Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: مائده   آیت:
لُعِنَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰی لِسَانِ دَاوٗدَ وَعِیْسَی ابْنِ مَرْیَمَ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟
అల్లాహ్ దావూద్ పై అవతరింపజేసిన గ్రంధం జబూరులో,మర్యం కుమారుడగు ఈసా పై అవతరింపజేసిన గ్రంధం ఇంజీలులో ఇస్రాయీల్ సంతతిలో నుంచి సత్య తిరస్కారులైన వారిని తన కారుణ్యం నుండి ధూత్కరించాడని సమాచారమిస్తున్నాడు.వారు చేసిన పాపాలు,అల్లాహ్ గౌరవ ప్రధమైన విషయాల్లో హద్దు మీరటం కారుణ్యం నుండి ఈ ధూత్కారమునకు కారణం.
عربي تفسیرونه:
كَانُوْا لَا یَتَنَاهَوْنَ عَنْ مُّنْكَرٍ فَعَلُوْهُ ؕ— لَبِئْسَ مَا كَانُوْا یَفْعَلُوْنَ ۟
వారిలోని కొందరు కొందరిని పాపాలకు పాల్పడటం నుండి వారించే వారు కాదు,అంతే కాదు వారిలోంచి పాపాత్ములు తాము చేసే పాపాలను,చెడులను బహిర్గంగా చేసేవారు.ఎందుకంటే వారిని ఆపేవాడు ఎవడూ ఉండేవాడు కాదు.వారు చెడును నిర్మూలించటంను వదిలిపెట్టే కార్యం ఎంతో చెడ్డదైనది.
عربي تفسیرونه:
تَرٰی كَثِیْرًا مِّنْهُمْ یَتَوَلَّوْنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ اَنْفُسُهُمْ اَنْ سَخِطَ اللّٰهُ عَلَیْهِمْ وَفِی الْعَذَابِ هُمْ خٰلِدُوْنَ ۟
ఓ ప్రవక్తా ఈ యూదుల్లోంచి చాలా మంది అవిశ్వాసపరులు అవిశ్వాసపరులను ఇష్టపడటమును,వారి వైపునకు వాలటంను మీరు చూస్తారు.వారు మీతో శతృత్వమునకు పాల్పడుతారు. మరియు ఒకే దైవాన్ని విశ్వసించే వారితో శతృత్వమునకు పాల్పడుతారు.సత్య తిరస్కారులతో వారి చెలిమి దేనినైతే వారు ముందు పంపించుకున్నారో అది చెడ్డది.అది వారి పై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురవటానికి,ఎల్లప్పటికీ వారిని ఆయన నరకంలో ప్రవేశింపజేయటానికి కారణమైనది.వారు దాని నుండి ఎన్నటికి బయటకు రాలేరు.
عربي تفسیرونه:
وَلَوْ كَانُوْا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالنَّبِیِّ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِ مَا اتَّخَذُوْهُمْ اَوْلِیَآءَ وَلٰكِنَّ كَثِیْرًا مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
మరియు ఒక వేళ ఈ యూదులందరు నిజంగా అల్లాహ్ పై విశ్వాసమును చూపితే,ఆయన ప్రవక్తపై విశ్వాసమును చూపితే వారు బహుదైవారాధకులను విశ్వాసపరులను వదిలి వారి వైపునకు మగ్గుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోరు.ఎందుకంటే వారు సత్య తిరస్కారులను స్నేహితులుగా చేసుకోవటం నుండి వారించబడ్డారు.కాని చాలా మంది ఈ యూదులు అల్లాహ్ విధేయత నుండి,ఆయన స్నేహం నుండి,మరియు విశ్వాసుల స్నేహం నుండి దూరమైపోయారు.
عربي تفسیرونه:
لَتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِیْنَ اٰمَنُوا الْیَهُوْدَ وَالَّذِیْنَ اَشْرَكُوْا ۚ— وَلَتَجِدَنَّ اَقْرَبَهُمْ مَّوَدَّةً لِّلَّذِیْنَ اٰمَنُوا الَّذِیْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰی ؕ— ذٰلِكَ بِاَنَّ مِنْهُمْ قِسِّیْسِیْنَ وَرُهْبَانًا وَّاَنَّهُمْ لَا یَسْتَكْبِرُوْنَ ۟
ఓ ప్రవక్త మీపై,మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరచిన వారిపట్ల ప్రజలందరిలోకల్ల యూదులను వారిలో ఉన్న ద్వేషం,అసూయ,అహంకారము వలన మరియు విగ్రహారాధకులను,అల్లాహ్ తోపాటు సాటి కల్పించే ఇతరులను శతృత్వమును ప్రదర్శించటం మీరు చూస్తారు.మీపై,మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరిచే వారికి అత్యంత సన్నిహితులుగా వారిలో నుంచి కొందరిని మీరు పొందుతారు.వారు తమను నసారా (సహాయకులు) అని చెప్పుకుంటారు.వీరందరు ఈ విశ్వాసపరులకి సన్నిహితులు,ఎందుకంటే వారిలో మతాచర్యులు (పండితులు), ఆరాధకులు ఉన్నారు.వారు గర్వఅహంకారాలు లేని వినయవినమ్రతలు కలవారు.ఎందుకంటే గర్వఅహంకారము కలవాడి మనస్సులో మేలు అన్నది చేరదు (ఉండదు).
عربي تفسیرونه:
وَاِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَی الرَّسُوْلِ تَرٰۤی اَعْیُنَهُمْ تَفِیْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ ۚ— یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ ۟
నజాషీ,ఆయన సహచరులు లాంటి వీరందరూ మృధువైన హృదయం కలవారు.వారు అవతరింపబడిన ఖుర్ఆను ను విన్నప్పుడు ఈసా తీసుకుని వచ్చిన గ్రంధం పట్ల జ్ఞానం ఉండటం వలన అది సత్యమని గుర్తించినప్పుడు అణుకువతో ఏడవ సాగారు.వారంటారు ఓ మా ప్రభూ నీవు నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప జేసిన దానిని మేము విశ్వసిస్తున్నాము.నీవు మమ్మల్ని ప్రళయ దినాన ప్రజలపై వాదించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారితో పాటు వ్రాయి.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• ترك الأمر بالمعروف والنهي عن المنكر موجب لِلَّعْنِ والطرد من رحمة الله تعالى.
చెడు నుంచి వారించటం,మంచి గురించి ఆదేశమివ్వటంను వదిలి వేయటం శాపమును,అల్లాహ్ కారుణ్యం నుండి ధూత్కారమును తెచ్చి పెడుతుంది.

• من علامات الإيمان: الحب في الله والبغض في الله.
అల్లాహ్ కొరకు ఇష్టత,అల్లాహ్ కొరకు ధ్వేషము విశ్వాస సూచనలు.

• موالاة أعداء الله توجب غضب الله عز وجل على فاعلها.
అల్లాహ్ శతృవులతో స్నేహసంబంధాలను ఏర్పరచుకోవటం అల్లాహ్ ఆగ్రహానికి గురి చేస్తుంది.

• شدة عداوة اليهود والمشركين لأهل الإسلام، وفي المقابل وجود طوائف من النصارى يدينون بالمودة للإسلام؛ لعلمهم أنه دين الحق.
ముస్లిముల పట్ల బహుదైవారాధకుల,యూదుల శతృత్వం ఎక్కువ.వారికి విరుద్దంగా క్రైస్తవుల్లోంచి కొన్ని వర్గాలు ఇస్లాం సత్య ధర్మమని జ్ఞానం ఉండటం వలన ఇస్లాం ధర్మం పట్ల మక్కువ చూపారు.

 
د معناګانو ژباړه سورت: مائده
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول