د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (45) سورت: العنكبوت
اُتْلُ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنَ الْكِتٰبِ وَاَقِمِ الصَّلٰوةَ ؕ— اِنَّ الصَّلٰوةَ تَنْهٰی عَنِ الْفَحْشَآءِ وَالْمُنْكَرِ ؕ— وَلَذِكْرُ اللّٰهِ اَكْبَرُ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا تَصْنَعُوْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన ఖుర్ఆన్ ను ప్రజలకు చదివి వినిపించండి. మరియు మీరు నమాజును పరిపూర్ణంగా పాటించండి. నిశ్చయంగా పరిపూర్ణ లక్షణాలతో చేయబడిన నమాజు హృదయములలో పాపములకు పాల్పడటం నుండి ఆపే,సత్కార్యములు చేయటానికి మార్గదర్శకం చేసే వెలుగు కలగటం వలన దాన్ని (నమాజును) పాటించే వాడిని పాపకార్యములలో,దుష్కార్యముల్లో పడటం నుండి ఆపుతుంది. అల్లాహ్ ధ్యానము ప్రతీ వస్తువు నుండి పెద్దది,గొప్పది. మరియు వారు చేసేది అల్లాహ్ కి తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయన ముందు గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే మీకు మీ కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అవి మంచివైతే మంచిగా (ప్రతిఫలం) ఉంటుంది. మరియు ఒక వేళ అవి చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• أهمية ضرب المثل: (مثل العنكبوت) .
సాలె పురుగు ఉపమానము వలె ఉపమానములు తెలపటం యొక్క ప్రాముఖ్యత.

• تعدد أنواع العذاب في الدنيا.
లోకములో అనేక రకాల శిక్షలు గలవు.

• تَنَزُّه الله عن الظلم.
అల్లాహ్ హింస నుండి అతీతుడు.

• التعلق بغير الله تعلق بأضعف الأسباب.
అల్లాహేతరులతో అనుబంధము బలహీనమైన కారకాలతో అనుబంధము.

• أهمية الصلاة في تقويم سلوك المؤمن.
విశ్వాపరుని ప్రవర్తనను సరిచేయటంలో నమాజు ప్రాముఖ్యత.

 
د معناګانو ژباړه آیت: (45) سورت: العنكبوت
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول