Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: സ്സുഖ്റുഫ്   ആയത്ത്:
اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ عَذَابِ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ
నిశ్చయంగా అవిశ్వాసము,పాపాలకు పాల్పడిన అపరాదులు ప్రళయదినమున నరకము యొక్క శిక్షలో ఉంటారు,అందులో శాశ్వతంగా నివాసముంటారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
لَا یُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۟ۚ
వారి నుండి శిక్షను తేలికచేయబడదు. మరియు వారు అందులో అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ్యులై ఉంటారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمَا ظَلَمْنٰهُمْ وَلٰكِنْ كَانُوْا هُمُ الظّٰلِمِیْنَ ۟
మేము వారిని నరకంలో ప్రవేశింపజేసినప్పుడు వారికి అన్యాయం చేయలేదు. మరియు కాని వారే అవిశ్వాసముతో తమ స్వయమునకు అన్యాయం చేసుకున్నారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَنَادَوْا یٰمٰلِكُ لِیَقْضِ عَلَیْنَا رَبُّكَ ؕ— قَالَ اِنَّكُمْ مّٰكِثُوْنَ ۟
మరియు వారు నరకాగ్ని రక్షక భటుడైన మాలిక్ తో ఇలా పలుకుతూ పిలుస్తారు : ఓ మాలిక్ మేము శిక్ష నుండి ఉపశమనం పొందటానికి ని ప్రభువు మాకు మరణమును ప్రసాదించాలి. అప్పుడు మాలిక్ వారికి తన మాటలో ఇలా సమాధానమిస్తాడు : నిశ్చయంగా మీరు శిక్షలో శాశ్వతంగా నివాసముంటారు. మీరు మరణించరు మరియు మీ నుండి శిక్ష అంతమవదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
لَقَدْ جِئْنٰكُمْ بِالْحَقِّ وَلٰكِنَّ اَكْثَرَكُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟
నిశ్ఛయంగా మేము ఇహలోకంలో ఎటువంటి సందేహం లేని సత్యమును మీ వద్దకు తీసుకుని వచ్చాము. కానీ మీలోని చాలామంది సత్యమును అసహ్యించుకునేవారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَ ۟ۚ
ఒక వేళ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మోసం చేసి ఆయన కొరకు ఏదైన కుట్రను సిద్ధం చేస్తే నిశ్చయంగా మేము వారి కుట్రకు మించిన ఏదైన వ్యూహమును వారి కొరకు నిర్ణయిస్తాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَمْ یَحْسَبُوْنَ اَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوٰىهُمْ ؕ— بَلٰی وَرُسُلُنَا لَدَیْهِمْ یَكْتُبُوْنَ ۟
లేదా వారు తమ హృదయములలో దాచిన వారి రహస్యమును లేదా వారు చాటుగా మాట్లాడుకునే వారి రహస్యమును మేము వినమని వారు భావిస్తున్నారా. ఎందుకు కాదు నిశ్చయంగా మేము వాటన్నింటిని వింటున్నాము. మరియు దైవదూతలు వారి వద్ద ఉండి వారు చేసే వాటన్నింటిని వ్రాస్తున్నారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
قُلْ اِنْ كَانَ لِلرَّحْمٰنِ وَلَدٌ ۖۗ— فَاَنَا اَوَّلُ الْعٰبِدِیْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ కొరకు కుమార్తెలను అపాదించే వారితో - అల్లాహ్ వారి మాటల నుండి గొప్ప మహోన్నతుడు - ఇలా పలకండి : అల్లాహ్ కొరకు ఎటువంటి సంతానము ఉంటే - ఆయన దాని నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు - మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన చేసి,ఆయన పరిశుద్ధతను కొనియాడే వారిలో నుంచి నేను ఆరాధన చేసే వారిలో మొదటివాడినయ్యేవాడిని.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
سُبْحٰنَ رَبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ ۟
భూమ్యాకాశముల ప్రభువు మరియు అర్ష్ (సామ్రాజ్య పీఠమునకు) ప్రభువు ఈ ముష్రుకులందరు ఆయనకు భాగస్వామ్యం,భార్య,సంతానమును అంటగడుతూ పలుకుతున్న మాటల నుండి అతీతుడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَذَرْهُمْ یَخُوْضُوْا وَیَلْعَبُوْا حَتّٰی یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۟
ఓ ప్రవక్తా వారు మునిగి ఉండి,ఆడుకుంటున్న అసత్యములోనే వారిని మీరు వదిలివేయండి చివరికి వారు తమతో వాగ్దానం చేయబడుతున్న తమ దినమును పొందుతారు. అది ప్రళయదినము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَهُوَ الَّذِیْ فِی السَّمَآءِ اِلٰهٌ وَّفِی الْاَرْضِ اِلٰهٌ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయనే ఆకాశములో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే భూమిలో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు,తన దాసుల పరిస్థితులను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَتَبٰرَكَ الَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۚ— وَعِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క మేలు,ఆయన ఆశీర్వాదము అధికమగును. ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూమి యొక్క సామ్రాజ్యాధికారము,ఆ రెండింటి మధ్య ఉన్నవాటి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన ఆయనకే చెందుతుంది. మరియు ప్రళయం సంభవించే ఘడియ యొక్క జ్ఞానము ఆయన ఒక్కడి వద్దనే ఉన్నది. అది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. పరలోకములో లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ఇవ్వబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَا یَمْلِكُ الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهِ الشَّفَاعَةَ اِلَّا مَنْ شَهِدَ بِالْحَقِّ وَهُمْ یَعْلَمُوْنَ ۟
ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న వారికి అల్లాహ్ వద్ద సిఫారసు చేసే అధికారము లేదు. కాని అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడని సాక్ష్యం పలికే వారికి ఉంది. అతడు ఏమి సాక్ష్యం పలికాడో అల్లాహ్ కి తెలుసు. ఉదాహరణకి ఈసా,ఉజైర్,దైవదూతలు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَهُمْ لَیَقُوْلُنَّ اللّٰهُ فَاَنّٰی یُؤْفَكُوْنَ ۟ۙ
మరియు ఒక వేళ మీరు వారిని మిమ్మల్ని సృష్టించినది ఎవరు ? అని అడిగితే వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : మమ్మల్ని అల్లాహ్ సృష్టించాడు. అటువంటప్పుడు వీరు ఈ అంగీకారము తరువాత ఎలా ఆయన ఆరాధన నుండి మరలించబడుతున్నారు ?.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَقِیْلِهٖ یٰرَبِّ اِنَّ هٰۤؤُلَآءِ قَوْمٌ لَّا یُؤْمِنُوْنَ ۟ۘ
మరియు పరిశుద్ధుడైన ఆయన వద్ద తన ప్రవక్త యొక్క అతని జాతి వారి తిరస్కారము గురించి ఫిర్యాదు యొక్క మరియు ఆ విషయంలో "ఈ జాతి వారందరు నీవు వారి వద్దకు నాకు ఇచ్చి పంపించిన దాన్ని విశ్వసించరు" అని ఆయన అన్న మాట యొక్క జ్ఞానము ఉన్నది.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلٰمٌ ؕ— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟۠
కావున నీవు వారి నుండి విముఖత చూపి, వారి చెడును తొలగించే మాటను వారి కొరకు పలుకు - ఇది మక్కాలో అయ్యింది - అయితే వారు తొందరలోనే వారు ఎదుర్కొనే శిక్షను తెలుసుకుంటారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• كراهة الحق خطر عظيم.
సత్యమును అసహ్యించుకోవటం పెద్ద ప్రమాదము.

• مكر الكافرين يعود عليهم ولو بعد حين.
అవిశ్వాసపరుల కుట్ర వారిపైకే మరలుతుంది. అది కొంత కాలం తరువాత అయినా సరే.

• كلما ازداد علم العبد بربه، ازداد ثقة بربه وتسليمًا لشرعه.
దాసునికి తన ప్రభువు పట్ల జ్ఞానం పెరిగినప్పుడల్లా తన ప్రభువుపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆయన ధర్మము కొరకు అంగీకారము పెరుగుతుంది.

• اختصاص الله بعلم وقت الساعة.
ప్రళయము యొక్క సమయ జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము.

 
പരിഭാഷ അദ്ധ്യായം: സ്സുഖ്റുഫ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തഫ്സീറുൽ മുഖ്തസർ തെലുങ്ക് പരിഭാഷ - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർകസ് തഫ്സീർ പുറത്തിറക്കിയത്.

അടക്കുക