తాడో అతడు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యమును కలిగి ఉంటాడు.

• الاحتجاج على المشركين بما عند المُنْصِفين من أهل الكتاب من الإقرار بأن القرآن من عند الله.
గ్రంధవహుల్లోంచి న్యాయపరుల వద్ద ఉన్న ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అనటంపై అంగీకారము ద్వారా ముష్రికులకు వ్యతిరేకంగా వాదించటం.

• ما يناله الكفار من نعم الدنيا استدراج لا كرامة.
అవిశ్వాసపరులు ఏవైతే ప్రాపంచిక అనుగ్రహాలు పొందారో అవి ఒక ఎర మాత్రమే గౌరవం కాదు.

 
പരിഭാഷ അദ്ധ്യായം: ശ്ശുഅറാഅ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക