Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: شعراء   آیت:
كَذَّبَتْ قَوْمُ لُوْطِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ
లూత్ అలైహిస్సలాం జాతి వారు తమ ప్రవక్త లూత్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలను తిరస్కరించారు.
عربي تفسیرونه:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వారి సోదరుడు లూత్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటంను విడనాడి భయపడరా ?!.
عربي تفسیرونه:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
عربي تفسیرونه:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
عربي تفسیرونه:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
عربي تفسیرونه:
اَتَاْتُوْنَ الذُّكْرَانَ مِنَ الْعٰلَمِیْنَ ۟ۙ
ఏమీ మీరు ప్రజల్లోంచి మగవారి వద్దకు (కామ కోరికలను తీర్చుకోవటానికి) వారి వెనుక భాగంలో వస్తున్నారా ?!.
عربي تفسیرونه:
وَتَذَرُوْنَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِّنْ اَزْوَاجِكُمْ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ عٰدُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించిన మీ భార్యల మర్మావయవాల వద్దకు రావటమును వదిలివేశారు. కానీ మీరు ఈ చెడు అపరిమితితో అల్లాహ్ హద్దులను మితిమీరిపోయారు.
عربي تفسیرونه:
قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰلُوْطُ لَتَكُوْنَنَّ مِنَ الْمُخْرَجِیْنَ ۟
ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : ఓ లూత్ నీవు ఒక వేళ మమ్మల్ని ఈ చర్య నుండి ఆపటం నుండి, దాన్ని మాపై ఇష్టపడకపోవటం నుండి విడనాడకపోతే తప్పక నీవు,నీతోపాటు ఉన్న వారు మా ఊరి నుండి వెళ్ళగొట్టబడుతారు.
عربي تفسیرونه:
قَالَ اِنِّیْ لِعَمَلِكُمْ مِّنَ الْقَالِیْنَ ۟ؕ
లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నిశ్ఛయంగా మీ ఈ చర్యను అసహ్యించుకునే,ధ్వేషించుకునే వారిలో నేనూ ఉన్నాను.
عربي تفسیرونه:
رَبِّ نَجِّنِیْ وَاَهْلِیْ مِمَّا یَعْمَلُوْنَ ۟
ఆయన తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు వీరందరికి వీరు చేసిన దుష్కర్మల వలన కలిగే శిక్ష నుండి నన్ను రక్షించు, నా ఇంటి వారిని రక్షించు.
عربي تفسیرونه:
فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِیْنَ ۟ۙ
అప్పుడు మేము అతని దఆను స్వీకరించి అతన్నీ,అతని ఇంటి వారందరినీ రక్షించాము.
عربي تفسیرونه:
اِلَّا عَجُوْزًا فِی الْغٰبِرِیْنَ ۟ۚ
ఆయన సతీమణి తప్ప. ఆమె అవిశ్వాసపరురాలు. ఆమె వెళ్ళిపోయె వారిలో,వినాశనం చెందేవారిలో నుండి అయిపోయింది.
عربي تفسیرونه:
ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِیْنَ ۟ۚ
ఆ పిదప లూత్,ఆయన ఇంటి వారు ఊరి నుండి (సదూమ్) బయలదేరిన తరువాత మిగిలి ఉన్న ఆయన జాతి వారిని మేము తీవ్రంగా వినాశనమునకు గురి చేశాము.
عربي تفسیرونه:
وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ۚ— فَسَآءَ مَطَرُ الْمُنْذَرِیْنَ ۟
మరియు మేము వారిపై వర్షమును కురిపించేటట్లుగా ఆకాశము నుండి రాళ్ళను కరిపించాము. లూత్ అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించారో,వారిని భయ పెట్టారో ఒక వేళ వారు తాము ఉన్న దుష్కర్మలను పాల్పడటంలో కొనసాగితే వారందరిపై కురిసే వర్షం ఎంతో చెడ్డదైనది.
عربي تفسیرونه:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన లూత్ అలైహిస్సలాం జాతి వారిపై ఆశ్లీల కార్యము వలన కురిసే శిక్షలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
عربي تفسیرونه:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
عربي تفسیرونه:
كَذَّبَ اَصْحٰبُ لْـَٔیْكَةِ الْمُرْسَلِیْنَ ۟ۚۖ
మద్యన్ కు దగ్గరలో ఉన్న దట్టమైన చెట్లు కల పట్టణం వారు తమ ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
عربي تفسیرونه:
اِذْ قَالَ لَهُمْ شُعَیْبٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వారి ప్రవక్త ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటమును విడనాడి భయపడరా ?!.
عربي تفسیرونه:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్ఛయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని,నాకు ఆయన దేనిని చేరవేయమని ఆదేశించాడో దానిపై నేను అధికం చేయను,తగ్గించను.
عربي تفسیرونه:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
عربي تفسیرونه:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
عربي تفسیرونه:
اَوْفُوا الْكَیْلَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُخْسِرِیْنَ ۟ۚ
మీరు ప్రజలకు అమ్మేటప్పుడు పూర్తిగా కొలవండి. ప్రజలకు అమ్మినప్పుడు కొలవటంలో తగ్గించే వారిలో మీరు కాకండి.
عربي تفسیرونه:
وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ۟ۚ
ఇతరుల కొరకు తూకమేసేటప్పుడు సరైన తూకముతో తూకమేయండి.
عربي تفسیرونه:
وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟ۚ
మరియు మీరు ప్రజల హక్కులను తగ్గించకండి. మరియు మీరు పాపకార్యములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను అధికం చేయకండి.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• اللواط شذوذ عن الفطرة ومنكر عظيم.
స్వలింగ సంపర్కము అనేది స్వభావం నుండి ఒక క్రమరాహిత్యం మరియు ఒక పెద్ద అసహ్యకరమైన చర్య.

• من الابتلاء للداعية أن يكون أهل بيته من أصحاب الكفر أو المعاصي.
సందేశ ప్రచారకుని ఇంటి వారు అవిశ్వాసపరులు,పాపాత్ములు కావటం అతని కొరకు పరీక్ష.

• العلاقات الأرضية ما لم يصحبها الإيمان، لا تنفع صاحبها إذا نزل العذاب.
భూ సంబంధాలు కలవారికి విశ్వాసం లేకపోతే శిక్ష అవతరించేటప్పుడు అవి ప్రయోజనం కలిగించవు.

• وجوب وفاء الكيل وحرمة التَّطْفِيف.
తూకములను సంపూర్ణంగా వేయటం తప్పనిసరి. మరియు తూకముల్లో హెచ్చుతగ్గులు చేయటం నిషేధము.

 
د معناګانو ژباړه سورت: شعراء
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول