വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: സൂറത്തുല്ലൈൽ   ആയത്ത്:

సూరహ్ అల్-లైల్

സൂറത്തിൻ്റെ ഉദ്ദേശ്യങ്ങളിൽ പെട്ടതാണ്:
بيان أحوال الخلق في الإيمان والإنفاق وحال كل فريق.
విశ్వాసం విషయంలో మరియు ఖర్చు చేసే విషయంలో సృష్టిరాసుల పరిస్థితుల ప్రకటన మరియు ప్రతీ వర్గము యొక్క పరిస్థితి ప్రకటన

وَالَّیْلِ اِذَا یَغْشٰی ۟ۙ
రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లాహ్ దానిపై ప్రమాణం చేశాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَالنَّهَارِ اِذَا تَجَلّٰی ۟ۙ
మరియు పగలు బహిర్గతమై,ప్రత్యక్షమైనప్పుడు దానిపై ప్రమాణం చేశాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْاُ ۟ۙ
మరియు రెండు రకములైన తన సృష్టి అయిన మగ,ఆడ పై ప్రమాణం చేశాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِنَّ سَعْیَكُمْ لَشَتّٰی ۟ؕ
ఓ ప్రజలారా నిశ్చయంగా మీ కర్మ రకరకాలుగా ఉంటుంది. అందులో స్వర్గములో ప్రవేశమునకు కారణమయ్యే సత్కర్మలు కలవు. మరియు నరకములో ప్రవేశమునకు కారణమయ్యే పాప కార్యములు కలవు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاَمَّا مَنْ اَعْطٰی وَاتَّقٰی ۟ۙ
ఇక ఎవరైతే జకాతు,ఖర్చు చేయటం,పాపపరిహారములోంచి ఏదైతే ఖర్చు చేయటం తనపై తప్పనిసరో దాన్ని ఇచ్చాడో మరియు దేని నుండైతే అల్లాహ్ వారించాడో దాని నుండి దూరంగా ఉండాటో.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَصَدَّقَ بِالْحُسْنٰی ۟ۙ
మరియు పరిహారంగా అల్లాహ్ తనకు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని నమ్ముతాడో.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَسَنُیَسِّرُهٗ لِلْیُسْرٰی ۟ؕ
అతనిపై మేము తొందరలోనే సత్కర్మను చేయటమును మరియు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటమును సులభతరం చేస్తాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنٰی ۟ۙ
మరియు ఎవరైతే తన సంపద విషయంలో పిసినారితనం చూపి దాన్ని దేనిలోనైతే ఖర్చు చేయటం తనపై అనివార్యమో ఖర్చు చేయలేదో మరియు అల్లాహ్ నుండి తన సంపద విషయంలో నిర్లక్ష్యం వహించి అల్లాహ్ తో ఆయన అనుగ్రహముల్లోంచి ఏదీ అర్దించలేదో.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَكَذَّبَ بِالْحُسْنٰی ۟ۙ
అల్లాహ్ ఏదైతే బదులుగా ఇస్తానని మరియు తన సంపదలో నుంచి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటంపై ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని అబద్దమని తిరస్కరించాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أهمية تزكية النفس وتطهيرها.
మనస్సు పరిశుద్ధత మరియు దాని పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత.

• المتعاونون على المعصية شركاء في الإثم.
పాపకార్యములో ఒకరికొకరు సహాయం చేసుకున్నవారు పాపములో భాగస్వాములు.

• الذنوب سبب للعقوبات الدنيوية.
పాప కార్యములు ప్రాపంచిక శిక్షలకు కారణమగును.

• كلٌّ ميسر لما خلق له فمنهم مطيع ومنهم عاصٍ.
ప్రతీ సౌలభ్యము దేని కొరకు సృష్టించబడినదో దానిది. అయితే వారిలో నుండి విధేయులున్నారు. మరియు అవిధేయులున్నారు.

فَسَنُیَسِّرُهٗ لِلْعُسْرٰی ۟ؕ
తొందరలోనే మేము చెడును చేయటమును అతనిపై సులభతరం చేస్తాము. మరియు మేలును చేయటమును అతనిపై కష్టతరం చేస్తాము.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمَا یُغْنِیْ عَنْهُ مَالُهٗۤ اِذَا تَرَدّٰی ۟ؕ
అతను నాశనం అయి నరకంలో ప్రవేశించినప్పుడు తాను పిసినారి తనం చూపిన తన సంపద తనకు ఏమి పనికి రాలేదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِنَّ عَلَیْنَا لَلْهُدٰی ۟ؗۖ
నిశ్చయంగా మేము అసత్య మార్గము నుండి సత్య మార్గమును స్పష్టపరచటం మా బాధ్యత.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاِنَّ لَنَا لَلْاٰخِرَةَ وَالْاُوْلٰی ۟
మరియు నిశ్చయంగా పరలోక జీవితం మా కొరకే మరియు ఇహలోక జీవితం మా కొరకే. వాటిలో మేము తలుచుకున్నట్లు వ్యవహారాలు నడుపుతాము. మాకు తప్ప అది ఎవరికి చెందదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
فَاَنْذَرْتُكُمْ نَارًا تَلَظّٰی ۟ۚ
ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ కు అవిధేయత చూపితే దహించి వేసే నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించాను.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
لَا یَصْلٰىهَاۤ اِلَّا الْاَشْقَی ۟ۙ
ఈ నరకాగ్నిని అనుభవించువాడు దుష్టుడు మాత్రమే మరియు అతడు అవిశ్వాసపరుడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
الَّذِیْ كَذَّبَ وَتَوَلّٰی ۟ؕ
అతడే దైవ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించాడు మరియు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటం నుండి విముఖత చూపాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَسَیُجَنَّبُهَا الْاَتْقَی ۟ۙ
ప్రజల్లో అత్యంత దైవ భీతి కలిగిన వారైన అబూబకర్ రజిఅల్లాహు అన్హు దాని నుండి దూరంగా ఉంటారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
الَّذِیْ یُؤْتِیْ مَالَهٗ یَتَزَكّٰی ۟ۚ
ఆయనే పాపముల నుండి పరిశుద్ధుడగుటకు తన సంపదను పుణ్య మార్గాల్లో ఖర్చు చేశారు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَمَا لِاَحَدٍ عِنْدَهٗ مِنْ نِّعْمَةٍ تُجْزٰۤی ۟ۙ
మరియు తన సంపద నుండి తాను ఖర్చు చేసినది, ఎవరో తనకు ఉపకారము చేసిన దానికి బదులుగా కాదు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اِلَّا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِ الْاَعْلٰی ۟ۚ
తన సంపదలో నుంచి తాను ఖర్చు చేసినది తన సృష్టి రాసుల కన్న మహోన్నతుడైన తన ప్రభువు మన్నతును కోరుతూ మాత్రమే.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَلَسَوْفَ یَرْضٰی ۟۠
మరియు అతడు తనకు అల్లాహ్ ప్రసాదించే గొప్ప ప్రతిఫలముతో సంతుష్టపడుతాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• منزلة النبي صلى الله عليه وسلم عند ربه لا تدانيها منزلة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్నది దానికి ఏ స్థానము సరితూగదు.

• شكر النعم حقّ لله على عبده.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం దాసునిపై తప్పనిసరి.

• وجوب الرحمة بالمستضعفين واللين لهم.
బలహీనుల పట్ల కారుణ్యమును చూపటం మరియు వారితో మృధువుగా వ్యవహరించటం తప్పనిసరి.

 
പരിഭാഷ അദ്ധ്യായം: സൂറത്തുല്ലൈൽ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

അടക്കുക