വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (20) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
وَاِنْ اَرَدْتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ ۙ— وَّاٰتَیْتُمْ اِحْدٰىهُنَّ قِنْطَارًا فَلَا تَاْخُذُوْا مِنْهُ شَیْـًٔا ؕ— اَتَاْخُذُوْنَهٗ بُهْتَانًا وَّاِثْمًا مُّبِیْنًا ۟
మరియు ఓ భర్తల్లారా ఒక వేళ మీరు భార్యను విడాకులిచ్చి ఆమె స్థానంలో వేరొకరితో వివాహం చేయదలచుకుంటే అందులో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు ఒక వేళ ఏ స్త్రీ నుండి విడిపోవాలని దృఢ నిర్ణయం చేసుకున్నారో ఆమెకు మీరు మహర్ గా అధిక ధన రాశి ఇచ్చి ఉంటే దాని నుండి ఏమియు తీసుకోవటం మీకు సమ్మతం కాదు. నిశ్చయంగా మీరు వారికి ఇచ్చి ఉన్న దాన్ని తీసుకోవటం స్పష్టమైన అపనింద మరియు స్పష్టమైన పాపము అగును.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• إذا دخل الرجل بامرأته فقد ثبت مهرها، ولا يجوز له التعدي عليه أو الطمع فيه، حتى لو أراد فراقها وطلاقها.
ఒక వ్యక్తి తన భార్యతో సంభోగము చేసినప్పుడు ఆమె మహర్ అనివార్యమైపోతుంది. మరియు అతను ఆమెను వేరు చేసి విడాకులు తీసుకోవాలనుకున్నా దాన్ని (మహర్ ని) అతిక్రమించటం లేదా దానిలో అత్యాశ కలిగి ఉండటం అతనికి సమ్మతం కాదు.

• حرم الله تعالى نكاح زوجات الآباء؛ لأنه فاحشة تمقتها العقول الصحيحة والفطر السليمة.
అల్లాహ్ తఆలా తండ్రుల భార్యలతో వివాహమును నిషేధించాడు. ఎందుకంటే అది సరైన మనస్సులు మరియు సురక్షితమైన స్వభావములు అసహ్యించుకునే అశ్లీలమైనది.

• بين الله تعالى بيانًا مفصلًا من يحل نكاحه من النساء ومن يحرم، سواء أكان بسبب النسب أو المصاهرة أو الرضاع؛ تعظيمًا لشأن الأعراض، وصيانة لها من الاعتداء.
మహోన్నతుడైన అల్లాహ్ స్త్రీల్లోంచి ఎవరితో వివాహం చేయటం సమ్మతమో ఎవరితో నిషిద్ధమో క్లుప్తంగా స్పష్టపరిచాడు అది వంశం,వివాహం లేదా తల్లిపాలివ్వటం వల్ల కావచ్చు. ఆమెకు గౌరవంగా మరియు ఆమెను దుర్వినియోగం నుండి రక్షించడానికి.

 
പരിഭാഷ ആയത്ത്: (20) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

അടക്കുക