Check out the new design

Vertaling van de betekenissen Edele Qur'an - Telugu-vertaling - Abdul Rahim bin Mohammed * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: An-nisa   Vers:
اَلرِّجَالُ قَوّٰمُوْنَ عَلَی النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعْضَهُمْ عَلٰی بَعْضٍ وَّبِمَاۤ اَنْفَقُوْا مِنْ اَمْوَالِهِمْ ؕ— فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلْغَیْبِ بِمَا حَفِظَ اللّٰهُ ؕ— وَالّٰتِیْ تَخَافُوْنَ نُشُوْزَهُنَّ فَعِظُوْهُنَّ وَاهْجُرُوْهُنَّ فِی الْمَضَاجِعِ وَاضْرِبُوْهُنَّ ۚ— فَاِنْ اَطَعْنَكُمْ فَلَا تَبْغُوْا عَلَیْهِنَّ سَبِیْلًا ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیًّا كَبِیْرًا ۟
పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్)[1], ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి[2]. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు[3].
[1] ఖవ్వామూన్ : ఖామా నుండి, అంటే నిలబడు, ఆధారమిచ్చేవారు, బాధ్యులు, అధికారులు, పోషకులు, రక్షకులు, నిర్వాహకులు, వ్యవహారకర్తలు అనే అర్థాలున్నాయి. ఇస్లాంలో స్త్రీల బాధ్యత ప్రతి దశలో పురుషులపై ఉంది. బాల్యం నుండి వివాహమయ్యే వరకు, తండ్రిపై, తరువాత భర్తపై, భర్త లేకుంటే సోదరునిపై, లేక కుమారునిపై, చివరకు దగ్గరి బంధువులు ఎవ్వరూ లేకుంటే, ఇస్లామీయ ప్రభుత్వంపై ఉంటుంది. [2] ఎన్నో 'స'హీ'హ్ హదీస్'ల ప్రకారం, ఒకవేళ స్త్రీ అశ్లీలానికి పాల్పడితేనే, అది కూడా ఆమెకు ఎక్కువ బాధ కలిగించకుండా మెల్లగా మాత్రమే కొట్టాలని బోధింపబడింది. ('స హా సిత్తా, అ'హ్మద్, ఇబ్నె - 'హిబ్బాన్, 'హాకిం, 'అబ్దుల్లాహ్ ఇబ్నె 'అబ్బాస్ ర'ది.'అ. కథనం; బై'హఖి, ఉమ్మె-కుల్ సూ'మ్ ర.'అన్హా కథనం). [3] కబీరున్ (అల్ - కబీర్) : = అల్ 'అ"జీము, The Greatest, The most Magnified, మహానీయుడు, మహత్వం, ప్రభావం గలవాడు, సర్వాధికుడు. చూడండి, 22:62, 31:30, 34:23, 40:12. అల్ - ముతకబ్బిరు : The Incomparably Great, గొప్పవాడు, గొప్పదనానికి సరోవరం, 59:23. ఇవ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
Arabische uitleg van de Qur'an:
وَاِنْ خِفْتُمْ شِقَاقَ بَیْنِهِمَا فَابْعَثُوْا حَكَمًا مِّنْ اَهْلِهٖ وَحَكَمًا مِّنْ اَهْلِهَا ۚ— اِنْ یُّرِیْدَاۤ اِصْلَاحًا یُّوَفِّقِ اللّٰهُ بَیْنَهُمَا ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا خَبِیْرًا ۟
మరియు వారిద్దరి (భార్యాభర్తల) మధ్య సంబంధాలు తెగి పోతాయనే భయం మీకు కలిగితే అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకో గోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.
Arabische uitleg van de Qur'an:
وَاعْبُدُوا اللّٰهَ وَلَا تُشْرِكُوْا بِهٖ شَیْـًٔا وَّبِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّبِذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَالْجَارِ ذِی الْقُرْبٰی وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْۢبِ وَابْنِ السَّبِیْلِ ۙ— وَمَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ مُخْتَالًا فَخُوْرَا ۟ۙ
మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో[1], ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి[2]. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు[3].
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవాడు, తన పొరుగువాడికి మేలు చేయాలి." ('స'హీ'హ్ బు'ఖారీ, 'స. ముస్లిం). [2] బానిసలను విడిపించటం ఎంతో ఉత్తమమైన కార్యం చూడండి, 9:60 మరియు 2:177. [3] చూడండి, 'స'హీ'హ్ ముస్లిం కితాబుల్ ఈమాన్, బాబె త'హ్రీమ్, 'హదీస్' నం. 91.
Arabische uitleg van de Qur'an:
١لَّذِیْنَ یَبْخَلُوْنَ وَیَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ وَیَكْتُمُوْنَ مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟ۚ
ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచి పెట్టే వారినీ (అల్లాహ్ ప్రేమించడు)[1]. మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 522.
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: An-nisa
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Telugu-vertaling - Abdul Rahim bin Mohammed - Index van vertaling

Vertaald door Abdur Rahim bin Mohammad.

Sluit