Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: അൻആം   ആയത്ത്:
وَلَوْ اَنَّنَا نَزَّلْنَاۤ اِلَیْهِمُ الْمَلٰٓىِٕكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتٰی وَحَشَرْنَا عَلَیْهِمْ كُلَّ شَیْءٍ قُبُلًا مَّا كَانُوْا لِیُؤْمِنُوْۤا اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ وَلٰكِنَّ اَكْثَرَهُمْ یَجْهَلُوْنَ ۟
ఒక వేళ మేము వారు ప్రతిపాదించిన దానిని తీసుకుని వచ్చి వారి కోరికను స్వీకరిస్తే వారిపై దైవదూతలను అవతరింపజేస్తాము. అప్పుడు వారు వారిని తమ కళ్ళారా చూస్తారు. మృతులు వారితో మాట్లాడుతారు. మీరు తీసుకుని వచ్చిన దానిలో మీ నిజాయితి గురించి వారికి వారు తెలియజేస్తారు. వారు ప్రతిపాదించిన ప్రతి వస్తువును వారి కొరకు మేము సమీకరిస్తాము. వారు దానిని తమ ముందట పొందుతారు. వారిలోంచి అల్లాహ్ ఎవరి కొరకు సన్మార్గం కోరుకుంటారో వారు మాత్రమే మీరు తీసుకుని వచ్చిన దానిని విశ్వసిస్తారు. కాని వారిలోంచి చాలా మందికి దాని గురించి జ్ఞానం లేదు. అల్లాహ్ వారికి సన్మార్గపు సౌభాగ్యము కలిగించటానికి వారు ఆయన వైపునకు మరలటం లేదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَكَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِیٍّ عَدُوًّا شَیٰطِیْنَ الْاِنْسِ وَالْجِنِّ یُوْحِیْ بَعْضُهُمْ اِلٰی بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُوْرًا ؕ— وَلَوْ شَآءَ رَبُّكَ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَمَا یَفْتَرُوْنَ ۟
ఈ ముష్రికులందరి ద్వారా మేము మిమ్మల్ని పరీక్షించినట్లే మీకన్న మునుపు ప్రతి ప్రవక్తను పరీక్షించినాము. వారిలోంచి ప్రతి ఒక్కరి కొరకు మానవుల్లోంచి తలబిరుసు కల వారిని,జిన్నాతుల్లోంచి తలబిరుసు కల వారిని శతృవులుగా చేశాము. వారిలోంచి కొందరు కొందరి మనసులో మాటలు వేసి వారిని మోసం చేయటానికి అసత్యాన్ని అలంకరించి చూపిస్తారు. ఒక వేళ అల్లాహ్ వారు ఇలా చేయకూడదు అని అనుకుంటే వారు ఇలా చేయరు. కాని ఆయన వారిని పరీక్షించటం కొరకు దానిని కోరుకున్నాడు. అయితే మీరు వారిని,వారు కల్పించుకున్న అవిశ్వాసము,అసత్యమును వదిలివేయండి. వారిని ఇబ్బంది పెట్టకండి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلِتَصْغٰۤی اِلَیْهِ اَفْـِٕدَةُ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَلِیَرْضَوْهُ وَلِیَقْتَرِفُوْا مَا هُمْ مُّقْتَرِفُوْنَ ۟
మరియు పరలోకమును విశ్వసించని వారి మనస్సులను వారిలోంచి కొందరు కొందరిని ప్రేరేపించటానికి మనస్సులో వేసిన మాటల వైపు మొగ్గు చూపటం కొరకు,మరియు దానిని తమ కొరకు స్వీకరించటం కొరకు,దానిని వారి కొరకు ఇష్టపడేందుకు,వారు అవిధేయత కార్యాలను,పాపములను చేసేటందుకు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَفَغَیْرَ اللّٰهِ اَبْتَغِیْ حَكَمًا وَّهُوَ الَّذِیْۤ اَنْزَلَ اِلَیْكُمُ الْكِتٰبَ مُفَصَّلًا ؕ— وَالَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَعْلَمُوْنَ اَنَّهٗ مُنَزَّلٌ مِّنْ رَّبِّكَ بِالْحَقِّ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِیْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నేను మీ మధ్య,నా మధ్య తీర్పు విషయంలో అల్లాహ్ ను వదిలి వేరే వాళ్ళను అంగీకరించడం సాధ్యమేనా?. అల్లాహ్ యే అన్నీ విషయాలను వివరిస్తూ మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. మేము తౌరాత్ ను ప్రసాధించిన యూదులు,మేము ఇంజీలు ప్రసాధించిన క్రైస్తవులు మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ సత్యంతో కూడుకుని ఉన్నదని దాని గురించి తమ గ్రంధాల్లో ఆధారమును పొందటం మూలంగా వారు తెలుసుకున్నారు. అయితే మీ పై మేము అవతరింపజేసిన దాని గురించి సందేహపడే వారిలోంచి మీరు కాకండి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَّعَدْلًا ؕ— لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
మరియు ఖుర్ఆన్ మాటల్లో సమాచారమివ్వటంలో చాలా నిజాయితీకి చేరుకుంది. ఆయన వాక్కులను మార్చే వాడెవడూ లేడు. మరియు అతడు తన దాసుల మాటలను వినేనాడు. వాటి గురించి తెలిసిన వాడు. వాటిలోంచి ఏది కూడా ఆయనకు గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాక్కులను మార్చటానికి ప్రయత్నించే వాడిని ఆయన తొందరగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِنْ تُطِعْ اَكْثَرَ مَنْ فِی الْاَرْضِ یُضِلُّوْكَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ هُمْ اِلَّا یَخْرُصُوْنَ ۟
ఓ ప్రవక్తా భూమిపై నివసించే అధిక సంఖ్యాకుల మాట విన్నారే అనుకోండి వారు మిమ్మల్ని అల్లాహ్ ధర్మం నుంచి తప్పించి వేస్తారు. సత్యం తక్కువ మందితో పాటు ఉండటంలో అల్లాహ్ సంప్రదాయం నడుస్తున్నది. చాలామంది నిరాధారమైన నమ్మకమును మాత్రమే అనుసరిస్తారు. ఏ విధంగానంటే వారి ఆరాధ్యదైవాలు వారిని అల్లాహ్ కు దగ్గర చేస్తాయని వారు నమ్మేవారు. వారు ఆ విషయంలో అబధ్ధం పలికేవారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ مَنْ یَّضِلُّ عَنْ سَبِیْلِهٖ ۚ— وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟
ఓ ప్రవక్తా ప్రజల్లోంచి తన మార్గము నుండి ఎవరు తప్పిపోతారో నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు(ఎవరు) సన్మార్గము పొందుతారో ఆయనకు బాగా తెలుసు. అందులోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَیْهِ اِنْ كُنْتُمْ بِاٰیٰتِهٖ مُؤْمِنِیْنَ ۟
ఓ ప్రజలారా ఒక వేళ మీరు ఆయన స్పష్టమైన నిదర్శనాలపై సత్య విశ్వాసం కలిగిన వారే నైతే జుబాహ్ (కోసే) చేసే సమయంలో అల్లాహ్ పేరు తీసుకున్న వాటిలోంచే మీరు తినండి.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• يجب أن يكون الهدف الأعظم للعبد اتباع الحق، ويطلبه بالطرق التي بيَّنها الله، ويعمل بذلك، ويرجو عَوْن ربه في اتباعه، ولا يتكل على نفسه وحوله وقوته.
సత్యాన్ని విశ్వసించటం,అల్లాహ్ స్పష్టపరచిన మార్గాల ద్వారా దానిని కోరుకోవటం,వాటి ప్రకారం ఆచరించటం,తన ప్రభువుపై విధేయత చూపటంలో తన ప్రభువు సహాయమును ఆశించటం,తనపై,తన శక్తిసామర్ధ్యాలపై నమ్మకం ఉండకుండాపోవటం దాసుని యొక్క పెద్ద లక్ష్యం.

• من إنصاف القرآن للقلة المؤمنة العالمة إسناده الجهل والضلال إلى أكثر الخلق.
అల్పంగా ఉన్న జ్ఞానులైన విశ్వాసపరుల కొరకు ఖుర్ఆన్ న్యాయం ఏమిటంటే అజ్ఞానము,మార్గభ్రష్టత యొక్క సంబంధమును అధిక సృష్టితాల వైపు చేస్తుంది.

• من سنّته تعالى في الخلق ظهور أعداء من الإنس والجنّ للأنبياء وأتباعهم؛ لأنّ الحقّ يعرف بضدّه من الباطل.
సృష్టితాల విషయంలో దైవ ప్రవక్త కొరకు,వారిని అనుసరించే వారి కొరకు జిన్నుల నుండి మానవుల నుండి శతృవులను బహిర్గతం చేయటం అల్లాహ్ సంప్రదాయము. ఎందుకంటే సత్యము దానికి వ్యతిరేకమైన అసత్యము ద్వారానే గుర్తించబడుతుంది.

• القرآن صادق في أخباره، عادل في أحكامه،لا يُعْثَر في أخباره على ما يخالف الواقع، ولا في أحكامه على ما يخالف الحق.
ఖుర్ఆన్ తన సమాచార విషయంలో సత్యబధ్ధమైనది. తన ఆదేశాల విషయంలో న్యాయపూరితమైనది. వాస్తవికతకు విరుధ్ధమైన వాటిపై దాని సమాచారాల్లో,సత్యానికి విరుధ్ధమైన వాటిపై దాని ఆదేశాల్లో ఇది కనుగొనబడలేదు.

 
പരിഭാഷ അദ്ധ്യായം: അൻആം
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അടക്കുക