Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ് * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ   ആയത്ത്:
مَا نَنْسَخْ مِنْ اٰیَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَیْرٍ مِّنْهَاۤ اَوْ مِثْلِهَا ؕ— اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
మేము మా ప్రవచనాలలో (ఆయాత్ లలో) ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దాని కంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నీకు తెలియదా?
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
ఏమీ? వాస్తవానికి, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందుతుందని, నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడు[1] గానీ, సహాయం చేసేవాడు గానీ మరెవ్వడూ లేడు!
[1] అల్-వలియ్యు: అంటే అస్-సయ్యద్, Patron, Protector, Owner, Defender, Friend, సంరక్షకుడు, ఆరాధ్యుడు, స్నేహితుడు, సహాయకుడు, రక్షించువాడు, స్వామి, అండగా నిలుచువాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 6:14.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
اَمْ تُرِیْدُوْنَ اَنْ تَسْـَٔلُوْا رَسُوْلَكُمْ كَمَا سُىِٕلَ مُوْسٰی مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّتَبَدَّلِ الْكُفْرَ بِالْاِیْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ముహమ్మద్) ను ప్రశ్నించగోరు తున్నారా? మరియు ఎవడైతే, సత్యతిరస్కారాన్ని, విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَدَّ كَثِیْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ یَرُدُّوْنَكُمْ مِّنْ بَعْدِ اِیْمَانِكُمْ كُفَّارًا ۖۚ— حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْحَقُّ ۚ— فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰی یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నంచండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَیْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
మరియు నమాజ్ స్థాపించండి.[1] విధిదానం (జకాత్) ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
[1] అంటే నమా'జ్ లను వాటి సమయాలలో, సరిగ్గా దినానికి ఐదు సార్లు, పురుషులు జమా'అత్ తో మరియు స్త్రీలు ఇండ్లలో పాటించాలి, అని అర్థం.
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
وَقَالُوْا لَنْ یَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— تِلْكَ اَمَانِیُّهُمْ ؕ— قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: "మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి!"
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
بَلٰی ۗ— مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ ۪— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟۠
వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు అంకితం చేసుకుని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు.[1] మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
[1] "అస్లమ వహ్ హహు లిల్లాహ్." అంటే, కేవలం అల్లాహ్ (సు.తా.) ప్రసన్నత కొరకే ఏదైనా చేయాలి. "వహువ ము'హ్ సినున్:" అంటే ఏ పనైనా హృదయపూర్వకంగా, మహా ప్రవక్త ('స'అస) ఆదేశాల ప్రకారం చేయాలి. చేసిన కార్యాలకు మంచి ప్రతిఫలం పొందటానికి, ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవటం ఎంతో అవసరం. (ఇబ్నె-కసీ'ర్).
അറബി ഖുർആൻ വിവരണങ്ങൾ:
 
പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - തെലുങ്ക് വിവർത്തനം - അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ് - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

അബ്ദുൽ റഹീം ബ്നു മുഹമ്മദ് വിവർത്തനം.

അടക്കുക