Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: സ്സബഅ്   ആയത്ത്:
قُلْ جَآءَ الْحَقُّ وَمَا یُبْدِئُ الْبَاطِلُ وَمَا یُعِیْدُ ۟
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సత్యం వచ్చినది అదే ఇస్లాం. మరియు ఎటువంటి ప్రభావం లేదా శక్తి కనిపించని అసత్యం తొలగిపోయింది. మరియు అది తన ప్రభావం చూపే వైపునకు మరలదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قُلْ اِنْ ضَلَلْتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰی نَفْسِیْ ۚ— وَاِنِ اهْتَدَیْتُ فَبِمَا یُوْحِیْۤ اِلَیَّ رَبِّیْ ؕ— اِنَّهٗ سَمِیْعٌ قَرِیْبٌ ۟
ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ నేను మీకు చేరవేస్తున్న సందేశముల విషయంలో సత్యము నుండి తప్పిపోతే నేను తప్పిన దాని నష్టం నాకు మాత్రమే. అందులో నుంచి ఏదీ మీకు చేరదు. మరియు ఒక వేళ నేను దాని వైపునకు (సత్యం వైపునకు) సన్మార్గం పొందితే అది కేవలం పరిశుద్ధుడైన నా ప్రభువు నాకు దైవవాణి ద్వారా తెలపటంవలనే. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను బాగా వినేవాడు. నేను ఏమి చెబుతానో అది ఆయన వినకుండా ఉండడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَوْ تَرٰۤی اِذْ فَزِعُوْا فَلَا فَوْتَ وَاُخِذُوْا مِنْ مَّكَانٍ قَرِیْبٍ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ తిరస్కారులందరు ప్రళయదినాన శిక్షను కళ్ళారా చూసినప్పుడు భయకంపితులైనప్పుడు చూస్తే (ఎంత బాగుండేది). వారి కొరకు దాని నుండి పారిపోయే ప్రదేశముండదు. మరియు శరణం తీసుకోవటానికి ఎటువంటి శరణాలయం ఉండదు. మరియు వారు దగ్గర ప్రదేశము నుండి అందరికన్న ముందు శులభంగా పట్టుకోబడుతారు. ఒక వేళ మీరు దాన్ని చూస్తే మీరు ఆశ్ఛర్యకరమైన విషయాన్ని చూస్తారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَّقَالُوْۤا اٰمَنَّا بِهٖ ۚ— وَاَنّٰی لَهُمُ التَّنَاوُشُ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟ۚ
మరియు వారు తమ పరిణామమును చూసినప్పుడు మేము ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తాము అంటారు. విశ్వాసమును పట్టుకోవటం,దాన్ని పొందటం వారికి ఎలా సాధ్యమవుతుంది. వాస్తవానికి వారు ప్రతిఫల నివాసము కాకుండా ఆచరణలు చేసే నివాసమైన ఇహలోక నివాసము నుండి ఆచరణల నివాసము కాకుండా ప్రతిఫల నివాసమైన పరలోక నివాసము వైపునకు వారి వైదొలగటం వలన వారి నుండి విశ్వాసము స్వీకరించబడే ప్రదేశము దూరమైపోయింది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَقَدْ كَفَرُوْا بِهٖ مِنْ قَبْلُ ۚ— وَیَقْذِفُوْنَ بِالْغَیْبِ مِنْ مَّكَانٍ بَعِیْدٍ ۟
మరియు ఎలా వారి నుండి విశ్వాసము లభిస్తుంది మరియు అది స్వీకరించబడుతుంది. వాస్తవానికి వారు దాన్నిఇహలోక జీవితంలోనే తిరస్కరించారు. మరియు వారు సత్యమును పొందటం నుండి దూరం నుండి అనుమానంతో విసురుతున్నారు. ఏవిధంగానైతే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఆయన మంత్రజాలకుడు,జోతిష్యుడు,కవి అని పలికేవారో.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَحِیْلَ بَیْنَهُمْ وَبَیْنَ مَا یَشْتَهُوْنَ كَمَا فُعِلَ بِاَشْیَاعِهِمْ مِّنْ قَبْلُ ؕ— اِنَّهُمْ كَانُوْا فِیْ شَكٍّ مُّرِیْبٍ ۟۠
ఈ తిరస్కారులందరు తాము కోరుకున్న జీవిత సుఖాలు పొందకుండా,అవిశ్వాసము నుండి పశ్చాత్తాపముపడటం నుండి,నరకాగ్ని నుండి విముక్తి పొందటం నుండి ,ఇహలోక జీవితం వైపునకు మరలటం నుండి ఆపబడ్డారు. వారి కన్న మనుపటి తిరస్కార జాతుల వారి విధంగా వ్యవహరించబడినట్లు. నిశ్చయంగా వారు కూడా ప్రవక్తలు తీసుకుని వచ్చిన అల్లాహ్ తౌహీద్ గురించి,మరణాంతరం లేపబడటంపై విశ్వాసం గురించి సందేహములో పడి ఉండేవారు. అవిశ్వాసంపై పురిగొల్పే సందేహంలో.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• مشهد فزع الكفار يوم القيامة مشهد عظيم.
ప్రళయ దినాన అవిశ్వాసపరులు భయాందోళనకు గురయ్యే ధృశ్యం ఘోరమైన ధృశ్యం.

• محل نفع الإيمان في الدنيا؛ لأنها هي دار العمل.
విశ్వాసమునకు ప్రయోజనకరమైన ప్రదేశం ఇహలోకంలో ఉన్నది ఎందుకంటే అది ఆచరణ గృహము.

• عظم خلق الملائكة يدل على عظمة خالقهم سبحانه.
దైవదూతల సృష్టి గొప్పతనము వాటి సృష్టికర్త సుబహానహు వతఆలా యొక్క గొప్పతనమును సూచిస్తుంది.

 
പരിഭാഷ അദ്ധ്യായം: സ്സബഅ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക