Check out the new design

Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. * - Index van vertaling


Vertaling van de betekenissen Vers: (33) Surah: al-Israa
وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ— وَمَنْ قُتِلَ مَظْلُوْمًا فَقَدْ جَعَلْنَا لِوَلِیِّهٖ سُلْطٰنًا فَلَا یُسْرِفْ فِّی الْقَتْلِ ؕ— اِنَّهٗ كَانَ مَنْصُوْرًا ۟
మరియు మీరు అల్లాహ్ ఏ ప్రాణము యొక్క రక్తమును విశ్వాసము ద్వారా లేదా రక్షణ ద్వారా పరిరక్షించాడో ఆ ప్రాణమును చంపకండి. ఒక వేళ అతను విశ్వాసము నుండి తిరిగిపోవటం ద్వారా లేదా శీలము తరువాత వ్యభిచారము చేయటం ద్వారా లేదా ప్రతీకార న్యాయము ద్వారా ప్రాణము తీయటం అనివార్యం అయితే తప్ప. ఎవరిదైన ప్రాణం తీయటమునకు సమ్మతం అవటానికి ఎటువంటి కారణం లేకుండా దుర్మార్గంగా ప్రాణం తీయబడితే నిశ్చయంగా మేము అతని వ్యవహారమునకు దగ్గరగా ఉన్న అతని వారసులకు అతని ప్రాణం తీసిన వారిపై ఆధిక్యతను ప్రసాధించాము. అప్పుడు అతని కొరకు అతని ప్రాణం తీయటము పై ప్రతీకార న్యాయమును అడగాలి. మరియు అతని కొరకు ఎటువంటి బదులు లేకుండా మన్నించే హక్కు ఉన్నది, పరిహారము తీసుకోవటంతోపాటు మన్నించే హక్కు ఉన్నది. అయితే అతను హంతకుని విషయంలోఉన్నది ఉన్నట్లుగా వ్యవహరించటం ద్వారా లేదా అతను హత్య చేసిన దానితో కాకుండా వేరేదానితో హత్య చేయటం ద్వారా లేదా హంతకుని వదిలి వేరే వారిని హత్య చేయటం ద్వారా అల్లాహ్ అతని కొరకు సమ్మతం చేసిన హద్దును అతిక్రమించకూడదు. నిశ్చయంగా అతడు మద్దతు ఇవ్వబడినవాడును,సహాయం చేయబడిన వాడును.
Arabische uitleg van de Qur'an:
Voordelen van de verzen op deze pagina:
• الأدب الرفيع هو رد ذوي القربى بلطف، ووعدهم وعدًا جميلًا بالصلة عند اليسر، والاعتذار إليهم بما هو مقبول.
ఉన్నతమైన గుణం ఏమిటంటే దగ్గరి బంధువులను సున్నితంగా ప్రతిస్పందించటం. మరియు వారికి బంధుత్వముతో సులభతరమున్నప్పుడు మంచి వాగ్ధానం చేయటం, వారితో ఆమోదయోగ్యమైన క్షమాపణ కోరటం.

• الله أرحم بالأولاد من والديهم؛ فنهى الوالدين أن يقتلوا أولادهم خوفًا من الفقر والإملاق وتكفل برزق الجميع.
అల్లాహ్ సంతానముపై వారి తల్లిదండ్రులకన్న ఎక్కువ దయ గలిగినవాడు. అందుకనే తల్లిదండ్రులకి తమ సంతానమును పేదరికం,దరిద్రం భయం వలన హతమార్చటం నుండి వారించాడు. అందరికి ఆహారోపాధి ద్వారా పోషించాడు.

• في الآيات دليل على أن الحق في القتل للولي، فلا يُقْتَص إلا بإذنه، وإن عفا سقط القصاص.
హత్య విషయంలో దగ్గరి వారికి హక్కు ఉన్నదని ఆయతుల్లో ఆధారం ఉన్నది. అతని అనుమతితోనే హత్య ప్రతీకారము తీసుకొనబడును. ఒక వేళ అతను మన్నిస్తే హత్య యొక్క ప్రతీకార ఆదేశము తొలగిపోవును.

• من لطف الله ورحمته باليتيم أن أمر أولياءه بحفظه وحفظ ماله وإصلاحه وتنميته حتى يبلغ أشده.
అనాధ విషయంలో అతడు యవ్వన దశకు చేరుకునేంత వరకు అతని పోషకులకు అతని సంరక్షణ గురించి,అతని సంపద సంరక్షణ గురించి,దాన్ని సంస్కరించటం గురించి,దాన్ని వృద్ధి పరచటం గురించి ఆదేశించటం అల్లాహ్ దయ,ఆయన కారుణ్యము లోనిది.

 
Vertaling van de betekenissen Vers: (33) Surah: al-Israa
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran. - Index van vertaling

Uitgegeven door het Tafsier Centrum voor Koranstudies.

Sluit