Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: زخرف   آیت:
وَكَذٰلِكَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ قَرْیَةٍ مِّنْ نَّذِیْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ ۙ— اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّةٍ وَّاِنَّا عَلٰۤی اٰثٰرِهِمْ مُّقْتَدُوْنَ ۟
మరియు వీరందరు తిరస్కరించి తాము తమ తల్లిదండ్రల అనుకరణతో వాదించినట్లే ఓ ప్రవక్త మేము మీకన్న మునుపు ఏ బస్తీలో ఏ ప్రవక్తను తమ జాతి వారిని హెచ్చరించటానికి పంపించిన వారిలో నుండి ఐశ్వర్యవంతుల్లోంచి వారి నాయకులు,వారి పెద్దవారు మాత్రం ఇలా పలకకుండా ఉండలేదు : నిశ్చయంగా మేము మా తాతముత్తాతలను ఒకే ధర్మం పై,ఒకే సమాజంపై పొందాము. మరియు నిశ్చయంగా మేము వారి అడుగుజాడలను అనుసరించేవారము. అయితే మీ జాతి వారు ఈ విషయంలో కొత్త కాదు.
عربي تفسیرونه:
قٰلَ اَوَلَوْ جِئْتُكُمْ بِاَهْدٰی مِمَّا وَجَدْتُّمْ عَلَیْهِ اٰبَآءَكُمْ ؕ— قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
వారితో వారి ప్రవక్తలు ఇలా పలికారు : ఏమీ మీరు మీ తాతముత్తాతలనే అనుసరిస్తారా ఒక వేళ నేను వారు ఉన్న వారి ధర్మం కన్న మేలైనది మీ వద్దకు తీసుకుని వచ్చిన ?. వారు ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా మేము మీరు,మీకన్న మునుపు ప్రవక్తలు ఇచ్చి పంపించబడిన దాన్ని తిరస్కరిస్తున్నాము.
عربي تفسیرونه:
فَانْتَقَمْنَا مِنْهُمْ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟۠
అప్పుడు మేము మీ కన్న మునుపు ప్రవక్తలను తిరస్కరించినటువంటి సమాజములతో ప్రతీకారము తీర్చుకుని వారిని నాశనం చేశాము. కావున మీరు తమ ప్రవక్తలను తిరస్కరించిన వారి ముగింపు ఎలా జరిగినదో యోచన చేయండి. నిశ్చయంగా అది బాధాకరమైన ముగింపు అయినది.
عربي تفسیرونه:
وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ وَقَوْمِهٖۤ اِنَّنِیْ بَرَآءٌ مِّمَّا تَعْبُدُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో,తన జాతి వారితో మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని పలికినప్పటి వృత్తాంతమును గుర్తు చేసుకోండి.
عربي تفسیرونه:
اِلَّا الَّذِیْ فَطَرَنِیْ فَاِنَّهٗ سَیَهْدِیْنِ ۟
కాని నన్ను సృష్టించినటువంటి అల్లాహ్ తప్ప. నిశ్చయంగా ఆయనే నాకు తన దృఢమైన ధర్మమును అనుసరించటం నుండి నాకు ప్రయోజనం ఉన్న దాని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
عربي تفسیرونه:
وَجَعَلَهَا كَلِمَةً بَاقِیَةً فِیْ عَقِبِهٖ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ వాక్కును (లా యిలాహ ఇల్లల్లాహ్ ను) తన తరువాత తన సంతానములో విడిచి వెళ్ళారు - వారిలో క్రమం తప్పకుండా అల్లాహ్ ఏకత్వమును కొనియాడి,ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించని వారు కొనసాగారు - వారు అల్లాహ్ వైపునకు షిర్కు,పాపకార్యముల నుండి పశ్చాత్తాప్పడుతూ మరలుతారని ఆశిస్తూ.
عربي تفسیرونه:
بَلْ مَتَّعْتُ هٰۤؤُلَآءِ وَاٰبَآءَهُمْ حَتّٰی جَآءَهُمُ الْحَقُّ وَرَسُوْلٌ مُّبِیْنٌ ۟
తిరస్కారులైన ఈ ముష్రికులందరిని నేను తొందరగా వినాశనమునకు గురి చేయను. కాని నేను ఇహలోకంలో విడిచిపెట్టి వారికి ప్రయోజనం కలిగించాను. మరియు వారి కన్న మునుపు వారి తాతముత్తాతలకు ప్రయోజనం కలిగించాను. చివరికి వారి వద్దకు ఖుర్ఆన్ మరియు స్పష్ఠంగా వివరించే ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు.
عربي تفسیرونه:
وَلَمَّا جَآءَهُمُ الْحَقُّ قَالُوْا هٰذَا سِحْرٌ وَّاِنَّا بِهٖ كٰفِرُوْنَ ۟
మరియు ఎటువంటి సందేహం లేని సత్యమైన ఈ ఖుర్ఆన్ వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఇలా పలికారు : ఇది ఒక మంత్రజాలము,దీని ద్వారా ముహమ్మద్ మమ్మల్ని మంత్రజాలమునకు గురి చేస్తున్నాడు. మరియు నిశ్చయంగా మేము దీనిని తిరస్కరిస్తున్నాము. దీనిని మేము నమ్మమంటే నమ్మము.
عربي تفسیرونه:
وَقَالُوْا لَوْلَا نُزِّلَ هٰذَا الْقُرْاٰنُ عَلٰی رَجُلٍ مِّنَ الْقَرْیَتَیْنِ عَظِیْمٍ ۟
మరియు తిరస్కారులైన ముష్రికులు ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ను పేదవాడైన,అనాధ అయిన ముహమ్మద్ పై కాకుండా మక్కా లేదా తాయిఫ్ ప్రాంతముల్లోంచి ఇద్దరు గొప్ప వ్యక్తుల్లోంచి ఒకరిపై అవతరింపజేయలేదు.
عربي تفسیرونه:
اَهُمْ یَقْسِمُوْنَ رَحْمَتَ رَبِّكَ ؕ— نَحْنُ قَسَمْنَا بَیْنَهُمْ مَّعِیْشَتَهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِیًّا ؕ— وَرَحْمَتُ رَبِّكَ خَیْرٌ مِّمَّا یَجْمَعُوْنَ ۟
ఓ ప్రవక్తా ఏమిటీ వారు నీ ప్రభువు యొక్క కారుణ్యమును పంచిపెడుతున్నారా ? కనుక వారు తాము తలచిన వారికి దాన్ని ఇస్తున్నారు మరియు తాము తలచిన వారి నుండి దాన్ని ఆపుతున్నారు లేదా అల్లాహ్ నా ?. ఇహలోకములో మేము వారి ఆహారోపాధిని వారి మధ్య పంచిపెట్టాము. మరియు మేము వారిలో నుండి ఐశ్వర్యవంతులను,పేదవారిని తయారుచేశాము వారిలో నుండి కొందరు కొందరి ఆదీనంలో ఉండటానికి. మరియు పరలోకంలో తన దాసుల కొరకు నీ ప్రభువు కారుణ్యం వీరందరు కూడబెట్టే అంతమైపోయే ఇహలోక భాగము కన్న మేలైనది.
عربي تفسیرونه:
وَلَوْلَاۤ اَنْ یَّكُوْنَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً لَّجَعَلْنَا لِمَنْ یَّكْفُرُ بِالرَّحْمٰنِ لِبُیُوْتِهِمْ سُقُفًا مِّنْ فِضَّةٍ وَّمَعَارِجَ عَلَیْهَا یَظْهَرُوْنَ ۟ۙ
మరియు ఒక వేళ ప్రజలందరు అవిశ్వాసంలో ఒకే వర్గంగా తయారవుతారనే మాట గనుకు లేకుంటే మేము అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి గృహముల కప్పులను వెండితో తయారు చేసేవారము. మరియు వారి కొరకు దానిపై మెట్లను వెండితో చేసేవారము వారు ఎక్కేవారు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• التقليد من أسباب ضلال الأمم السابقة.
అనుకరణ పూర్వ సమాజాల మార్గభ్రష్టతకు కారణం.

• البراءة من الكفر والكافرين لازمة.
అవిశ్వాసం,అవిశ్వాసపరుల నుండి సంబంధం లేకుండా ఉండటం తప్పనిసరి.

• تقسيم الأرزاق خاضع لحكمة الله.
ఆహారోపాధులను పంచటం అల్లాహ్ విజ్ఞతకు కట్టుబడి ఉంటుంది.

• حقارة الدنيا عند الله، فلو كانت تزن عنده جناح بعوضة ما سقى منها كافرًا شربة ماء.
అల్లాహ్ వద్ద ఇహలోకము యొక్క అసహ్యత ఉన్నది. ఒక వేళ అది ఒక దోమ రెక్క అంత బరువంత ఉంటే దానిలో నుండి ఏ అవిశ్వాసపరునికి ఆయన నీటిని త్రాపించే వాడు కాదు.

 
د معناګانو ژباړه سورت: زخرف
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول