Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: اسراء   آیت:
عَسٰی رَبُّكُمْ اَنْ یَّرْحَمَكُمْ ۚ— وَاِنْ عُدْتُّمْ عُدْنَا ۘ— وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكٰفِرِیْنَ حَصِیْرًا ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా బహుశా మీ ప్రభువు ఒక వేళ మీరు ఆయనతో పశ్చాత్తాప్పడి మీ కర్మలను మంచిగా చేసుకుంటే ఈ తీవ్ర ప్రతీకారము తరువాత మీపై దయ చూపుతాడేమో. మరియు ఒక వేళ మీరు మూడోసారి లేదా ఎక్కువ సార్లు సంక్షోభం రేకెత్తించటానికి మరలితే మేము మీతో ప్రతీకారం తీర్చుకోవటానికి మరలుతాము. మరియు మేము నరకమును అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు పరుపుగా, ఒడిగా చేస్తాము వారు దాని నుండి ఖాళీ అవ్వరు.
عربي تفسیرونه:
اِنَّ هٰذَا الْقُرْاٰنَ یَهْدِیْ لِلَّتِیْ هِیَ اَقْوَمُ وَیُبَشِّرُ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا كَبِیْرًا ۟ۙ
నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ మంచి మార్గములను సూచిస్తుంది. అవి ఇస్లాం మార్గము మరియి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసే వారికి వారిని సంతోషమును కలిగించే దాని గురించి తెలియపరుస్తుంది. మరియు అది అల్లాహ్ వద్ద నుండి వారికి గొప్ప పుణ్యం లభిస్తుందని(తెలియపరుస్తుంది).
عربي تفسیرونه:
وَّاَنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟۠
మరియు పరలోకముపై విశ్వాసమును కనబరచని వారికి వారిని చెడు కలిగించే దాని గురించి తెలియపరుస్తుంది. మరియు అదేమిటంటే మేము వారి కొరకు ప్రళయదినాన బాధ కలిగించే శిక్షను తయారు చేసి ఉంచాము.
عربي تفسیرونه:
وَیَدْعُ الْاِنْسَانُ بِالشَّرِّ دُعَآءَهٗ بِالْخَیْرِ ؕ— وَكَانَ الْاِنْسَانُ عَجُوْلًا ۟
మరియు మానవుడు తన అజ్ఞానం వలన కోపం వచ్చినప్పుడు తనపై,తన సంతానముపై,తన సంపదపై తన కొరకు మంచిని అర్ధించినట్లు చెడును అర్ధించేవాడు. ఒక వేళ మేము చెడు గురించి అతని అర్ధనను స్వీకరించి ఉంటే అతడు నాశనమయ్యేవాడు,అతని సంపద,అతని సంతానము నాశనమయ్యేది. మానవుడు స్వాభావిక పరంగా తొందరపడేవాడు. అందుకనే అతడు తనకు నష్టం కలిగించేదాన్ని తొందర చేసుకున్నాడు.
عربي تفسیرونه:
وَجَعَلْنَا الَّیْلَ وَالنَّهَارَ اٰیَتَیْنِ فَمَحَوْنَاۤ اٰیَةَ الَّیْلِ وَجَعَلْنَاۤ اٰیَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّكُمْ وَلِتَعْلَمُوْا عَدَدَ السِّنِیْنَ وَالْحِسَابَ ؕ— وَكُلَّ شَیْءٍ فَصَّلْنٰهُ تَفْصِیْلًا ۟
మరియు మేము రాత్రిని,పగలును అల్లాహ్ ఏకత్వముపై,ఆయన సామర్ధ్యంపై సూచించే రెండు సూచనలుగా సృష్టించాము, ఆ రెండింటిలో ఉన్న పొడవవటంలో,చిన్నదవటంలో,వేడిలో,చల్లదనములో విభేదము వలన. మేము రాత్రిని విశ్రాంతి కొరకు,నిదుర కొరకు చీకటిగా చేశాము. మరియు మేము పగలును కాంతివంతంగా చేశాము. అందులో ప్రజలు చూస్తున్నారు,తమ జీవన సామగ్రి కొరకు శ్రమిస్తున్నారు. ఆ రెండింటి ఒకదాని వెనుక ఇంకొకటి రావటం ద్వారా మీరు సంవత్సరముల లెక్కను,మీకు అవసరమైన నెలలు,రోజులు,గంటల వేళలను తెలుసుకుంటారని ఆశిస్తూ. మేము ప్రతి వస్తువును వస్తువుల్లో వ్యత్యాసం ఉండటానికి,అసత్యము నుండి సత్యము స్పష్టమవటానికి స్పష్టపరిచాము.
عربي تفسیرونه:
وَكُلَّ اِنْسَانٍ اَلْزَمْنٰهُ طٰٓىِٕرَهٗ فِیْ عُنُقِهٖ ؕ— وَنُخْرِجُ لَهٗ یَوْمَ الْقِیٰمَةِ كِتٰبًا یَّلْقٰىهُ مَنْشُوْرًا ۟
మరియు మేము ప్రతీ మనిషిని అతని నుండి జరిగిన అతని ఆచరణను అతనితోపాటు ఉండేటట్లుగా మెడకు హారంగా చేశాము. అతని లెక్క తీసుకోబడనంత వరకు అది అతనితో వేరవదు. మరియు మేము ప్రళయదినాన అతని కొరకు ఒక పుస్తకమును వెలికి తీస్తాము. అందులో అతను చేసిన మంచీ,చెడును తన ముందట అతను తెరచి ఉన్నట్లుగా,పరచినట్లుగా పొందుతాడు.
عربي تفسیرونه:
اِقْرَاْ كِتٰبَكَ ؕ— كَفٰی بِنَفْسِكَ الْیَوْمَ عَلَیْكَ حَسِیْبًا ۟ؕ
ఆ రోజు మేము అతనితో ఇలా అంటాము : ఓ మానవుడా నీవు నీ పుస్తకమును (కర్మల పుస్తకమును) చదువు. నీ కర్మల పై నీ స్వయం యొక్క లెక్క బాధ్యత వహిస్తుంది. నీ లెక్క తీసుకోవటానికి ప్రళయదినాన స్వయంగా నీవు చాలు.
عربي تفسیرونه:
مَنِ اهْتَدٰی فَاِنَّمَا یَهْتَدِیْ لِنَفْسِهٖ ۚ— وَمَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— وَمَا كُنَّا مُعَذِّبِیْنَ حَتّٰی نَبْعَثَ رَسُوْلًا ۟
ఎవరైతే విశ్వాసము వైపునకు మార్గం పొందుతారో అతనికి మార్గం పొందినందుకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరైతే అపమార్గం పొందుతారో అతని అపమార్గము పొందినందుకు శిక్ష అతనిపైనే పడుతుంది. ఏ ప్రాణి వేరే ప్రాణి పాపమును మోయదు. మరియు ఏ జాతినీ వారి వద్దకు మేము ప్రవక్తలను పంపి వారికి వ్యతిరేకంగా ఆధారం నిలబెట్టనంతవరకు శిక్షించేవారము కాము.
عربي تفسیرونه:
وَاِذَاۤ اَرَدْنَاۤ اَنْ نُّهْلِكَ قَرْیَةً اَمَرْنَا مُتْرَفِیْهَا فَفَسَقُوْا فِیْهَا فَحَقَّ عَلَیْهَا الْقَوْلُ فَدَمَّرْنٰهَا تَدْمِیْرًا ۟
మరియు మేము ఏదైన బస్తీ వారిని వారి దుర్మార్గం వలన తుదిముట్టించదలచుకుంటే ఎవరైతే అనుగ్రహాల్లో మునిగి అహంకారమును చూపిన వారికి విధేయత పాటించమని ఆదేశించాము. కాని వారు దాన్ని పాటించలేదు. అంతేకాక వారు పూర్తిగా అవిధేయతకు పాల్పడ్డారు.అప్పుడు కూకటి వేళ్ళతో పెకిలించే శిక్ష ద్వారా వారిపై మాట నిరూపితమైనది. అయితే మేము కూకటి వేళ్ళతో పెకిలించే వినాశనమును వారిపై కలిగించాము.
عربي تفسیرونه:
وَكَمْ اَهْلَكْنَا مِنَ الْقُرُوْنِ مِنْ بَعْدِ نُوْحٍ ؕ— وَكَفٰی بِرَبِّكَ بِذُنُوْبِ عِبَادِهٖ خَبِیْرًا بَصِیْرًا ۟
ఆద్,సమూద్ లాంటి ఎన్నో తిరస్కార జాతులవారిని నూహ్ తరువాత మేము నాశనం చేశాము.ఓ ప్రవక్త తన దాసుల పాపములను తెలుసుకోవటానికి,వీక్షించటానికి మీ ప్రభువు చాలు.వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من اهتدى بهدي القرآن كان أكمل الناس وأقومهم وأهداهم في جميع أموره.
ఎవరైతే ఖుర్ఆన్ మార్గము ద్వారా సన్మార్గము పొందుతాడో అతడు తన పూర్తి వ్యవహారాల్లో ప్రజలందరిలోకెల్ల పరిపూర్ణమైనవాడు,వారిలో ఎక్కువ సమగ్రమైనవాడు,వారిలో ఎక్కువ సన్మార్గం పొందినవాడు.

