ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߝߊߙߊ߲ߝߊߛߌ ߝߐߘߊ   ߟߝߊߙߌ ߘߏ߫:

సూరహ్ అల్-ఫుర్ఖాన్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
الانتصار للرسول صلى الله عليه وسلم وللقرآن ودفع شبه المشركين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ముష్రికులు ఆయనపై హింసకు దిగిన తరువాత ప్రతీకారం తీసుకోవటం.

تَبٰرَكَ الَّذِیْ نَزَّلَ الْفُرْقَانَ عَلٰی عَبْدِهٖ لِیَكُوْنَ لِلْعٰلَمِیْنَ نَذِیْرَا ۟ۙ
మహోన్నతుడు,అధిక శుభాలు కలవాడు అతడు ఎవడైతే తన దాసుడు,తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సత్య,అసత్యాల మధ్య వేరు చేసే ఖుర్ఆన్ ను ఆయన మానవులు,జిన్నులు ఇరు వర్గాల వైపు ప్రవక్త అవటానికి,వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవాడు అవటానికి అవతరింపజేశాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
١لَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَمْ یَتَّخِذْ وَلَدًا وَّلَمْ یَكُنْ لَّهٗ شَرِیْكٌ فِی الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَیْءٍ فَقَدَّرَهٗ تَقْدِیْرًا ۟
ఆకాశముల అధికారము,భూమి అధికారము ఒక్కడైన ఆయనకే చెందుతుంది. మరియు ఆయన ఎవరిని సంతానంగా చేయలేదు. మరియు ఆయన సామ్రాజ్యాధికారంలో ఆయనకు ఎటువంటి భాగస్వామి లేడు. మరియు ఆయన అన్ని వస్తువులను సృష్టించాడు. వాటిని సృష్టించటంలో తన జ్ఞానమునకు,తన విజ్ఞతకు తగినటువంటి విధంగా విధిని నిర్ణయించాడు. ప్రతీది తనకు తగిన విధంగా ఉన్నది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• دين الإسلام دين النظام والآداب، وفي الالتزام بالآداب بركة وخير.
ఇస్లాం ధర్మం క్రమం,పధ్ధతుల యొక్క ధర్మం. మరియు పధ్ధతులకు కట్టుబడి ఉండటంలో శుభము,మేలు ఉంటాయి.

• منزلة رسول الله صلى الله عليه وسلم تقتضي توقيره واحترامه أكثر من غيره.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఇతరుల కన్న ఎక్కువగా ఆయనను గౌరవించటమును నిర్ధారిస్తుంది.

• شؤم مخالفة سُنَّة النبي صلى الله عليه وسلم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయమును విబేధము యొక్క అశుభము.

• إحاطة ملك الله وعلمه بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ యొక్క అధికారము,ఆయన జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది.

وَاتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً لَّا یَخْلُقُوْنَ شَیْـًٔا وَّهُمْ یُخْلَقُوْنَ وَلَا یَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ ضَرًّا وَّلَا نَفْعًا وَّلَا یَمْلِكُوْنَ مَوْتًا وَّلَا حَیٰوةً وَّلَا نُشُوْرًا ۟
మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఏ వస్తువును చిన్నదైనా గాని పెద్దదైనా గాని సృష్టించని ఆరాధ్య దావాలను తయారు చేసుకున్నారు. వాస్తవానికి వారూ సృష్టించబడినవారు. నిశ్ఛయంగా అల్లాహ్ వారిని అస్థిత్వంలో లేనప్పుడు సృష్టించాడు. వారు తమ స్వయం నుండి ఎటువంటి నష్టమును తొలగించుకోలేవు, తమ స్వయం కొరకు ఎటువంటి లాభమును చేకూర్చుకోలేవు. మరియు జీవించి ఉన్న వారిని మరణింపజేయలేవు,మరణించిన వారిని జీవింపజేయలేవు. మరియు వారు మృతులను వారి సమాధుల నుంచి మరల లేపజాలవు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اِفْكُ ١فْتَرٰىهُ وَاَعَانَهٗ عَلَیْهِ قَوْمٌ اٰخَرُوْنَ ۛۚ— فَقَدْ جَآءُوْ ظُلْمًا وَّزُوْرًا ۟ۚۛ
మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు ఇలా పలికారు : ఈ ఖుర్ఆన్ ఒక అబద్దము మాత్రమే దీన్ని ముహమ్మద్ కల్పించుకుని అల్లాహ్ కు అపాదించాడు. మరియు వేరేవాళ్లు అతను కల్పించుకున్న దానిపై అతనికి సహకరించారు. నిశ్ఛయంగా ఈ అవిశ్వాసపరులందరు అసత్యపు మాటను కల్పించుకున్నారు. ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు. మానవులకి,జిన్నులకి దాని లాంటి దాన్ని తీసుకుని రావటం సాధ్యం కాదు
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالُوْۤا اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ اكْتَتَبَهَا فَهِیَ تُمْلٰی عَلَیْهِ بُكْرَةً وَّاَصِیْلًا ۟
మరియు ఈ ముష్రికులందరు ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు : ఖుర్ఆన్ పూర్వికుల మాటలు,వారు రాసుకున్న అసత్యాలు ,వాటిని ముహమ్మద్ కాపీ చేశాడు. అవి దినపు మొదటి,చివరి వేళల్లో అతనిపై పఠించబడుతున్నాయి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ اَنْزَلَهُ الَّذِیْ یَعْلَمُ السِّرَّ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اِنَّهٗ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా తెలపండి : ఖుర్ఆన్ ను అవతరింపజేసిన అల్లాహ్ భూమ్యాకాశములలో ఉన్న ప్రతీ వస్తువు గురించి తెలిసినవాడు. మీరు అనుకుంటున్నట్లు అది కల్పించబడలేదు. ఆ తరువాత వారు పశ్చాత్తాప్పడాలని కోరుతూ ఇలా అన్నాడు : నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారిని మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالُوْا مَالِ هٰذَا الرَّسُوْلِ یَاْكُلُ الطَّعَامَ وَیَمْشِیْ فِی الْاَسْوَاقِ ؕ— لَوْلَاۤ اُنْزِلَ اِلَیْهِ مَلَكٌ فَیَكُوْنَ مَعَهٗ نَذِیْرًا ۟ۙ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే ముష్రికులు ఇలా పలికారు : అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని వాదిస్తున్న ఇతనికి ఏమయింది ఇతర మనుషులు తిన్నట్లే ఇతనూ అన్నం తింటున్నాడు. మరియు బజార్లలో జీవనోపాధిని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకని అల్లాహ్ ఇతనితోపాటు ఒక దైవ దూతను ఇతనికి సహచరునిగా అవతరింపజేయలేదు అతడిని దృవీకరించేవాడు,అతనికి సహకరించేవాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَوْ یُلْقٰۤی اِلَیْهِ كَنْزٌ اَوْ تَكُوْنُ لَهٗ جَنَّةٌ یَّاْكُلُ مِنْهَا ؕ— وَقَالَ الظّٰلِمُوْنَ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا رَجُلًا مَّسْحُوْرًا ۟
లేదా అతనిపై ఆకాశము నుండి ఏదైన నిధి అతనిపై ఎందుకు దిగలేదు,లేదా అతని కొరకు ఒక తోట ఎందుకు లేదు దాని ఫలముల నుండి అతను తినేవాడు. బజార్లలో తిరగటం నుండి జీవనోపాధిని వెతకటం నుండి దూరంగా ఉండేవాడు. మరియు ఆ దుర్మార్గులు ఇలా అన్నారు : ఓ విశ్వాసపరులారా మీరు ఒక ప్రవక్తని అనుసరించటం లేదు. మీరు కేవలం మంత్రజాలం వలన తన మతిని కోల్పోయిన ఒక వ్యక్తిని మాత్రమే అనుసరిస్తున్నారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اُنْظُرْ كَیْفَ ضَرَبُوْا لَكَ الْاَمْثَالَ فَضَلُّوْا فَلَا یَسْتَطِیْعُوْنَ سَبِیْلًا ۟۠
ఓ ప్రవక్తా మీరు చూడండి మీరు వారితో ఆశ్ఛర్యపోతారు వారు ఎలా అసత్య గుణాలతో మిమ్మల్ని వర్ణిస్తున్నారు. మంత్రజాలకుడు అన్నారు,మంత్రజాలానికి గురైన వాడు అన్నారు,పిచ్చివాడు అన్నారు. అయితే వారు దీని కారణం చేత సత్యము నుండి తప్పిపోయారు. మార్గదర్శకత్వానికి దారి పొందలేరు. మరియు మీ నిజాయితీని,మీ నీతిని అపవాదు చేయటానికి ఒక మార్గమును కూడా పొందలేరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
تَبٰرَكَ الَّذِیْۤ اِنْ شَآءَ جَعَلَ لَكَ خَیْرًا مِّنْ ذٰلِكَ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— وَیَجْعَلْ لَّكَ قُصُوْرًا ۟
అల్లాహ్ శుభకరుడు. ఒక వేళ ఆయన తలచుకుంటే వారు మీ కొరకు ప్రతిపాదించిన వాటికన్న మంచి వాటిని మీ కొరకు చేస్తాడు. మీ కొరకు ఇహలోకములో క్రింది నుండి కాలువలు ప్రవహించే భవనములు కల తోటలను సృష్టిస్తాడు. మరియు మీరు వాటి వృక్షముల ఫలములను తింటారు. మరియు ఆయన మీ కొరకు భవనములను తయారు చేస్తాడు వాటిలో మీరు ప్రశాంతంగా జీవిస్తారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
بَلْ كَذَّبُوْا بِالسَّاعَةِ وَاَعْتَدْنَا لِمَنْ كَذَّبَ بِالسَّاعَةِ سَعِیْرًا ۟ۚ
వారి నుండి వెలువడిన మాటలు సత్యాన్ని అశిస్తూ,ఆధారమును అన్వేషించటానికి కాదు. కాని జరిగిందేమిటంటే వారు ప్రళయదినమును తిరస్కరించారు. మరియు మేము ప్రళయదినమును తిరస్కరించే వారి కొరకు తీవ్రంగా జ్వలించే పెద్ద నరకాగ్నిని సిద్ధం చేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• اتصاف الإله الحق بالخلق والنفع والإماتة والإحياء، وعجز الأصنام عن كل ذلك.
సత్య ఆరాధ్య దైవం సృష్టించటం,ప్రయోజనం చేయటం,మరణింపజేయటం,జీవింపజేయటం వంటి గుణాలతో వర్ణించబడటం, విగ్రహాలు వీటన్నింటి నుండి అశక్తులు కావటం.

• إثبات صفتي المغفرة والرحمة لله.
అల్లాహ్ కొరకు మన్నింపు,కారుణ్యం రెండు గుణముల నిరూపణ.

• الرسالة لا تستلزم انتفاء البشرية عن الرسول.
దైవదౌత్యము ప్రవక్త నుండి మనిషి కాకపోవటమును తప్పనిసరి చేయదు.

• تواضع النبي صلى الله عليه وسلم حيث يعيش كما يعيش الناس.
ప్రజలు జీవించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించటం ఆయన యొక్క వినయం.

اِذَا رَاَتْهُمْ مِّنْ مَّكَانٍ بَعِیْدٍ سَمِعُوْا لَهَا تَغَیُّظًا وَّزَفِیْرًا ۟
అగ్ని అవిశ్వాసపరులను వారు దూరము నుండి దాని వద్దకు తీసుకుని రాబడినప్పుడు చూసినప్పుడు వారు దాని కొరకు తీవ్రమైన ఉడకబెట్టటమును,కలత పెట్టే శబ్దమును వారిపై దాని యొక్క తీవ్ర కోపము వలన వింటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَاِذَاۤ اُلْقُوْا مِنْهَا مَكَانًا ضَیِّقًا مُّقَرَّنِیْنَ دَعَوْا هُنَالِكَ ثُبُوْرًا ۟ؕ
ఈ అవిశ్వాసపరులందరు నరకములో దాని ఇరుకు ప్రదేశంలో వారి చేతులను వారి మెడలవైపు సంకెళ్ళతో కట్టివేయబడి విసిరి వేయబడినప్పుడు వారు దాని నుండి విముక్తిని ఆశిస్తూ తమ స్వయం పై వినాశనము కలగాలని వేడుకుంటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
لَا تَدْعُوا الْیَوْمَ ثُبُوْرًا وَّاحِدًا وَّادْعُوْا ثُبُوْرًا كَثِیْرًا ۟
ఓ అవిశ్వాసపరులారా మీరు ఈ రోజు ఒక్క వినాశనమును అర్ధించకండి,మీరు చాలా వినాశనమును కోరండి. కానీ మీరు ఆశించినది స్వీకరించబడదు. అంతేకాదు మీరు బాధాకరమైన శిక్షలో శాస్వతంగా ఉండిపోతారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ اَذٰلِكَ خَیْرٌ اَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ— كَانَتْ لَهُمْ جَزَآءً وَّمَصِیْرًا ۟
ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా అనండి : ఈ ప్రస్తావించబడిన శిక్ష ఏదైతే మీకు తెలుపబడినదో అది మేలైనదా ? లేదా ఎన్నటికి అంతం కాని శాస్వతమైన అనుగ్రహాలు కల శాస్వతంగా ఉండే స్వర్గము మేలైనదా ?. మరియు అది అల్లాహ్ తన దాసుల్లోంచి దైవభీతి కలవారికి వారి కొరకు అది ప్రతిఫలం అవుతుందని,ప్రళయదినమున వారందరు మరలి వెళ్ళే ప్రదేశమని వాగ్దానం చేశాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
لَهُمْ فِیْهَا مَا یَشَآءُوْنَ خٰلِدِیْنَ ؕ— كَانَ عَلٰی رَبِّكَ وَعْدًا مَّسْـُٔوْلًا ۟
వారి కొరకు ఈ స్వర్గములో వారు కోరుకునే అనుగ్రహాలు కలవు. అది అల్లాహ్ వాగ్దానం. దైవభీతి కలిగిన ఆయన దాసులు ఆయననే అర్ధిస్తున్నారు. అల్లాహ్ వాగ్దానం నెరవేరుతుంది. ఆయన వాగ్దానమును నెరవేర్చకుండా ఉండడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَوْمَ یَحْشُرُهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَیَقُوْلُ ءَاَنْتُمْ اَضْلَلْتُمْ عِبَادِیْ هٰۤؤُلَآءِ اَمْ هُمْ ضَلُّوا السَّبِیْلَ ۟ؕ
మరియు ఏ రోజైతే అల్లాహ్ తిరస్కారులైన ముష్రికులను సమీకరిస్తాడో మరియు వారు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే పూజిస్తున్నారో వారిని సమీకరిస్తాడో అప్పుడు ఆరాధించబడే దేవతలను వాటిని ఆరాధించేవారిని వేదించటానికి ఇలా పలుకుతాడు : ఏమీ మీరు నా దాసులను మిమ్మల్ని ఆరాధించమని వారిని మీ ఆదేశం ద్వారా అపమార్గమునకు లోనుచేశారా ? లేదా వారు తమ స్వయం తరపు నుండి అపమార్గమునకు లోనయ్యారా ?!.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قَالُوْا سُبْحٰنَكَ مَا كَانَ یَنْۢبَغِیْ لَنَاۤ اَنْ نَّتَّخِذَ مِنْ دُوْنِكَ مِنْ اَوْلِیَآءَ وَلٰكِنْ مَّتَّعْتَهُمْ وَاٰبَآءَهُمْ حَتّٰی نَسُوا الذِّكْرَ ۚ— وَكَانُوْا قَوْمًا بُوْرًا ۟
ఆరాధించబడేవారు ఇలా సమాధానమిస్తారు : ఓ మా ప్రభువా నీ కొరకు భాగస్వామి ఉండటం నుండి నీవు అతీతుడవు. నిన్ను వదిలి ఇతరులను మేము సంరక్షకులుగా చేసుకోవటం మాకు తగదు. అటువంటప్పుడు మేము ఎలా నిన్ను వదిలి మమ్మల్ని ఆరాధించమని నీ దాసులని పిలుస్తాము ?!. కాని నీవు ఈ ముష్రికులందరికి ఇహలోక సుఖభోగాల ద్వారా ప్రయోజనం చేకూర్చావు. మరియు వారి తాతముత్తాతలకు వారి కొరకు క్రమ క్రమంగా తీసుకుపోవటానికి ప్రయోజనం చేకూర్చావు చివరకు వారు నీ స్మరణను మరచిపోయారు. మరియు నీతోపాటు వారు ఇతరులను ఆరాధించారు. వారు తమ ప్రయాస వలన వినాశనమైన జనం అయ్యారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
فَقَدْ كَذَّبُوْكُمْ بِمَا تَقُوْلُوْنَ ۙ— فَمَا تَسْتَطِیْعُوْنَ صَرْفًا وَّلَا نَصْرًا ۚ— وَمَنْ یَّظْلِمْ مِّنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِیْرًا ۟
ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించిన వారి పై మీరు వాధించిన వాటి విషయంలో వారు మిమ్మల్ని తిరస్కరించారు. అయితే మీరు మీ స్వయంపై నుండి శిక్షను తొలగించలేరు మరియు మీ బలహీనత వలన సహాయం చేయలేరు.ఓ విశ్వాసపరులారా మీలో నుండి అల్లాహ్ తో పాటు సాటి కల్పించి దుర్మార్గమునకు పాల్పడిన వారిని తెలియపరచబడిన వారికి శిక్షించినట్లే మేము పెద్ద శిక్ష రుచి చూపిస్తాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَمَاۤ اَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِیْنَ اِلَّاۤ اِنَّهُمْ لَیَاْكُلُوْنَ الطَّعَامَ وَیَمْشُوْنَ فِی الْاَسْوَاقِ ؕ— وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً ؕ— اَتَصْبِرُوْنَ ۚ— وَكَانَ رَبُّكَ بَصِیْرًا ۟۠
ఓ ప్రవక్తా మేము మీకన్న పూర్వం ప్రవక్తలను మానవులను మాత్రమే పంపించాము. వారు అన్నం తినేవారు మరియు బజార్లలో తిరిగేవారు. అయితే ఈ విషయంలో ప్రవక్తల్లోంచి మీరు మొదటివారు కాదు. ఓ ప్రజలారా మేము మీలో నుండి కొందరిని కొందరి కొరకు ధనం విషయంలో,పేదరికం విషయంలో,ఆరోగ్యం విషయంలో,అనారోగ్యం విషయంలో ఈ విబేధము కారణంగా పరీక్షగా చేశాము. ఏమీ మీరు పరీక్షించబడిన దానిపై మీరు సహనం చూపగలరా అల్లాహ్ మీ సహనమునకు బదులుగా పుణ్యమును ప్రసాదించటానికి ?!. మరియు మీ ప్రభువు సహనం చూపే వాడిని,సహనం చూపని వాడిని,అతనిపై విధేయత చూపే వాడిని,అతనిపై అవిధేయత చూపే వాడిని చూసేవాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الجمع بين الترهيب من عذاب الله والترغيب في ثوابه.
అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టడమునకు,ఆయన ప్రతిఫలం విషయంలో ప్రోత్సహించటమునకు మధ్య సేకరణ.

• متع الدنيا مُنْسِية لذكر الله.
ప్రాపంచిక సామగ్రి అల్లాహ్ స్మరణను మరిపింపజేస్తుంది.

• بشرية الرسل نعمة من الله للناس لسهولة التعامل معهم.
ప్రవక్తలు మానవులు కావటం మానవుల కొరకు వారితోపాటు సులభంగా వ్యవహరించటానికి అల్లాహ్ వద్ద నుండి ఒక వరము.

• تفاوت الناس في النعم والنقم اختبار إلهي لعباده.
ప్రజల్లో అనుగ్రహాల విషయంలో,శిక్ష విషయంలో వ్యత్యాసం దైవ పరీక్ష ఆయన దాసుల కొరకు.

وَقَالَ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْنَا الْمَلٰٓىِٕكَةُ اَوْ نَرٰی رَبَّنَا ؕ— لَقَدِ اسْتَكْبَرُوْا فِیْۤ اَنْفُسِهِمْ وَعَتَوْ عُتُوًّا كَبِیْرًا ۟
మమ్మల్ని కలుసుకోవటమును ఆశించని,మా శిక్ష నుండి భయపడని అవిశ్వాసపరులు ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ ముహమ్మద్ నిజాయితీని గురించి మాకు తెలియపరచటానికి దైవదూతలను మాపై అవతరింపజేయలేదు ? లేదా దాని గురించి మాకు తెలియపరచటానికి మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడ లేదు ?. వీరందరి హృదయములలో గర్వము ఎక్కువైపోయి చివరకు వారిని అది విశ్వాసము నుండి ఆపివేసింది. మరియు వారు తమ అవిశ్వాసపు, మితిమీరిపోయే మాటల వలన ఈ హద్దును మించిపోయారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
یَوْمَ یَرَوْنَ الْمَلٰٓىِٕكَةَ لَا بُشْرٰی یَوْمَىِٕذٍ لِّلْمُجْرِمِیْنَ وَیَقُوْلُوْنَ حِجْرًا مَّحْجُوْرًا ۟
ఏ రోజైతే అవిశ్వాసపరులు తమ మరణం సమయంలో,బర్జక్ లో,వారు మరలా లేపబడేటప్పుడు, లెక్కతీసుకోవటానికి వారిని తీసుకుని వచ్చినప్పుడు,వారు నరకాగ్నిలో ప్రవేశించేటప్పుడు దైవదూతలను ప్రత్యక్షంగా చూస్తారో ఆ సందర్భాలలో వారికి ఎటువంటి శుభవార్తలు ఉండవు. దీనికి భిన్నంగా విశ్వాసపరులు. మరియు వారితో (అవిశ్వాసపరులతో) దైవదూతలు అంటారు : అల్లాహ్ వద్ద నుండి మీపై శుభవార్తలు నిషేధించబడ్డాయి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَدِمْنَاۤ اِلٰی مَا عَمِلُوْا مِنْ عَمَلٍ فَجَعَلْنٰهُ هَبَآءً مَّنْثُوْرًا ۟
మరియు మేము అవిశ్వాసపరులు ఇహలోకంలో చేసుకున్న పుణ్య కార్యాలు, మంచి కార్యాల వైపు మరలి మేము వాటిని వారి అవిశ్వాసం వలన అసత్యం అవటంలో,ప్రయోజనం కలిగించకపోవటంలో ఆ విచ్ఛిన్నం అయిన దూళివలే చేస్తాము దేనినైతే చూసేవాడు కిటికీ నుండి లోపలికి వచ్చే సూర్య కిరణాలలో చూస్తాడో.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَصْحٰبُ الْجَنَّةِ یَوْمَىِٕذٍ خَیْرٌ مُّسْتَقَرًّا وَّاَحْسَنُ مَقِیْلًا ۟
ఆ దినము స్వర్గ వాసులైన విశ్వాసపరులు ఈ అవిశ్వాసపరులకన్న ఉన్నత స్థానంలో,ఇహలోకంలో వారి ఖైలూలా (విశ్రాంతి తీసుకునే) సమయ ఉత్తమ విశ్రాంతి ప్రదేశము. ఇది అల్లాహ్ పై వారి విశ్వాసము,వారి సత్కర్మ వలన.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَوْمَ تَشَقَّقُ السَّمَآءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلٰٓىِٕكَةُ تَنْزِیْلًا ۟
ఓ ప్రవక్తా మీరు గుర్తు చేసుకోండి - ఏ రోజైతే ఆకాశము సన్నని తెల్లటి మేఘములతో సహా బ్రద్ధలవుతుందో,మరియు దైవ దూతలు వారు అధికంగా ఉండటం వలన సమీకరించబడే భూమి వైపునకు అధికంగా దింపబడుతారో,
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَلْمُلْكُ یَوْمَىِٕذِ ١لْحَقُّ لِلرَّحْمٰنِ ؕ— وَكَانَ یَوْمًا عَلَی الْكٰفِرِیْنَ عَسِیْرًا ۟
సామ్రాజ్యాధికారము ఏదైతే స్థిరమైన సత్యమైన సామ్రాజ్యాధికారము ప్రళయదినాన పరిశుద్ధుడైన కరుణామయుడికొరకే. మరియు ఆ దినమున అవిశ్వాసపరులపై కష్టతరంగా ఉంటుంది. విశ్వాసులకు దీనికి విరుద్ధంగా ఉంటుంది. అది వారిపై సులభంగా ఉంటుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَوْمَ یَعَضُّ الظَّالِمُ عَلٰی یَدَیْهِ یَقُوْلُ یٰلَیْتَنِی اتَّخَذْتُ مَعَ الرَّسُوْلِ سَبِیْلًا ۟
ఓ ప్రవక్తా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి - ఏ రోజైతే దుర్మార్గుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటమును వదిలివేయటం వలన తీవ్రమైన సిగ్గుతో ఇలా పలుకుతూ తన రెండు చేతులను కొరుక్కుంటాడు : అయ్యో నా దౌర్భాగ్యము ప్రవక్తను ఆయన తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో నేను అనుసరించి,ఆయనతో పాటు సాఫల్యం వైపునకు ఒక మార్గమును అనుసరించి ఉంటే ఎంతబాగుండేది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
یٰوَیْلَتٰی لَیْتَنِیْ لَمْ اَتَّخِذْ فُلَانًا خَلِیْلًا ۟
మరియు అతను తీవ్రమైన బాధతో తన స్వయం పై వినాశనమును కోరుతూ ఇలా పలుకుతాడు : అయ్యో నా దౌర్భాగ్యం నేను ఫలానా అవిశ్వాసపరుడిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
لَقَدْ اَضَلَّنِیْ عَنِ الذِّكْرِ بَعْدَ اِذْ جَآءَنِیْ ؕ— وَكَانَ الشَّیْطٰنُ لِلْاِنْسَانِ خَذُوْلًا ۟
నిశ్ఛయంగా ఈ అవిశ్వాస స్నేహితుడు నన్ను ఖుర్ఆన్ నుండి అది ప్రవక్త మార్గము నుండి నాకు చేరిన తరువాత కూడా మార్గ భ్రష్టతకు లోను చేశాడు. మరియు షైతాను మానవునికి ఎక్కువ ద్రోహం చేసేవాడు, అతని పై ఏదైన దుఃఖము కలిగితే అతని నుండి తొలగిపోతాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالَ الرَّسُوْلُ یٰرَبِّ اِنَّ قَوْمِی اتَّخَذُوْا هٰذَا الْقُرْاٰنَ مَهْجُوْرًا ۟
ప్రవక్త ఆ రోజున తన జాతి వారి స్థితి గురించి ఫిరియాదు చేస్తూ ఇలా పలుకుతారు : ఓ నా ప్రభువా నీవు నన్ను పంపించిన నా జాతి వారు ఈ ఖుర్ఆన్ ను వదిలివేశారు. మరియు వారు దాని నుండి విముఖత చూపారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَكَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِیٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِیْنَ ؕ— وَكَفٰی بِرَبِّكَ هَادِیًا وَّنَصِیْرًا ۟
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారి నుండి బాధను,మీ మార్గము నుండి నిరోధమును పొందినట్లే మేము మీకన్న ముందు ప్రవక్తల్లోంచి ప్రతీ ప్రవక్తను అతని జాతి అపరాధుల్లోంచి శతృవులను తయారు చేశాము. సత్యము వైపునకు మార్గ దర్శకం చేసే మార్గ దర్శకుడిగా నీ ప్రభువు చాలు. మరియు నీ శతృవులకు విరుద్దంగా నీకు సహాయం చేసే సహాయకుడిగా ఆయన చాలు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَوْلَا نُزِّلَ عَلَیْهِ الْقُرْاٰنُ جُمْلَةً وَّاحِدَةً ۛۚ— كَذٰلِكَ ۛۚ— لِنُثَبِّتَ بِهٖ فُؤَادَكَ وَرَتَّلْنٰهُ تَرْتِیْلًا ۟
మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు ఇలా పలికారు : ఎందుకని ఈ ఖుర్ఆన్ ప్రవక్త పై ఒకే సారి అవతరించకుండా వేరు వేరుగా అవతరించింది. ఓ ప్రవక్తా ఈ విధంగా మేము ఖుర్ఆన్ ను వేరు వేరుగా ఒక దాని తరువాత ఒక దానిని మీ హృదయమును స్థిరపరచటానికి అవతరింపజేశాము. మరియు మేము దాన్ని కొద్ది కొద్దిగా దానిని అర్ధం చేసుకోవటం,దానిని కంఠస్తం చేయటం సులభమవటానికి అవతరింపజేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الكفر مانع من قبول الأعمال الصالحة.
సత్కర్మలు స్వీకరించబడటం నుండి అవిశ్వాసము ఆటంకమవుతుంది.

• خطر قرناء السوء.
చెడు స్నేహితుల అపాయము.

• ضرر هجر القرآن.
ఖుర్ఆన్ ను వదిలివేటం యొక్క నష్టము.

• من حِكَمِ تنزيل القرآن مُفَرّقًا طمأنة النبي صلى الله عليه وسلم وتيسير فهمه وحفظه والعمل به.
ఖుర్ఆన్ ను విడి విడిగా అవతరింపజేయటం యొక్క విజ్ఞత ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు భరోసా,దానిని అర్ధం చేసుకోవటమును ,దాన్ని కంఠస్తం చేయటమును, దానిపై ఆచరించటమును సులభతరం చేయటం.

وَلَا یَاْتُوْنَكَ بِمَثَلٍ اِلَّا جِئْنٰكَ بِالْحَقِّ وَاَحْسَنَ تَفْسِیْرًا ۟ؕ
ఓ ప్రవక్తా ముష్రికులు మీ వద్దకు వారు ప్రతిపాదించిన వాటిలో నుంచి ఏ ఉమానమును తీసుకుని వచ్చినా మేము దానిపై మీ వద్దకు సరైన దృడమైన సమాధానం తీసుకుని వచ్చాము,వివరణపరంగా మంచిగా ఉండే దానిని మీ వద్దకు తీసుకుని వచ్చాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَلَّذِیْنَ یُحْشَرُوْنَ عَلٰی وُجُوْهِهِمْ اِلٰی جَهَنَّمَ ۙ— اُولٰٓىِٕكَ شَرٌّ مَّكَانًا وَّاَضَلُّ سَبِیْلًا ۟۠
ఎవరైతే ప్రళయ దినాన తమ ముఖములపై పడుకోబెట్టి ఈడ్చబడుతూ నరకం వద్దకు తీసుకుని రాబడుతారో వారందరు చెడ్డ నివాసం కలవారు. ఎందుకంటే వారి నివాస స్థలము నరకము. మరియు సత్యము నుండి చాలా దూరపు మర్గము కలవారు. ఎందుకంటే వారి మార్గము అవిశ్వాస మార్గము,మార్గ భ్రష్టతపు మార్గము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَجَعَلْنَا مَعَهٗۤ اَخَاهُ هٰرُوْنَ وَزِیْرًا ۟ۚۖ
మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాంనకు తౌరాతును ప్రసాదించాము. మరియు ఆయనతో పాటు ఆయన సోదరుడైన హారూన్ అలైహిస్సలాంను ఆయనకు సహాయకునిగా అవటం కొరకు ప్రవక్తగా చేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
فَقُلْنَا اذْهَبَاۤ اِلَی الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— فَدَمَّرْنٰهُمْ تَدْمِیْرًا ۟ؕ
అప్పుడు మేము వారిని ఇలా ఆదేశించాము : మీరిద్దరూ మా ఆయతులను తిరస్కరించిన ఫిర్ఔన్,అతని జాతి వారి వద్దకు వెళ్ళండి. అప్పుడు వారు మా ఆదేశమును పాటించారు. మరియు వారిద్దరు వారి వద్దకు వెళ్ళి వారిని అల్లాహ్ ఏకత్వము వైపునకు పిలిచారు. అప్పుడు వారు వారిద్దరిని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని తీవ్రంగా వినాశనమునకు గురి చేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَقَوْمَ نُوْحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ اَغْرَقْنٰهُمْ وَجَعَلْنٰهُمْ لِلنَّاسِ اٰیَةً ؕ— وَاَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ عَذَابًا اَلِیْمًا ۟ۚۙ
మరియు నూహ్ జాతి వారు ఎప్పుడైతే వారు నూహ్ అలైహిస్సలాంను తిరస్కరించి ప్రవక్తలందరిని తిరస్కరించారో వారిని మేము సముద్రంలో ముంచి వినాశనమునకు గురి చేశాము. మరియు మేము వారి వినాశనమును దుర్మార్గులను కూకటి వ్రేళ్ళతో నాశనం చేయటంపై మా సామర్ధ్యము పై ఆధారంగా చేశాము. మరియు మేము దుర్మార్గుల కొరకు ప్రళయదినాన బాధాకరమైన శిక్షను సిధ్ధం చేసి ఉంచాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَّعَادًا وَّثَمُوْدَاۡ وَاَصْحٰبَ الرَّسِّ وَقُرُوْنًا بَیْنَ ذٰلِكَ كَثِیْرًا ۟
మరియు మేము హూద్ అలైహిస్సలాం జాతి ఆద్ ను,సాలిహ్ అలైహిస్సలాం జాతి సమూద్ ను తుదిముట్టించాము. మరియు మేము బావి వారిని తుదిముట్టించాము. మరియు మేము ఈ మూడు జాతుల వారి మధ్య చాలా సమాజాలను నాశనం చేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَكُلًّا ضَرَبْنَا لَهُ الْاَمْثَالَ ؗ— وَكُلًّا تَبَّرْنَا تَتْبِیْرًا ۟
మరియు మేము వినాశనమునకు గురైన వీరందరిలోంచి ప్రతి ఒక్కరిని పూర్వ సమాజాల వినాశనమును,దాని కారణాలను వారు హితబోధన గ్రహిస్తారని స్పష్టపరిచాము. ప్రతి ఒక్కరిని మేము వారి అవిశ్వాసం వలన, వారి వ్యతిరేకత వలన తీవ్రంగా వినాశనమునకు గురిచేశాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَلَقَدْ اَتَوْا عَلَی الْقَرْیَةِ الَّتِیْۤ اُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ؕ— اَفَلَمْ یَكُوْنُوْا یَرَوْنَهَا ۚ— بَلْ كَانُوْا لَا یَرْجُوْنَ نُشُوْرًا ۟
మరియు నిశ్ఛయంగా మీ జాతి వారిలో నుంచి తిరస్కరించిన వారు షామ్ (సిరియా) ప్రాంతము వైపు తమ ప్రయాణంలో అశ్లీల చర్యకు పాల్పడటంపై శిక్షగా రాళ్ల వర్షం కురిపించబడిన లూత్ జాతి వారి బస్తీ వైపునకు వచ్చారు గుణపాఠం నేర్చుకోవటానికి. ఏమీ వారు ఈ బస్తీ నుండి అందులు అయిపోయి దాన్ని చూడ లేదా ?. కాదు కాని వారు మరణాంతర లేప బడటము పై దాని తరువాత వారి లెక్క తీసుకో బడుతుంది అనే నమ్మకమును ఉంచలేదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَاِذَا رَاَوْكَ اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ— اَهٰذَا الَّذِیْ بَعَثَ اللّٰهُ رَسُوْلًا ۟
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరు నీకు ఎదురైనప్పుడు వారు ఎగతాళిగా,తిరస్కారముగా ఇలా పలుకుతూ నిన్ను అవహేళన చేసేవారు : ఏమి అల్లాహ్ మా వద్దకు ప్రవక్తగా పంపించినది ఇతడేనా ?!.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اِنْ كَادَ لَیُضِلُّنَا عَنْ اٰلِهَتِنَا لَوْلَاۤ اَنْ صَبَرْنَا عَلَیْهَا ؕ— وَسَوْفَ یَعْلَمُوْنَ حِیْنَ یَرَوْنَ الْعَذَابَ مَنْ اَضَلُّ سَبِیْلًا ۟
నిశ్చయంగా అతడు మా ఆరాధ్య దైవాల ఆరాధన నుండి మమ్మల్ని మరల్చేసే వాడే. ఒక వేళ మేము వాటి ఆరాధనపై స్థిరంగా ఉండకపోతే అతడు తన వాదనల ద్వారా,తన ఆధారాల ద్వారా మమ్మల్ని వాటి నుండి మరల్చేసేవాడు. వారు తమ సమాదులలో,ప్రళయ దినాన శిక్షను కళ్ళారా చూసినప్పుడు ఎక్కువగా అపమార్గమునకు లోనైనవాడు వారా లేదా అతడా ? ఎవరో వారు తొందరలోనే తెలుసుకుంటారు. మరియు వారిలో నుండి ఎవడు ఎక్కువ అపమార్గమునకు లోనయ్యాడో తొందరలోనే వారు తెలుసుకుంటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ ؕ— اَفَاَنْتَ تَكُوْنُ عَلَیْهِ وَكِیْلًا ۟ۙ
ఓ ప్రవక్తా ఎవడైతే తన మనోవాంఛలను ఆరాధ్య దైవంగా చేసుకుని దాన్ని అనుసరించాడో అతడిని మీరు చూశారా ?. ఏమీ మీరు అతడిని విశ్వాసము వైపునకు మరల్చి,అతడిని అవిశ్వాసము నుండి ఆపి అతనిపై మీరు సంరక్షకుడిగా అవుతారా ?!.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الكفر بالله والتكذيب بآياته سبب إهلاك الأمم.
అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయన ఆయతులను తిరస్కరించటం సమాజాల వినాశనమునకు కారణం.

• غياب الإيمان بالبعث سبب عدم الاتعاظ.
మరణాంతరం లేపబడటంపై విశ్వాసం లేకపోవటం హితబోధన గ్రహించకపోవటానికి కారణం.

• السخرية بأهل الحق شأن الكافرين.
సత్యపరులపట్ల అవహేళన చేయటం అవిశ్వాసపరుల లక్షణం.

• خطر اتباع الهوى.
మనోవాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం.

اَمْ تَحْسَبُ اَنَّ اَكْثَرَهُمْ یَسْمَعُوْنَ اَوْ یَعْقِلُوْنَ ؕ— اِنْ هُمْ اِلَّا كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ سَبِیْلًا ۟۠
లేక ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ఏకత్వము వైపునకు,ఆయనపై విధేయత చూపటం వైపునకు మీరు పిలుస్తున్న వారు చాలామంది స్వీకరించే ఉద్దేశంతో వింటున్నారని లేదా వారు వాదనలను,ఆధారాలను అర్ధం చేసుకుంటారని మీరు భావిస్తున్నారా ?!. వారు వినటంలో,అర్ధం చేసుకోవటంలో,గ్రహించటంలో జంతువుల్లాంటి వారు మాత్రమే. అంతేకాదు వారు జంతువుల కంటే ఎక్కువగా మార్గం తప్పినవారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اَلَمْ تَرَ اِلٰی رَبِّكَ كَیْفَ مَدَّ الظِّلَّ ۚ— وَلَوْ شَآءَ لَجَعَلَهٗ سَاكِنًا ۚ— ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَیْهِ دَلِیْلًا ۟ۙ
ఓ ప్రవక్తా అల్లాహ్ సృష్టి సూచనల వైపు ఆయన భూ ఉపరితలంపై నీడను విస్తరింపజేసిన వేళ మీరు చూడలేదా. మరియు ఒక వేళ ఆయన దాన్ని కదలకుండ స్థిరంగా ఉండేటట్లు చేయదలచుకుంటే అలాగే ఆయన దాన్ని చేస్తాడు. ఆ తరువాత మేము సూర్యుడిని దానిపై సూచనగా చేశాము. అది దానితోపాటు పొడుగు అవుతుంది,చిన్నది అవుతుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ثُمَّ قَبَضْنٰهُ اِلَیْنَا قَبْضًا یَّسِیْرًا ۟
ఆ తరువాత మేము నీడను తగ్గించి లాక్కున్నాము అది క్రమక్రమంగా కొద్దికొద్దిగా సూర్యుడు పైకి లేసే లెక్కను బట్టి కొద్దిగా లాక్కున్నాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَهُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِبَاسًا وَّالنَّوْمَ سُبَاتًا وَّجَعَلَ النَّهَارَ نُشُوْرًا ۟
మరియు అల్లాహ్ ఆయనే మీ కొరకు రాత్రిని మిమ్మల్ని కప్పే,వస్తువులను కప్పే వస్త్రం స్థానంలో చేశాడు. మరియు ఆయనే మీ కొరకు నిద్రను మీ తీరికలేమి నుండి మీరు విశ్రాంతి తీసుకునే విశ్రాంతిగా చేశాడు. మరియు ఆయనే మీ కొరకు పగటిని మీ కర్మల వైపు మీరు నడిచి వెళ్ళే సమయంగా చేశాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَهُوَ الَّذِیْۤ اَرْسَلَ الرِّیٰحَ بُشْرًاۢ بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ۚ— وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً طَهُوْرًا ۟ۙ
మరియు ఆయనే గాలులను తన దాసులపై తన కారుణ్యములో నుంచి అయిన వర్షము కురవటం గురించి శుభవార్తనిచ్చేవానిగా పంపించాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని శుద్ధ పరిచే వానిగా కురిపించాము వారు దానితో శుద్ధతను పొందుతారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
لِّنُحْیِ بِهٖ بَلْدَةً مَّیْتًا وَّنُسْقِیَهٗ مِمَّا خَلَقْنَاۤ اَنْعَامًا وَّاَنَاسِیَّ كَثِیْرًا ۟
ఆ కురిసే నీటి ద్వారా మేము ఎటువంటి మొక్కలు లేని ఒక బంజరు భూమిని రకరకాల మొక్కలను అందులో మొలకెత్తించటం ద్వారా,అందులో పచ్చికను వ్యాపింపజేయటం ద్వారా జీవింపజేయటానికి, ఆ నీటిని మేము సృష్టించిన చాలా పశువులను మానవులను త్రాపించటానికి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَلَقَدْ صَرَّفْنٰهُ بَیْنَهُمْ لِیَذَّكَّرُوْا ۖؗ— فَاَبٰۤی اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا ۟
మరియు నిశ్ఛయంగా మేము రకరకాల వాదనలను,ఆధారాలను వారు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి స్పష్టపరచాము. కాని చాలా మంది ప్రజలు సత్యాన్ని తిరస్కరించారు. దాన్ని నిరాకరించారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِیْ كُلِّ قَرْیَةٍ نَّذِیْرًا ۟ؗۖ
మరియు ఒక వేళ మేము తలచుకుంటే ప్రతీ ఊరిలో వారిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించటానికి,భయపెట్టటానికి ఒక ప్రవక్తను పంపించే వారము. కానీ మేము అలా తలచుకోలేదు. మరియు మేము మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సమస్త మానవాళి వైపునకు ప్రవక్తగా పంపించాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
فَلَا تُطِعِ الْكٰفِرِیْنَ وَجَاهِدْهُمْ بِهٖ جِهَادًا كَبِیْرًا ۟
మరియు మీరు అవిశ్వాసపరులు తమ ముఖస్థుతితో మీతో కోరిన వాటి విషయంలో,వారు ప్రవేశపెట్టే ప్రతిపాదనల విషయంలో వారి మాట వినకండి. మరియు మీరు మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ద్వారా వారు కలిగిస్తున్న బాధలపై సహనంతో, అల్లాహ్ వైపునకు వారిని పిలవటంలో బాధలను భరించటంతొ గొప్ప పోరాటమును చేయండి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَهُوَ الَّذِیْ مَرَجَ الْبَحْرَیْنِ هٰذَا عَذْبٌ فُرَاتٌ وَّهٰذَا مِلْحٌ اُجَاجٌ ۚ— وَجَعَلَ بَیْنَهُمَا بَرْزَخًا وَّحِجْرًا مَّحْجُوْرًا ۟
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ యే రెండు సముద్రముల నీటిని కలిపాడు. వాటిలో నుండి తీపి దాన్ని ఉప్పగా ఉన్న దానితో ఆయన కలిపాడు. మరియు ఆయన వాటిని కలవకుండా ఆపటానికి ఒక అడ్డును,ఒక అడ్డు తెరను తయారు చేశాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَهُوَ الَّذِیْ خَلَقَ مِنَ الْمَآءِ بَشَرًا فَجَعَلَهٗ نَسَبًا وَّصِهْرًا ؕ— وَكَانَ رَبُّكَ قَدِیْرًا ۟
మరియు ఆయనే పురుషుని,స్త్రీ వీర్యపు బిందువుతో మనిషిని సృష్టించాడు. మరియు ఎవరైతే మనిషిని సృష్టించాడో ఆయనే వంశ బంధుత్వాన్ని, వివాహ బంధుత్వాన్ని సృష్టించాడు. ఓ ప్రవక్తా మీ ప్రభువుని ఎవరూ అశక్తుడిని చేయని సమర్ధుడు. మానవుడిని పురుషుని,స్త్రీ వీర్యపు బిందువుతో సృష్టించటం ఆయన సామర్ధ్యంలో నుండే.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُهُمْ وَلَا یَضُرُّهُمْ ؕ— وَكَانَ الْكَافِرُ عَلٰی رَبِّهٖ ظَهِیْرًا ۟
మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఒక వేళ వారు వాటికి విధేయత చూపితే అవి వారికి లాభం చేకూర్చలేవు,ఒక వేళ వారు వాటికి అవిధేయత చూపితే అవి వారికి నష్టం చేకూర్చలేవు. మరియు అవిశ్వాసపరుడు పరిశుద్ధుడైన అల్లాహ్ ను ఆగ్రహపరిచే వాటిలో షైతానును అనుసరించేవాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• انحطاط الكافر إلى مستوى دون مستوى الحيوان بسبب كفره بالله.
అల్లాహ్ పట్ల తన అవిశ్వాసము వలన అవిశ్వాసపరుడు జంతువు యొక్క స్థాయికంటే తక్కువ స్థాయికి దిగజారిపోవటం.

• ظاهرة الظل آية من آيات الله الدالة على قدرته.
నీడ యొక్క దృగ్విషయం అల్లాహ్ సామర్ధ్యము పై సూచించే సూచనల్లోంచి ఒక సూచన.

• تنويع الحجج والبراهين أسلوب تربوي ناجح.
వాదనలను,ఆధారాలను వైవిధ్యపరచటం ఒక సాఫల్యమైన శిక్షణా పధ్దతి.

• الدعوة بالقرآن من صور الجهاد في سبيل الله.
ఖుర్ఆన్ ద్వారా పిలవటం (దావత్ చేయటం) అల్లాహ్ మార్గంలో పోరాటం యొక్క రూపముల్లోంచిది.

وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا مُبَشِّرًا وَّنَذِیْرًا ۟
ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని విశ్వాసము ద్వారా,సత్కర్మ ద్వారా అల్లాహ్ కి విధేయత చూపే వాడి కొరకు శుభవార్తనిచ్చే వాడిగా మరియు అవిశ్వాసము ద్వారా,అవిధేయత ద్వారా ఆయనకు అవిధేయత చూపే వారి కొరకు హెచ్చరించే వాడిగా మాత్రమే పంపించాము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ مَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ اِلَّا مَنْ شَآءَ اَنْ یَّتَّخِذَ اِلٰی رَبِّهٖ سَبِیْلًا ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : సందేశాలను చేరవేయటంపై నేను మీతో ఎటువంటి పుణ్యాన్ని ఆశించటం లేదు. కాని మీలో నుండి ఎవరైన అల్లాహ్ ఇచ్ఛల వైపు ఖర్చు చేయటం ద్వారా ఏదైన మార్గం ఎంచుకో దలిస్తే చేయండి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَتَوَكَّلْ عَلَی الْحَیِّ الَّذِیْ لَا یَمُوْتُ وَسَبِّحْ بِحَمْدِهٖ ؕ— وَكَفٰی بِهٖ بِذُنُوْبِ عِبَادِهٖ خَبِیْرَا ۟
ఓ ప్రవక్తా మీరు మీ వ్యవహారాలన్నింటిలో ఎన్నటికి మరణించకుండా నిత్యం జీవించి ఉండే అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. పరిశుద్ధుడైన ఆయన స్థుతులను పలుకుతూ ఆయన పరిశుద్ధతను కొనియాడండి. మరియు తన దాసుల పాపములను తెలుసుకునే వాడిగా ఆయన చాలు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటిపరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
١لَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ ۛۚ— اَلرَّحْمٰنُ فَسْـَٔلْ بِهٖ خَبِیْرًا ۟
ఆయనే ఆకాశములను,భూమిని,ఆ రెండింటి మధ్య ఉన్నవాటిని ఆరు దినములలో సృష్టించాడు. ఆ తరువాత ఆయన లేచి ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా సింహాసనమును అధీష్టించాడు. ఆయన అనంత కరుణామయుడు. అయితే ఓ ప్రవక్తా మీరు ఆయన గురించి తెలిసిన వాడిని అడగండి. మరియు ఆయన ప్రతీది తెలిసిన అల్లాహ్. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَاِذَا قِیْلَ لَهُمُ اسْجُدُوْا لِلرَّحْمٰنِ ۚ— قَالُوْا وَمَا الرَّحْمٰنُ ۗ— اَنَسْجُدُ لِمَا تَاْمُرُنَا وَزَادَهُمْ نُفُوْرًا ۟
మరియు అవిశ్వాసపరులతో మీరు అనంత కరుణామయుడిని సాష్టాంగపడండి అని పలికినప్పుడు వారు ఇలా పలికారు : మేము అనంత కరుణామయుడిని సాష్టాంగపడము,అనంత కరుణామయుడు ఎవడూ ?,అతను మాకు తెలియదు,మేము అతన్ని అంగీకరించము. ఏమీ మీరు సాష్టాంగపడమని మమ్మల్ని ఆదేశించిన అతనికి మేము సాష్టాంగపడాలా ?, వాస్తవానికి అతను మాకు తెలియదు ?!. వారికి ఆయనకు సాష్టాంగపడమని ఆయన ఆదేశం వారిని అల్లాహ్ పై విశ్వాసము నుండి దూరమును పెంచివేసింది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
تَبٰرَكَ الَّذِیْ جَعَلَ فِی السَّمَآءِ بُرُوْجًا وَّجَعَلَ فِیْهَا سِرٰجًا وَّقَمَرًا مُّنِیْرًا ۟
ఎవరైతే ఆకాశములో గ్రహాల,కారు నక్షత్రాల నివాసములను చేశాడో మరియు ఆకాశములో కాంతిని వ్యాపింపజేసే సూర్యుడిని చేశాడో మరియు ఆయన సూర్య కాంతి నుండి ప్రతిబింబించటం ద్వారా భూమిని కాంతివంతము చేసే చంద్రుడును అందులో సృష్టించాడో అతడు శుభదాయకుడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَهُوَ الَّذِیْ جَعَلَ الَّیْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ اَرَادَ اَنْ یَّذَّكَّرَ اَوْ اَرَادَ شُكُوْرًا ۟
మరియు అల్లాహ్ ఆయనే రాత్రిని మరియు భూమిని ఒక దాని వెనుక ఒకటి వచ్చే విధంగా చేశాడు వాటిలో నుండి ఒకటి ఇంకొక దాని వెనుక వస్తుంది మరియు అది దానికి వెనుక వస్తుంది. ఇవన్ని అల్లాహ్ సూచనలతో గుణపాఠం నేర్చుకుని సన్మార్గం పై రావాలనుకునే వారి కొరకు,లేదా అల్లాహ్ అనుగ్రహాలపై అల్లాహ్ కి కృతజ్ఞతలు తెలుపుకోదలచిన వారి కొరకు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَعِبَادُ الرَّحْمٰنِ الَّذِیْنَ یَمْشُوْنَ عَلَی الْاَرْضِ هَوْنًا وَّاِذَا خَاطَبَهُمُ الْجٰهِلُوْنَ قَالُوْا سَلٰمًا ۟
మరియు అనంత కరుణామయుడి విశ్వాసపరులైన దాసులు వారే ఎవరంటే భూమిపై వినయంతో,అణుకువతో నడుస్తారో. మరియు అజ్ఞానులు వారితో సంభాషించినప్పుడు వారు అదేవిధంగా వారితో పిడి వాదన చేయరు. అంతే కాదు వారు వారితో ఎంత మంచిగా మట్లాడుతారంటే అందులో వారు వారిపై అజ్ఞానమును చూపరు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ یَبِیْتُوْنَ لِرَبِّهِمْ سُجَّدًا وَّقِیَامًا ۟
మరియు వారే ఎవరైతే తమ నుదుటులపై సాష్టాంగపడుతూ,తమ కాళ్ళపై నిలబడుతూ అల్లాహ్ కొరకు నమాజును చదువుతూ రాత్రిని గడుపుతారో.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖۗ— اِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا ۟ۗۖ
మరియు వారే ఎవరైతే తమ దుఆలలో తమ ప్రభువుతో ఇలా పలుకుతారో : ఓ మా ప్రభువా నీవు మా నుండి నరక శిక్షను దూరం చేయి. నిశ్ఛయంగా నరక శిక్ష అవిశ్వాసపరునిగా మరణించే వాడికి శాస్వతంగా అట్టిపెట్టుకుని ఉంటుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اِنَّهَا سَآءَتْ مُسْتَقَرًّا وَّمُقَامًا ۟
నిశ్ఛయంగా అందులో ఆశ్రయం పొందేవారి కొరకు అది చెడ్డ ఆశ్రయ స్థలము,అందులో నివాసముండే వారి కొరకు చెడ్డ నివాసము అవుతుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ اِذَاۤ اَنْفَقُوْا لَمْ یُسْرِفُوْا وَلَمْ یَقْتُرُوْا وَكَانَ بَیْنَ ذٰلِكَ قَوَامًا ۟
మరియు వారే ఎవరైతే తమ సంపదలను ఖర్చు చేసినప్పుడు తమ ఖర్చు చేయటంలో వృధా చేసే హద్దుకు చేరరో. మరియు దాన్ని తమలో నుండి లేదా ఇతరులలో నుండి ఎవరి పై ఖర్చు చేయటం అనివార్యమో వారిపై ఖర్ఛు చేయటంలో ఇబ్బంది పెట్టరో. మరియు వారి ఖర్చు చేయటం దుబారా చేయటానికి,పిసినారితనానికి మధ్యలో న్యాయపూరితంగా ఉంటుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الداعي إلى الله لا يطلب الجزاء من الناس.
అల్లాహ్ వైపు పిలిచే వాడు ప్రజలతో ప్రతిఫలాన్ని ఆశించడు.

• ثبوت صفة الاستواء لله بما يليق به سبحانه وتعالى.
అల్లాహ్ కు అధీష్టించే గుణము పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయనకు తగిన విధంగా ఉన్నదని నిరూపణ.

• أن الرحمن اسم من أسماء الله لا يشاركه فيه أحد قط، دال على صفة من صفاته وهي الرحمة.
అర్రహ్మాన్ (అనంత కరుణామయుడు) అల్లాహ్ నామముల్లోంచి ఒక నామము. అందులో ఎవరూ ఎన్నడూ ఆయనకు భాగస్వామి కాజాలడు. ఆయన గుణముల్లోంచి ఒక గుణము అయిన కరుణను సూచించేది.

• إعانة العبد بتعاقب الليل والنهار على تدارُكِ ما فاتَهُ من الطاعة في أحدهما.
దాసుడికి రాత్రి,పగలు ఒక దాని వెనుక తీసుకుని రావటం ద్వారా వాటిలో నుండి ఏ ఒక దానిలో విధేయత కార్యాల్లోంచి తాను కోల్పోయిన దాన్ని తిరగబెట్టటానిక దాసునికి సహాయం చేయటం.

• من صفات عباد الرحمن التواضع والحلم، وطاعة الله عند غفلة الناس، والخوف من الله، والتزام التوسط في الإنفاق وفي غيره من الأمور.
అణుకువ,సహనము,ప్రజలు పరధ్యానంలో ఉన్నప్పుడు అల్లాహ్ కు విధేయత చూపటం,అల్లాహ్ నుండి భయపడటం ఖర్చు చేయటంలో,ఇతర వ్యవహారముల్లో మధ్యే మార్గమును అట్టిపెట్టుకుని ఉండటం కారుణామయుడి దాసుల గుణాలు.

وَالَّذِیْنَ لَا یَدْعُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ وَلَا یَقْتُلُوْنَ النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ وَلَا یَزْنُوْنَ ۚؕ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ یَلْقَ اَثَامًا ۟ۙ
మరియు వారే ఎవరైతే పరిశుద్ధుడైన అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాన్ని ఆరాధించరో, అల్లాహ్ హత్య చేయటమును అనుమతించిన హత్య చేసిన వాడు,ధర్మం నుంచి మరలిపోయిన వాడు,వ్యభిచారం చేసిన వివాహితుడిని తప్ప అల్లాహ్ నిషేధించిన ప్రాణములను హతమార్చరో,వ్యభిచారము చేయరో. మరియు ఎవరైతే ఈ మహా పాపములను చేస్తాడో అతడు ప్రళయదినాన తాను పాల్పడిన పాపమునకు పర్యవసనమును పొందుతాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
یُّضٰعَفْ لَهُ الْعَذَابُ یَوْمَ الْقِیٰمَةِ وَیَخْلُدْ فِیْهٖ مُهَانًا ۟ۗۖ
ప్రళయదినాన అతనికి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. మరియు అతడు శిక్షలో అవమానమునకు,పరాభవమునకు లోనై శాస్వతంగా ఉంటాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَاُولٰٓىِٕكَ یُبَدِّلُ اللّٰهُ سَیِّاٰتِهِمْ حَسَنٰتٍ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟
కానీ ఎవరైతే అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడి,విశ్వసించి,తన పశ్చాత్తాపము నిజమవటంపై సూచించే సత్కర్మను చేస్తాడో అల్లాహా్ వారందరు చేసుకున్న పాపములను పుణ్యాలుగా మార్చి వేస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَمَنْ تَابَ وَعَمِلَ صَالِحًا فَاِنَّهٗ یَتُوْبُ اِلَی اللّٰهِ مَتَابًا ۟
మరియు ఎవరైతే అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడి, విధేయ కార్యాలు చేయటం ద్వారా, పాపకార్యములను విడనాడటం ద్వారా తన పశ్ఛాత్తాపము నిజమవటానికి ఆధారం చూపుతాడో నిశ్ఛయంగా అతని పశ్చాత్తాపము స్వీకరించబడిన పశ్ఛాత్తాపము.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ لَا یَشْهَدُوْنَ الزُّوْرَ ۙ— وَاِذَا مَرُّوْا بِاللَّغْوِ مَرُّوْا كِرَامًا ۟
వారే ఎవరైతే పాప కార్యాల ప్రదేశాలు,నిషిద్ధ వినోద ప్రదేశాల్లాంటి అసత్యములుండే చోటు సమావేసమవ్వరో. మరియు వారు దిగజారిన మాటలు,చేష్టలు లాంటి నిష్ప్రయోజనమైన వాటి వద్ద నుండి వేళ్ళినప్పుడు దాటుకుంటూ వెళ్ళి పోతారో. తమ మనస్సులను దానిలో కలవకుండా జాగ్రత్త పడటంతో గౌరవించుకుంటూ ఉంటారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ اِذَا ذُكِّرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ لَمْ یَخِرُّوْا عَلَیْهَا صُمًّا وَّعُمْیَانًا ۟
వారే ఎవరైతే వినిపించబడిన,చూపించబడిన అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయించబడినప్పుడు వారి చెవులు వినిపించబడే ఆయతుల నుండి చెవిటివి కావు మరియు వారు చూపించబడే ఆయతుల నుండి అంధులు కారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
وَالَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَا هَبْ لَنَا مِنْ اَزْوَاجِنَا وَذُرِّیّٰتِنَا قُرَّةَ اَعْیُنٍ وَّاجْعَلْنَا لِلْمُتَّقِیْنَ اِمَامًا ۟
వారే ఎవరైతే తమ ప్రభువుతో తమ దుఆలలో ఇలా వేడుకుంటారో : ఓ మా ప్రభువా మా భార్యల్లోంచి,మా సంతానములో నుంచి ఎవరైతే తన దైవ భీతి వలన, సత్యముపై తన స్థిరత్వము వలన మాకు కంటి చలువ అవుతాడో వారిని మాకు ప్రసాదించు. మరియు నీవు సత్యం విషయంలో మమ్మల్ని అనుసరించడానికి దైవభీతి కలవారి కొరకు మమ్మల్ని నాయకులుగా చేయి.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
اُولٰٓىِٕكَ یُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوْا وَیُلَقَّوْنَ فِیْهَا تَحِیَّةً وَّسَلٰمًا ۟ۙ
ఈ గుణాలతో వర్ణించబడినవారందరు అల్లాహ్ కు విధేయత చూపటం పై సహనం వహించటం వలన స్వర్గములోని ఉన్నత ఫిరదౌసులో ఉన్నతమైన స్థానాలను ప్రతిఫలంగా ప్రసాదించబడుతారు. మరియు వారికి వాటిలో దైవ దూతల ద్వారా స్వాగతం,శాంతి లభిస్తాయి. మరియు వారు వాటిలో ఆపదల నుండి రక్షించబడుతారు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
خٰلِدِیْنَ فِیْهَا ؕ— حَسُنَتْ مُسْتَقَرًّا وَّمُقَامًا ۟
వారు వాటిలో శాస్వతంగా నివాసముంటారు. వారు ఆశ్రయం పొందే ఆశ్రయ స్థలము,వారు నివాసముండే నివాస స్థలము ఎంతో రమణీయమైనది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
قُلْ مَا یَعْبَؤُا بِكُمْ رَبِّیْ لَوْلَا دُعَآؤُكُمْ ۚ— فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ یَكُوْنُ لِزَامًا ۟۠
ఓ ప్రవక్తా తమ అవిశ్వాసంలో మొండిగా ఉన్న అవిశ్వాసపరులతో ఇలా పలకండి : నా ప్రభువు మీ విధేయత ప్రయోజనం ఆయనకు కలుగుతుందని మిమ్మల్ని పట్టించుకోడు. ఒక వేళ ఆయనను ఆరాధన మొర పెట్టుకునే,అవసరాల మొర పెట్టుకునే ఆయన దాసులే లేకుండా ఉంటే ఆయన మిమ్మల్ని పట్టించుకునే వాడే కాడు. నిశ్ఛయంగా మీరు ప్రవక్తను ఆయన మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో తిరస్కరించారు. తొందరలోనే తిరస్కరించటం యొక్క ప్రతిఫలము మీకు చుట్టుకుంటుంది.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• من صفات عباد الرحمن: البعد عن الشرك، وتجنُّب قتل الأنفس بغير حق، والبعد عن الزنى، والبعد عن الباطل، والاعتبار بآيات الله، والدعاء.
షిర్కు నుండి దూరంగా ఉండటం, అన్యాయంగా ప్రాణాలను తీయటం నుండి జాగ్రత్తపడటం,వ్యభిచారము నుండి దూరంగా ఉండటం, నిష్ప్రయోజన కార్యాల నుండి దూరంగా ఉండటం,అల్లాహ్ ఆయతులతో గుణపాఠం నేర్చుకోవటం, దుఆ చేయటం కరుణామయుడి దాసుల గుణాలు.

• التوبة النصوح تقتضي ترك المعصية وفعل الطاعة.
సత్యమైన పశ్చాత్తాపము పాప కార్యములను విడనాడటం,విధేయకార్యాలను చేయటమును నిర్ణయిస్తుంది.

• الصبر سبب في دخول الفردوس الأعلى من الجنة.
స్వర్గములోని ఫిరదౌసు ఉన్నత స్థానాల్లో ప్రవేశమునకు సహనము ఒక కారణం.

• غنى الله عن إيمان الكفار.
అల్లాహ్ అవిశ్వాసపరుల విశ్వాసము అవసరము లేనివాడు.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߝߐߘߊ ߘߏ߫: ߝߊߙߊ߲ߝߊߛߌ ߝߐߘߊ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

ߘߊߕߎ߲߯ߠߌ߲