വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ ആയത്ത്: (92) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
وَمَا كَانَ لِمُؤْمِنٍ اَنْ یَّقْتُلَ مُؤْمِنًا اِلَّا خَطَأً ۚ— وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَّدِیَةٌ مُّسَلَّمَةٌ اِلٰۤی اَهْلِهٖۤ اِلَّاۤ اَنْ یَّصَّدَّقُوْا ؕ— فَاِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ؕ— وَاِنْ كَانَ مِنْ قَوْمٍ بَیْنَكُمْ وَبَیْنَهُمْ مِّیْثَاقٌ فَدِیَةٌ مُّسَلَّمَةٌ اِلٰۤی اَهْلِهٖ وَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ ؗ— تَوْبَةً مِّنَ اللّٰهِ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟
మరియు ఒక విశ్వాసిని సంహరించటం ఇంకొక విశ్వాసికి తగదు. కాని అది అతని నుండి పొరపాటున జరిగితే తప్ప. మరియు ఎవరైతే ఒక విశ్వాసిని పొరపాటున సంహరిస్తారో తన చర్య వలన అతడు ఒక విశ్వాస బానిసను పరిహారంగా విడుదల చేయటం అతనిపై అనివార్యము. మరియు హంతకుని వారసులైన అతని దగ్గరి బంధువులపై హతుడి వారసులకు రక్తపరిహారం ఇవ్వటం తప్పనిసరి. కాని వారు రక్తపరిహారమును మన్నించి వేస్తే ఆ ఆదేశం తొలగిపోతుంది. ఒక వేళ హతుడు మీతో పోరాడేవారి జాతి నుండి అయి,విశ్వాసపరుడైతే అప్పుడు హంతకునిపై ఒక విశ్వాసపర బానిసను విడుదల చేయటం తప్పనిసరి. మరియు అతనిపై రక్తపరిహారం ఉండదు. మరియు ఒక వేళ హతుడు విశ్వాసపరుడు కాకుండా ఉంటే,కాని అతడు జిమ్మీల వలె మీకు వారికి మధ్య ఒప్పందం ఉన్న వారికి చెందినవాడైతే అప్పుడు హంతకుని వారసులైన అతని దగ్గరి బంధువులపై హతుడి వారసులకు రక్తపరిహారం ఇవ్వటం తప్పనిసరి. మరియు హంతకుడిపై అతని చర్య వలన పరిహారంగా ఒక విశ్వాసపర బానిసను విడుదల చేయటం తప్పనిసరి. ఒక వేళ అతడు తాను విడుదల చేయవలసిన బానిసను పొందకపోతే లేదా దాని వెలను తీర్చలేకపోతే అతడు రెండు నెలల ఉపవాసములు నిరంతరం,అంతరాయం లేకుండా ఉండాలి. వాటిని మధ్యలో వదలకూడదు. అతను పాల్పడిన దాన్ని అల్లాహ్ మన్నించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల కర్మల గురించి వారి సంకల్పాల గురించి బాగా తెలిసినవాడు మరియు తన శాసనంలో,నిర్వహణలో విజ్ఞత కలవాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• جاء القرآن الكريم معظِّمًا حرمة نفس المؤمن، وناهيًا عن انتهاكها، ومرتبًا على ذلك أشد العقوبات.
విశ్వాసపరుని మానమర్యాదలను గౌరవపరుస్తూ,వాటిని అగౌరవపరచటం నుండి వారిస్తూ,అలా పాల్పడటంపై తీవ్రమైన శిక్షలను ఏర్పరుస్తూ దివ్యఖుర్ఆన్ వచ్చినది.

• من عقيدة أهل السُّنَّة والجماعة أن المؤمن القاتل لا يُخلَّد أبدًا في النار، وإنما يُعذَّب فيها مدة طويلة ثم يخرج منها برحمة الله تعالى.
అహ్లె సున్నత్ వల్ జమాఅత్ విశ్వాసాల్లోంచి ఏమిటంటే హంతకుడు విశ్వాసపరుడైతే అతడు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండడు. అతడు అందులో పెద్ద సమయం వరకు శిక్షించబడతాడు,ఆ పిదప అల్లాహ్ తఆలా కారుణ్యముతో దాని నుండి బయటకు వస్తాడు.

• وجوب التثبت والتبيُّن في الجهاد، وعدم الاستعجال في الحكم على الناس حتى لا يُعتدى على البريء.
ధర్మపోరాటంలో నిలకడగా ఉండటం మరియు స్పష్టపరచటం తప్పనిసరి. మరియు అమాయకులపై దాడి చేయకుండా ఉండటానికి ప్రజలపై తీర్పునివ్వటంలో తొందర చేయకుండా ఉండటం.

 
പരിഭാഷ ആയത്ത്: (92) അദ്ധ്യായം: സൂറത്തുന്നിസാഅ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

അടക്കുക