• التحذير من الدعوة على النفس والأولاد بالشر.
సందేశము ద్వారా స్వయంపై,సంతానముపై కీడు గురించి హెచ్చరిక.

• اختلاف الليل والنهار بالزيادة والنقص وتعاقبهما، وضوء النهار وظلمة الليل، كل ذلك دليل على وحدانية الله ووجوده وكمال علمه وقدرته.
రాత్రి,పగలు ఎక్కువవటం ద్వారా,తక్కువవటం ద్వారా,ఆ రెండింటి ఒకదాని తరువాత ఒకటి రావటం ద్వారా,పగటి వెలుగు ద్వారా,రాత్రి చీకటి ద్వారా విభేదము వీటన్నింటిలో ప్రతీది అల్లాహ్ ఏకత్వముపై,ఆయన అస్తిత్వముపై,ఆయన జ్ఞానము పరిపూర్ణమవటంపై,ఆయన సామర్ధ్యంపై ఆధారము.

• تقرر الآيات مبدأ المسؤولية الشخصية، عدلًا من الله ورحمة بعباده.
ఆయతులు వ్యక్తిగత బాధ్యత సూత్రాన్ని అల్లాహ్ వద్ద నుండి న్యాయంగా,ఆయన దాసులపై కారుణ్యంగా నిర్ణయిస్తాయి.

 
د معناګانو ژباړه سورت: اسراء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول