د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (62) سورت: النور
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاِذَا كَانُوْا مَعَهٗ عَلٰۤی اَمْرٍ جَامِعٍ لَّمْ یَذْهَبُوْا حَتّٰی یَسْتَاْذِنُوْهُ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَاْذِنُوْنَكَ اُولٰٓىِٕكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ ۚ— فَاِذَا اسْتَاْذَنُوْكَ لِبَعْضِ شَاْنِهِمْ فَاْذَنْ لِّمَنْ شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారో,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తారో వారే తమ విశ్వాసములో సత్యవంతులైన విశ్వాసవంతులు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఏదైన వ్యవహారం విషయంలో ముస్లిముల ప్రయోజనం కొరకు సమావేశమైనప్పుడు వారు ఆయనతో తాము మరలటానికి అనుమతి కోరనంత వరకు వారు మరలరు. ఓ ప్రవక్తా నిశ్ఛయంగా ఎవరైతే మరలేటప్పుడు మీతో అనుమతి కోరుతారో వారందరు వాస్తవానికి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారు,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరిచే వారు. వారు తమ అత్యవసర ఏదైన పని నిమిత్తం మీతో అనుమతి కోరినప్పుడు మీరు వారిలో నుండి ఎవరికి అనుమతినివ్వదలచుకుంటే వారికి అనుమతినివ్వండి. మరియు వారి పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• دين الإسلام دين النظام والآداب، وفي الالتزام بالآداب بركة وخير.
ఇస్లాం ధర్మం క్రమం,పధ్ధతుల యొక్క ధర్మం. మరియు పధ్ధతులకు కట్టుబడి ఉండటంలో శుభము,మేలు ఉంటాయి.

• منزلة رسول الله صلى الله عليه وسلم تقتضي توقيره واحترامه أكثر من غيره.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఇతరుల కన్న ఎక్కువగా ఆయనను గౌరవించటమును నిర్ధారిస్తుంది.

• شؤم مخالفة سُنَّة النبي صلى الله عليه وسلم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయమును విబేధము యొక్క అశుభము.

• إحاطة ملك الله وعلمه بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ యొక్క అధికారము,ఆయన జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది.

 
د معناګانو ژباړه آیت: (62) سورت: النور
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول